newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

బిగ్ బ్రేకింగ్... షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్

09-12-201909-12-2019 06:45:18 IST
2019-12-09T01:15:18.547Z09-12-2019 2019-12-09T01:14:43.960Z - - 24-02-2020

బిగ్ బ్రేకింగ్... షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన షాద్ నగర్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో.. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. 

ఈ టీంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి విచారణ జరపాలని  ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు.. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసుల వివరాలను సిట్ సేకరించనుంది. ఇప్పటికే ఈ ఎన్ కౌంటర ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం సీరియస్ అయింది. కాల్పులు జరిగిన తీరుపై విచారణ జరుగుతోంది. దిశ తల్లిదండ్రుల వాంగ్మూలం కూడా ఆదివారం నమోదుచేసింది. 

ఇదిలా ఉంటే... మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు ఉంచారు. ఇవాళ  హైకోర్టు నిర్ణయం తరువాత మృతదేహాల అప్పగింత జరగనుంది. దీంతో మెడికల్ కాలేజీ వద్ద మూడంచెల భద్రతను ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle