newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

04-04-202004-04-2020 10:20:21 IST
Updated On 04-04-2020 10:36:37 ISTUpdated On 04-04-20202020-04-04T04:50:21.523Z04-04-2020 2020-04-04T04:50:14.403Z - 2020-04-04T05:06:37.067Z - 04-04-2020

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం లాక్ డౌన్‌లో భాగంగా రాత్రింబవళ్లు రోడ్లపై కావలి కాస్తున్న తెలంగాణ పోలీసులకు జనం అరాచకం చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత వారంరోజులుగా ఎంత చెబుతున్నా వినకుండా రోడ్లమీదికి వచ్చేస్తున్న జనాలను చూసి వారిని అడ్డుకునే ప్రయత్నంలో సహనం కోల్పోయి లాఠీలకు పనిచెబుతున్న పోలీసులు నిజంగా అలిసిపోయారనే చెప్పాలి. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలనే లక్ష్యంతో పరిధిలు దాటి జనాన్ని చితకబాదుతూ ఆ క్రమంలో సోషల్ మీడియాకు చిక్కి సస్పెండ్‌కు కూడా గురవుతున్న రాష్ట్ర పోలీసులకు వారంరోజులకే తత్వం బోధపడినట్లుంది. 

ఒకవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతూ పాలనాయంత్రాంగాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అవసరం లేకున్నా బయటకు వచ్చి తమచేత దెబ్బలు తింటున్న జనంలో కోవిడ్-19 పట్ల ఏమాత్రం భయం లేకపోవడం చూసి తెలంగాణ పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఎందుకయ్యా ఆంక్షలు ధిక్కరించి రోడ్లమీదికి వస్తున్నారు అని అడిగితే జనం చెప్పే సమాధానాలు విని నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితుల్లో పోలీసులు మాకెందుకీ బాధ అంటూ వాపోతున్నారు. శుక్రవారం మండిస్తున్న వేసవి ఎండలో కూడా రోడ్లపై కావిలి కాస్తున్న పోలీసులను మీడియా అడిగిందే తడవుగా గత పదిరోజులుగా తాము పడుతున్ బాధలు, జనం పెడుతున్న వ్యథలపై వారు ఆవేదన వెళ్లగక్కేశారు. 

మేం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే..ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు. తలాతోకా లేని కారణాలతో రోడ్లపైకి వచ్చి కోవిడ్‌లాక్‌డౌన్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు’ అని హైదరాబాద్ పోలీసులు మీడియా ముందు వాపోయారు. ‘కొంతమంది తప్పుడు స్టిక్కర్లు వాహనాలకు అంటించుకుంటున్నారు. ఆటోవాలాలు ప్రయాణికులను ఎక్కించుకుని.. ఆస్పత్రికి వెళ్తున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారు’ అని కోవిడ్‌ విధుల్లో ఉన్న పలువురు పోలీసులు విచారం వ్యక్తం చేశారు.

రోడ్లమీదికి రావద్దని తెలీదా అని అడిగితే జండూబామ్ అయిపోయింది సార్ తీసుకోవాలని వచ్చా అంటాడొకడు. ఆశీర్వాద్ గోధుమపిండి కోసం వచ్చానంటాడొకడు. ఏడాది క్రితం నాటి చెల్లని మందుల చీటీ పట్టుకొచ్చి చూపుతాడొకడు. మా అక్కకు అన్నం లేదంట. ఇవ్వడానికి వెళుతున్నా అంటాడింకొకడు. ఇలా అబద్దాలు చెబుతూ దొంగదారిలో తప్పించుకుంటుంటే మేం కావలి కాసి ఏం ప్రయోజనం అంటూ పోలీసులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని బ్రేక్‌ చేయాలంటే లాక్‌డౌన్‌ను పాటించాల్సిందే.. నిత్యవసర వస్తువుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తే సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిందే.. నివాసముండే పరిధి నుంచి మూడు కిలోమీటర్లు దాటి బయటకు వెళ్తే కేసులు నమోదు చేస్తామంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా చాలామంది ప్రజల్లో మార్పు రావడం లేదు. ఏవేవో సాకులు చెబుతూ రోడ్లపై ఎంజాయ్‌ చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పు, పంచదారా అంటూ కాలనీల్లోని రోడ్లపై కొంతమంది తిరుగుతుండగా.. మందుల చీటీలు పట్టుకొని మరికొందరూ దూరప్రాంతాలకు వెళ్తున్నారు.

కొంతమంది పోకిరీలు నాలుగు వాటర్‌ బాటిళ్లు, నాలుగు ఫుడ్‌ ప్యాకెట్లు పెట్టుకొని సేవ పేరుతో బైకులకు స్టిక్కర్లు పెట్టుకొని ఊరంతా చక్కర్లుకొడుతున్నారు. కొందరు ఆటోవాలాలు మరో అడుగు ముందుకేసి ప్రయాణికులను ఆస్పత్రులకు తీసుకెళ్తున్నామంటూ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు.

పోలీసుల చెకింగ్‌ పాయింట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని సందులు, గొందులు దాటుకొని రోడ్లపైకి వెళ్తున్నారు. శ్రీనగర్‌కాలనీ నుంచి ఖైరతాబాద్‌కు ఎందుకొచ్చావ్‌.. అంటే ఆశీర్వాద్‌ గోధుమ పిండి కోసం అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మియాపూర్‌ టూ పంజాగుట్ట, ఎల్బీనగర్‌ టూ నాంపల్లి, ఉప్పల్‌ టూ గ్రీన్‌ల్యాండ్స్‌ వరకు పోలీసుల చెక్‌ పాయింట్ల వద్ద మీడియా చేరుకుని వాకబు చేస్తే దిగ్భాంతికరమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. చిన్న చిన్న కారణాలతో రోడ్లమీదకి వస్తూ మండుటెండలో చిరాకుపుట్టిస్తూ మా సహనానికే పరీక్ష పెడుతున్నారని పోలీసులు వాపోతున్నారు. నిలదీసినా వినరు. గద్దించినా వినరు. తిట్టినా వినరు. కొట్టినా వినరు. అదేదో కరొనా వైరస్ వ్యాప్తిని అరికట్టే గురుతుర బాధ్యత మామీదే ఉన్నట్లుగా జనం భావిస్తూ ఎవరి ఇష్టప్రకారం వారు తిరిగేస్తుంటే 24 గంటల డ్యూటీలో ఉండి మేం బావుకునేది ఏంటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఒకరి బైక్‌ను ఆపి లాక్‌డౌన్‌ కదా ఎందుకయ్యా బయటకు వచ్చావ్‌ అనడిగితే. సార్‌.. జిందాతిలస్మాత్‌ తెచ్చుకోవడానికి వెళ్తున్నా అన్నాడు. అదేరోజు మరో నలుగురు జండుబామ్‌ కారణం చెప్పారు. అందుకే ఇక ఇలా కాదని రోడ్డుమీదికి వచ్చిన  బైక్‌లను తక్షణం సీజ్‌ చేసేస్తున్నాం. అయినా జనం వినడం లేదు. బైకర్లు రావడం ఆపలేదు. వైరస్ పట్ల సీరియస్‌నెస్ ఏమీ లేని హైదరాబాద్ వాసులను ఎలా కంట్రోల్ చేయాలో ఏమీ పాలుపోవడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు.

కూరగాయలు కొనాలని వాహనాల్లో తిరుగుతారు తిరుగు ప్రయాణంలో కూరగాయలు తేకుండా జాలీగా వస్తారు. మా ఏరియాలో కేజీ ఉల్లిపాయ దొరకలేదు. అందుకే మలక్ పేట గంజ్‌కు పోతున్నా అంటాడొకడు. మెడికల్ షాపు పేరుతో ఏ విధమైన ప్రిస్క్రిప్షన్‌ లేకుండా వస్తారు. మందుల చీటీ ఏదీ అని అడిగితే నా మైండ్‌లో ఉన్నాయి సార్. ఫిక్సయిపోయాను అంటాడింకొకడు. అవి నిజమా లేక పరాచకాలాడుతున్నారా అనేది బోధపడదు. ఇలాంటి వాళ్ల మాటలు విని విని ఇక ఇది కాదు మార్గం అంటూ కనిపించిన బైక్‌ని, కారుని, వాహనాన్ని సీజ్ చేసి పడేస్తున్నాం.. అప్పటికీ జనం తిక్క కుదరటం లేదు. ఇంకా ఏం చేస్తే జనం కంట్రోల్ అవుతారో తెలీడం లేదు అంటున్నారు నగర పోలీసులు.

అయ్యా ఇదీ మన పోలీసుల బాధ. ఇప్పటికే ఢిల్లీలో ముస్లిం మతప్రబోధకుల తిరణాల జరిగి దేశం కొంప నిలువునా ముంచారు. అసలు కరోనా వైరస్‌ను పారదోలాలా వద్దా అనే అనుమానం కలిగేలా జనం పోలీసులతో ఆడుకుంటున్నారు. కాస్త వినండయ్యా.. ఇలాగే జనం ఆటలాడితే బాధ్యత ఉండక్కర్లా, మేం కాపాడుకుంటున్న ప్రాణాలు మీవి అంటూ పోలీసులు ఎదురు డైలాగులు వేస్తారేమో మరి.

పాపం పోలీసులు.. మరి.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle