newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

26-05-202026-05-2020 09:06:41 IST
Updated On 26-05-2020 10:00:47 ISTUpdated On 26-05-20202020-05-26T03:36:41.965Z26-05-2020 2020-05-26T03:36:36.106Z - 2020-05-26T04:30:47.038Z - 26-05-2020

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు కోడి పేరు చెబితే జనం దూరంగా పరుగులెత్తేవారు. కానీ ఇప్పుడు కోడిని కొనాలంటే కూడా ఆమడ దూరం వుండాల్సిందే. కోట శ్రీనివాసరావు అదేదో సినిమాలో తాడుకి కోడిని కట్టి.. ఉత్తి అన్నం తింటున్న సీన్ మళ్లీ రిపీట్ అవుతోంది. అసలు కోడి మాంసం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నట్టుగా తయారైంది. కోడికూర‌కి రెక్క‌లొచ్చాయి.

రెండు వారాల‌కి  ముందు హైద‌రాబాద్‌లో బోన్ లెన్ చికెన్ ధ‌ర కిలో రూ. 400 ఉండ‌గా, గత ఆదివారం ఏకంగా రూ.500కి చేరుకుంది. దీంతో మాంసం ప్రియులు గ‌గ్గోలు పెడుతున్నారు. ముక్కలేనిదే ముద్దదిగనివారు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. లాక్‌డౌన్ మొద‌లైన‌ప్పుడు కిలో చికెన్ ధ‌ర కేవ‌లం రూ.50 మాత్ర‌మే ఉండేది. కాని ప్ర‌స్తుతం పౌల్ట్రీ ప్రొడ‌క్ష‌న్ త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో చికెన్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి.

రెండునెలల క్రితం చికెన్ ఫ్రీ ఇచ్చినా తీసికెళ్లేవారు లేరు. కొంతమంది కోళ్ళను పడేశారు కూడా. కానీ ఇప్పుడు కోడి లేచి రెక్కలు విదిలిస్తోంది. నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా వుంది సీన్. 

కేవ‌లం బోన్‌లెస్ చికెనే కాదు స్కిన్ లెన్ చికెన్ ధ‌ర కూడా బాగా పెరుగుతుంది. స‌మ్మ‌ర్ వ‌ల‌న ఉత్ప‌త్తి పెద్ద‌గా ఉండ‌డం లేదని, సప్లయ్ తగ్గిపోయిందని చికెన్ సెంటర్ యజమానులు అంటున్నారు. హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ కూడా మూత ప‌డ‌డంతో చికెన్ సేల్స్ 60 శాతం ప‌డిపోయాయి. 

నెల రోజులకు పూర్వం చికెన్ రిటైల్‌లో రూ.80, హోల్‌ సేల్‌గా రూ.30 కూడా పలికింది. అదే సమయంలో కోళ్లకు వ్యాధి సోకడంతో చాలా చోట్ల అవి చనిపోయాయి. చికెన్‌ తినటంతో కరోనా వస్తుందని వదంతులు ప్రచారం సాగడంతో అమ్మకాలు తగ్గాయి. వారం రోజుల కిందట కిలో చికెన్‌ రూ.320 కూడా అమ్మకాలు జరిగాయి. ఇటు కోడిగుడ్లు కూడా గతంలో డజను 40 నుంచి 45 రూపాయలు వుంటే ఇప్పుడు 60 రూ.లు పలుకుతోంది.  రైతు బజార్లు, మార్కెట్లలో కోడిగుడ్లు విక్రయాలకు ఏర్పాట్లు  చేయడంతో గుడ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. 

ఎండాకాలం, లాక్ డౌన్ సడలింపుల నేప‌థ్యంలో కోళ్ళు సప్లై పెద్ద‌గా ఉండ‌డం లేదు. వ‌చ్చే నెలలో వ్యాపారం సాధార‌ణ స్థితికి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు వ్యాపారులు. కరోనా ఎఫెక్ట్ తో కోళ్ల ఫారాల యజమానులు కోళ్లను బాగా తగ్గించుకోవడంతో పాటు కోడిపిల్లల ఉత్పత్తి కూడా తగ్గించుకున్నారు. మరో వైపు  చికెన్‌ తినటం వల్ల కరోనా రాకపోగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం సాగటంతో చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది.

లాక్ డౌన్ ముగిశాక ప్ర‌తి రోజు రాష్ట్రంలో 10 ల‌క్ష‌ల కోళ్లు స‌ర‌ఫ‌రాచేస్తాం. ప్ర‌స్తుతానికి  4ల‌క్ష‌లు మాత్ర‌మే స‌ర‌ఫరా చేస్తున్నాం అని స్నేహ ఫార్మ్ చైర్మ‌న్ రామ్ రెడ్డి అంటున్నారు. ఇక మ‌ట‌న్ విష‌యానికి వ‌స్తే కొద్ది రోజుల క్రితం  కిలో ధ‌ర‌ రూ.1000గా ఉండేది. జీహెచ్ఎంసీలో  మటన్ అధిక ధరలకు  అమ్ముతున్న దుకాణాలపై దాడులు ప్రారంభించిన కిలో సుమారు రూ.700 రూపాయలకు అమ్ముడవుతోంది. మొత్తానికి  లాక్‌డౌన్ ఎఫెక్ట్‌, స‌మ్మ‌ర్ ఈ  రెండు మాంసాహార ప్రియులు నిరాశ‌కి గుర‌వుతున్నారు. బయట అందుబాటులో లేకపోవడంతో ఇంటికే చికెన్ తీసుకెళ్లి వండుకుంటున్నారు జనం. తాజాగా రెస్టారెంట్ల నుంచి హోం డెలివరీకి అవకాశం ఉండడంతో మళ్లీ వ్యాపారం పుంజుకోనుంది. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle