బండి సారథ్యం తెచ్చింది కొత్త ఉత్సాహం..!
14-03-202014-03-2020 14:15:46 IST
2020-03-14T08:45:46.873Z14-03-2020 2020-03-14T08:45:40.427Z - - 16-04-2021

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు బలమైన ప్రతిపక్షం లేదనేది అందరూ అంగీకరిస్తున్న మాట. బలమైన ప్రతిపక్షం ఉంటే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ, కాంగ్రెస్, బీజేపీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్నా నాయకత్వ సమస్యతో ఆ పార్టీ సతమతమవుతోంది. రోజురోజుకూ కాంగ్రెస్ రాష్ట్రంలో తీసికట్టుగా తయారవుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీకి మంచి అవకాశం ఉంది. కేంద్రంలో అధికారం, బలమైన నాయకత్వం ఉన్న బీజేపీకి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బలమైన క్యాడర్, నాయకత్వం లేదు. కానీ, ఈ పరిస్థితి ఇటీవల మారుతోంది. తెలంగాణలో బీజేపీ భవిష్యత్‌పై అనుమానాలు, హిందుత్వ అజెండా తెలంగాణలో చెల్లదనే అనుమానాలు ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో పటాపంచలయ్యాయి. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలోనూ బీజేపీకి మంచి భవిష్యత్ ఉంటుందనే నమ్మకం కలిగింది. దీంతో బీజేపీలోకి చేరికలు పెరిగాయి. అయితే, రాష్ట్ర బీజేపీ ఎప్పుడూ కొంతమంది నేతల మధ్యే నడుస్తుందని, కొత్త వారికి అవకాశాలు రావనే అభిప్రాయం ఉండేది. చాలా మంది ఇతర పార్టీల నాయకులు బీజేపీ పట్ల ఆసక్తితో ఉన్నా చేరడానికి ముందుకు రాకపోవడానికి ఇదే కారణం. కొందరైతే బీజేపీలో చేరేందుకు సిద్ధపడి మరీ వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో బీజేపీ బండి సంజయ్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించడంతో మరోసారి ఇతర పార్టీల నాయకుల చూపు బీజేపీ వైపు మళ్లింది. బండి సంజయ్‌ది డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్. ఆయన ఎంపీ అయినా సామాన్య కార్యకర్తలాగా వ్యవహరిస్తారు. బండి సంజయ్ పట్ల బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకుల్లోనూ మంచి అభిప్రాయం ఉంది. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టే పార్టీ ప్రయోజనాల కోసమే ఆయన పని చేస్తారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కావడం వల్ల బీజేపీకి తెలంగాణ అవకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పార్టీ క్యాడర్‌లోనూ చాలా జోష్ కనిపిస్తోంది. ఇంతకుముందు బీజేపీలో చేరాలని భావించి ఆగిపోయిన ఇతర పార్టీల నేతలు కూడా ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. బండి సంజయ్ మున్నూరు కాపు సామాజకవర్గానికి చెందిన నాయకుడు. తెలంగాణలో ఈ సామాజకవర్గం గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇది బండి సంజయ్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఓసీల నాయకత్వం ఉండగా, బీజేపీ బీసీల నాయకత్వం ఉంది. ఒకవేళ బండి సంజయ్ నాయకత్వంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందనే సూచనలు కనిపిస్తే బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆయన ద్వారా బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందనే ఆశ బీసీల్లో కలగవచ్చు. అయితే, హిందుత్వ ఎజెండాకే బండి సంజయ్ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారనే పేరుంది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ ఒక్క అంశంతో పాటు ప్రజా సమస్యలపై ఎక్కువగా పోరాడాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా ఆయన రాష్ట్రంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. బండి సంజయ్ ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాకే పరిమితమైన నాయకుడు. ఆయన ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాజకీయ, సామాజక పరిస్థితులు, సమస్యలపై అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది. మొత్తానికి బండి సంజయ్‌కు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం మాత్రం రాష్ట్ర బీజేపీకి కొత్త ఉత్తేజం నింపిందనే చెప్పాలి.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా