newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

బస్సులు నడిపే నిర్ణయం కేసీయార్‌దే !

18-05-202018-05-2020 08:01:20 IST
Updated On 18-05-2020 08:03:19 ISTUpdated On 18-05-20202020-05-18T02:31:20.732Z18-05-2020 2020-05-18T02:30:05.082Z - 2020-05-18T02:33:19.984Z - 18-05-2020

బస్సులు నడిపే నిర్ణయం కేసీయార్‌దే !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ఆర్టీసీని కుదేలు చేస్తోంది. రెండునెలలుగా బస్సులు నడవక, ఆదాయం రాక నానా ఇబ్బందులు పడుతోంది ప్రజారవాణా వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్‌డౌన్‌ విధించింది. ఇవాళ్టినుంచి ఇది అమలులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ అవుతోంది.  దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్రం ఉత్తర్వు లు జారీ చేసింది. లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కేసీయార్ చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. 

రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బస్సులు, వాహన ప్రయాణాలకు తాజా మార్గదర్శకాల్లో కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సంపూర్ణ నిర్ణయాధికారం రాష్ట్రాలదే. ఈ సడలింపులను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి రాష్ట్ర మంత్రివర్గం ఓ నిర్ణ యం తీసుకోనుంది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి

గ్రేటర్ కరోనాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో గ్రేటర్ పరిధిలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లకు అనుమతిచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. ఈ విషయాలపై కేబినెట్‌ కూలంకషంగా చర్చించి నిర్ణ యం తీసుకోనుంది. ఎప్పట్లాగే మంత్రివర్గ భేటీ తర్వాత కేసీయార్ మీడియాతో ముచ్చటిస్తారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ బస్సులు మామూలు స్థితిలో నడిచే అవకాశం లేదు. ఎందుకంటే కరోనా వ్యాపించకుండా భౌతిక దూరం పాటించేలా సీట్లను మార్చనున్నారు. ఇప్పటికే నమూనాలు సిద్ధం అయ్యాయి. కొన్ని బస్సులను మోడల్ గా తీర్చిదిద్దారు. ఇప్పటికే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి వరుసకు ఒకరే ఉండేలా నమూనా రూపొందించారు. సూపర్‌ లగ్జరీ విషయం లో రెండు నమూనాలు సిద్ధం చేశారు. వరుసకు ఒకరే ఉండేలా ఒక రకం, మూడు సింగిల్‌ సీట్ల తో వరుసకు ముగ్గురు చొప్పున ఉండేలా రెండో నమూనా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఓ బస్సును కూడా సీట్లు మార్చి రెడీ చేశారు. 

సీఎం ఏ నమూనాకు ఓకె అంటారో చూసి ఆ విధంగా ముందుకెళతారు. అంతర్‌రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా.. అది ఇప్పుడే శ్రేయస్కరం కాదన్న అభి ప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కర్ణాటకలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి తిప్పవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఎట్టి పరిస్థితిలో ఆయా రాష్ట్రాలకు బస్సులు తిప్పే అవకాశం లేదని తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో మిగతా ప్రాంతాల మధ్య పరిమిత సంఖ్యలో సిటీ బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికిప్పుడు కాకున్నా వచ్చే నెల మొదటి వారం నుంచి వాటిని తిప్పొచ్చన్న అభిప్రాయం వుంది. నగరంలో దూరంగా ఉన్న 50 మార్గాలను ఇందుకోసం అధికారులు గుర్తించారు. సీటుకు ఒకరు, రెండు సీట్ల మధ్య ఒకరు నిలబడేలా.. వెరసి ఓ వరుసలో ముగ్గురు చొప్పు న ప్రయాణికులను అనుమతిస్తూ తిప్పే అవకాశం ఉంది. 

కండక్టర్లు బస్సులో కాకుండా, ఆయా రూట్ల స్టాపుల్లో ఇద్దరు చొప్పున ఉంటారు. ముందు డోర్‌ వద్ద ఒకరు టికెట్లు జారీ చేస్తుండగా, వెనక డోర్‌ నుంచి దిగే ప్రయాణికుల వద్ద టికెట్లు చెక్‌ చేస్తూ రెండో కండక్టర్‌ డ్యూటీలో ఉంటారు. మధ్యలో రన్నింగ్‌లో ఎవరైనా ప్రయాణికులు బస్సు ఎక్కితే టికెట్‌ తీసుకొనే అవకాశం ఉండనందున రెండో కండక్టర్‌ను పెట్టి చెకింగ్‌ విధులు అప్పగించనున్నారు. ప్రయాణికులు ముందు డోర్‌ నుంచి ఎక్కి వెనుక డోర్‌ నుంచి దిగాల్సి ఉంటుంది. కేవలం లాంగ్‌రూట్లుగా గుర్తించిన మార్గాల్లోనే బస్సులు తిరుగుతాయి. కేసులు ఎక్కువగా ఉన్న మార్గాల్లో తిరగవు. సీఎం ఆదేశం మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle