newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

బలవన్మరణానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ మృతి.. నేడు ఖమ్మం బంద్

14-10-201914-10-2019 11:54:15 IST
Updated On 14-10-2019 12:13:48 ISTUpdated On 14-10-20192019-10-14T06:24:15.879Z14-10-2019 2019-10-14T06:22:37.910Z - 2019-10-14T06:43:48.609Z - 14-10-2019

బలవన్మరణానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ మృతి.. నేడు ఖమ్మం బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసినందుకు, 48 వేల పైగా సంస్థ సిబ్బందిని అనధికారికంగా ఉద్యోగాలనుంచి తొలగించినందుకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ ఖమ్మం జిల్లా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆదివారం చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషాదఘటనతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది, మద్దతిస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ నేడు ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. 

శనివారం సాయంత్రం ఖమ్మం పట్టణంలో తనను తాను సజీవ దహనం చేసుకుని తీవ్రగాయాల పాలైన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లోని అప్పోలో డీఆర్‌డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నూటికి 90 శాతం కాలినగాయాలైన శ్రీనివాసరెడ్డి ప్రాణాలు కాపాడలేకపోయామని వైద్యులు ప్రకటించారు. ఆదివారంతో ఆర్టీసీ సమ్మె తొమ్మిదవ రోజులో అడుగుపెట్టింది.

వారం రోజుల పాటు సమ్మె చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోగా రోజు రోజుకూ కార్మికుల పట్ల కాఠిన్యం ప్రకటిస్తూ అమానుషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్రంగా ఉద్వేగం చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

విధుల్లో చేరవలసిందిగా ఆర్టీసీ సిబ్బందికి పెట్టిన గడువును సంస్థ కార్మికులు ధిక్కరించి యూనియన్ల పిలుపు మేరకు సమ్మెను కొనసాగించడంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు  సమ్మెలో పాల్గొన్న 48 వేలమందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా కాంట్రాక్టు ఉద్యోగులను భారీ సంఖ్యలో నియమించనున్నట్లు పేర్కొనడంతో సిబ్బంది నిస్పృహకు గురయ్యారని యూనియన్ నేతలు ఆరోపించారు.

పైగా టీఎస్ ఆర్టీసీలో సమ్మె చేస్తున్న ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి అనుమతించబోమని కేసీఆర్ మొండి వైఖరి ప్రదర్శించడంతో సిబ్బందిలో ఆగ్రహావేశలు చెలరేగుతున్నాయని, కొంతమంది తీవ్ర భావోద్వేగంతో జీవితాన్ని ముగించుకునే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని యూనియన్ నేతలు పేర్కొన్నారు.

ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణం ఘటన తాను చికిత్స పొందుతున్న కంచన్‌బాగ్ ప్రాంతంలోని ఆసుపత్రి పరిసరాల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. వార్త వినగానే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని డ్రైవర్ మృతి పట్ల నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన నిరసనకారులను అదుపు చేయడంలో పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని నిరసనకారులు ఆర్టీసీ బస్సులను నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లపై చేయి చేసుకోవడమే కాకుండా ప్రయాణికులను బలవంతంగా బస్సుల్లోంచి దింపేసిన ఘటనలు జరిగాయి కానీ ఎవరూ గాయపడలేదని సమాచారం.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పది రోజులుగా సాగుతున్న సమ్మెను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ డ్రైవర్ మృతికి నిరసనగా సోమవారం ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిప్వడమే కాకుండా అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న టిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న తమ ప్రధాన డిమాండును అపహాస్యం చేయడమే కాకుండా సిబ్బంది డిమాండ్లన్నింటినీ తిరస్కరిస్తూ మొండి వైఖరి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రిపై ఉద్యోగ సంఘాలు, సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Image result for Telangana RTC driver who attempted self-immolation dies

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle