newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ.. రేప్‌ల తెలంగాణ

01-12-201901-12-2019 12:09:01 IST
2019-12-01T06:39:01.954Z01-12-2019 2019-12-01T06:38:54.374Z - - 25-02-2020

బంగారు తెలంగాణ కాదు.. బార్ల తెలంగాణ.. రేప్‌ల తెలంగాణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ దేశంలో రాత్రిపూట, చీకట్లో జరిగే అన్ని నేర కార్యకలాపాలకు మద్యపానమే పునాదిరాయి అని న్యాయస్థానాలు సైతం తేల్చి పడేశాయి. కాని దున్నపోతు కంటే మందపు చర్మాలన ధరించిన మన ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపైనే బతికేద్దామనే యావలో పడి ప్రజారోగ్యాన్ని, ప్రజా సంస్కృతిని దశాబ్దాలుగా ధ్వంసం చేసిపడేస్తున్నాయి. మన ఇంటిమందుకు, వీధి మొదట్లో, నడిరోడ్డుపై వచ్చి చేరిన మద్యం షాపులు, బార్లు జాతీయ రహదార్లపై విచ్చలవిడిగా ఏర్పడిపోయి సకల నేరాలకు జాతీయ రహదారులనే అడ్డాలుగా మార్చివేశాయి. 

ఆ మద్యపాన మత్తులో మునిగి తేలి ఊరేగుతున్న నలుగురు కుర్రకుంకల రూపంలోని ముష్కరులు తెలంగాణ తల్లికి తలవంపులు తెస్తూ అన్నె పున్నె ఎరుగని ఒక అమాయకపు పశువైద్య అధికారిణిని కాల్చుకుతిన్నారు. తర్వాత తగుల బెట్టేశారు కూడా.. మద్యం మత్తులో ఊగుతున్న రాష్ట్రానికి పెద్దగా ఉన్న ప్రభుత్వాధినేతకు చీమకుట్టినట్లుగా కూడా లేకపోగా.. ఆర్టీసీ కార్మికులను పిలిచి అన్నం వడ్డించే ఏర్పాట్లో ఉండిపోవడం కంటే మించిన నేరస్థ చర్య మరొకటి ఉండదు.

మందేయడం, చిందేయడం తెలంగాణ సంస్కృతి అంటూ ఒక అవలక్షణాన్ని, ఒక చెడు వ్యసనాన్ని సంస్కృతిగా మార్చి తందనాలాడిన పెద్దమనుషులు ఎవరూ ఇవాళ నోరు మెదపడం లేదు. తాము వ్యవస్థీకరించిన మద్యపాన వ్యవస్థ ఎన్నెన్ని ఘోరాలకు,. నేరాలకు కారణమవుతోందో చూస్తూ కూడా వీరి నోట మాట రాదు. కానీ న్యాయస్థానాలు ఏనాడో నేరాల పునాది గురించి, మద్యపాన దురాచార దుష్ఫలితాల గురించి కుండబద్దలు కొట్టేశాయి. మద్రాసు హైకోర్టు ఈ మధ్య ఒక ఆసక్తికరమైన కేసుని విచారించి తీర్పు చెప్పింది. ఆ తీర్పు వచ్చినప్పుడు మీడియాలో అంతగా హైలైట్‌ కాలేదు కానీ ఇప్పుడు ఆ తీర్పుపై ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. 

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాల్ని తెప్పించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య కేసు చూస్తే ఆ తీర్పుని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పూటుగా మద్యం తాగి చేసిన నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత అని ఒక ఔత్సాహికుడు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ ఈ కేసుని విచారించి ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు, ఆల్కహాల్‌తో సంబంధం ఉన్న నేరాలకూ బాధ్యత వహించి తీరాలన్నారు. మద్యం మత్తులో జరిగే నేరాలను పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని తన తీర్పులో వెల్లడించారు. 

ఈ మధ్య కాలంలో యువత మద్యం, డ్రగ్స్‌కు బానిసలుగా మారి పెడదారి పడుతున్న ఘటనలూ ఎక్కువయ్యాయి. ఒంటి మీద స్పృహ లేని స్థితిలో రెచ్చిపోయే గుణం పెరుగుతుంది. చివరికి అది నేరాలకు దారి తీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70–85% మద్యం మత్తులో జరుగుతున్నవే. ఢిల్లీ నిర్భయ నుంచి తెలంగాణ నిర్భయ వరకు ఎన్నో అత్యాచారం, హత్య ఘటనలు మద్యం మత్తులో జరుగుతున్నాయన్న చేదు నిజం మింగుడు పడటం లేదు. 

దేశవ్యాప్తంగా ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు లిక్కర్‌ అమ్మకాలే ఆధారం. అందుకే ఏ రాష్ట్రాలూ మద్య నిషేధం జోలికి పోవడం లేదు. గుజరాత్, మిజోరం, నాగాల్యాండ్, బిహార్‌ రాష్ట్రాల్లో మాత్రమే మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దశలవారీగా సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఎన్నాళ్లు అమలవుతుంది, ఎంత విజయవంతమవుతుంది అనేది కాలం తేల్చాల్సిన సమస్యే.

కానీ ఈలోపు బంగారు తెలంగాణ పేరిట బార్ల తెలంగాణ, అత్యాచారాలతో కంపెక్కుతున్న తెలంగాణ మన కళ్లముందు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రియాంకను దారుణంగా అత్యాచారం చేసి తగులబెట్టిన ఆ ముష్కరులను కాల్చిపడేయాలని, ఎన్ కౌంటర్ చేయాలని మీడీయా మైకుల ముందు ఊగిపోతున్న జనం ఒక్కసారైనా మద్యపాన ఆధారిత నేరాలకు పునాది ఏమిటో, ఎవరి మీద బాణం ఎక్కుపెట్టాలో ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేదేమో..!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle