newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్‌కి కరోనా పాజిటివ్

26-07-202026-07-2020 17:47:28 IST
2020-07-26T12:17:28.750Z26-07-2020 2020-07-26T12:17:14.734Z - - 11-04-2021

బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్‌కి కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు ఏమీ లేకపోయినా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గతంలో మేయర్ బొంతు రామ్మోహన్ రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సార్లూ ఆయనకు నెగటివ్ అని వచ్చింది. తాజాగా మూడోసారి కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

తన కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 25 న కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కుటుంబ సభ్యులందరికి కరోనా నెగెటివ్ వచ్చిందని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా రిపోర్ట్‌లో కరోనా పాజిటివ్‌గా అని వచ్చిందని ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

వెంటనే తాను సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఈ వ్యవధి పూర్తయిన వెంటనే మళ్లీ టెస్ట్ చేయించుకొని, కరోనా పేషంట్ల కోసం ప్లాస్మాను డొనేట్ చేస్తానని మేయర్ ప్రకటించారు.గతంలోనూ మేయర్ బొంతు రామ్మోహన్ విధుల నిర్వహణలో భాగంగా నగరంలో పర్యటిస్తూ ఓ టీ దుకాణంలో ఛాయ్ తాగారు. ఆ తర్వాత ఆ దుకాణదారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తొలిసారి తొలిసారి ఆయనకు అప్పుడు కరోనా పరీక్ష నిర్వహించారు.

ఆయనతోపాటు కుటుంబం మొత్తానికి పరీక్ష చేయించగా, అందరికీ నెగటివ్‌గా వచ్చింది. ఆ తర్వాత కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంలోని మేయర్ పేషీలోని సిబ్బందికి కరోనా సోకింది. అప్పుడు కూడా వైద్యాధికారులు మేయర్‌కు కరోనా టెస్టులు చేశారు. రెండోసారి కూడా కరోనా నెగిటివ్ అనే వచ్చింది.

తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది మేయర్ చుట్టూ ఉంటున్నారు. దీంతో మళ్లీ మేయర్‌కు కరోనా పరీక్షలు చేయగా ఈసారి పాజిటివ్ అని వచ్చింది.

 

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle