newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత

22-07-202022-07-2020 18:15:15 IST
2020-07-22T12:45:15.540Z22-07-2020 2020-07-22T12:43:16.898Z - - 12-04-2021

బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్ 19తో పోరాడుతూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యుడు అచ్యుతరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కరోనా వైరస్ కి చికిత్స పొందుతున్నారు. అచ్యుతరావు మలక్‌పేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందిన‌ ఆయ‌న‌.. ప‌రిస్థితి విష‌మించి బుధ‌వారం క‌న్నుమూశారు.

ఆయ‌న వ‌య‌స్సు 58 సంవ‌త్స‌రాలు. అచ్యుత‌రావు సోద‌రుడు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే అదే ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయ‌న కోలుకొని ఈ రోజు డిశ్చార్జ్ అయిన‌ట్టు బంధువులు తెలిపారు. కానీ, అచ్యుతరావుని మాత్రం కాపాడలేకపోయారు. 

అచ్యుతరావు పేరు చెప్పగానే బాలకార్మికులు, పాఠశాలల్లో టీచర్ల వేధింపులకు గురైన విద్యార్ధినీ, విద్యార్ధులు గుర్తుకువస్తారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆయన స్పందించేవారు. తెలంగాణ, ఏపీ రాష్ట్ర బాల‌ల హక్కుల కోసం ‌ అచ్యుత రావు..ఎన్నో పోరాటాలు చేశారు. బాలల హక్కుల సంఘం పేరుతో ఎన్జీవోను స్థాపించి చిన్నారుల కోసం ఎంతో పోరాడారు.

హింస‌కు గుర‌వుతున్న బాల‌‌లెందరికో ఆయన ఆపన్నహస్తం అందించారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. గతంలో ఆయన రాష్ట్ర బాలల హక్కుల సంఘం కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. అచ్యుత‌రావు మ‌ర‌ణంపై ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.ఆయన లేని లోటు తీర్చలేనిదని, బాలల హక్కుల కోసం ఆయన అలుపెరుగక శ్రమించారని పలువురు పేర్కొన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle