newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫ‌లిస్తున్న లాక్‌డౌన్‌.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఊర‌ట‌

21-04-202021-04-2020 08:08:27 IST
Updated On 22-04-2020 14:25:56 ISTUpdated On 22-04-20202020-04-21T02:38:27.354Z21-04-2020 2020-04-21T02:38:04.154Z - 2020-04-22T08:55:56.068Z - 22-04-2020

ఫ‌లిస్తున్న లాక్‌డౌన్‌.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఊర‌ట‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించ‌డంలో లాక్ డౌన్ మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంది. దేశంలో న‌మోద‌వుతున్న క‌రోనా పాజిటీవ్ కేసుల లెక్క‌లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎలా ఉంద‌ని అంచ‌నా వేయ‌డంలో వైర‌స్ పాజిటీవ్ కేసులు ఎన్ని రోజుల‌కు ఒక‌సారి రెట్టింపు అవుతున్నాయ‌నేది కీల‌కం.

దీనిని బ‌ట్టే క‌రోనా వ్యాప్తి ఎలా ఉంద‌నేది ఒక నిర్ధార‌ణ‌కు వ‌స్తారు. లాక్‌డౌన్‌కు ముందుతో పోల్చితే లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత కేసులు రెట్టింపు అవ‌డానికి ప‌డుతున్న స‌మ‌యం ఎక్కువ కావ‌డం ఊర‌ట‌నిస్తోంది. లాక్ డౌన్ స‌ఫ‌ల‌మైంద‌నే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

భార‌త్ వంటి జ‌నాభా ఎక్కువ ఉన్న, వైద్యారోగ్య సౌక‌ర్యాలు త‌క్కువ ఉన్న దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మరికి క‌ట్ట‌డి చేయాలంటే లాక్‌డౌన్ మిన‌హా మ‌రో మార్గం లేద‌ని ప‌లువురు నిపుణులు అంచ‌నా వేశారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా దేశం ఆర్థికంగా వెన‌క్కుపోతుంద‌ని తెలిసినా, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఎదుర్క‌వుతాయ‌ని తెలిసినా లాక్‌డౌన్‌కే మొగ్గు చూపింది. ప్ర‌పంచంలో అతి పెద్ద లాక్‌డౌన్‌గా ఇదే. ఇప్పుడు లాక్‌డౌన్ క‌రోనా వ్యాప్తిని త‌గ్గించింద‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది. లాక్‌డౌన్‌కు ముందు దేశంలో 3.4 రోజుల‌కు ఒకసారి క‌రోనా కేసులు రెట్టింపు అయ్యేవ‌ని, ఇప్పుడు 7.5 రోజుల‌కు ఒక‌సారి రెట్టింపు అవుతుతున్నాయి.

ఇక‌, కేసుల రెట్టింపు విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కొంత మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. దేశంలో స‌గ‌టున క‌రోనా పాజిటీవ్ కేసుల రెట్టింపున‌కు 7.5 రోజులు ప‌డుతుండ‌గా తెలంగాణ‌లో 9.4 రోజుల‌కు ఒక‌సారి కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా కేసుల రెట్టింపులో దేశ స‌గ‌టుతో చూసుకుంటే మెరుగ్గానే ఉంది. ఏపీలో క‌రోనా పాజిటీవ్ కేసులు రెట్టింపు కావ‌డానికి 10.6 రోజుల స‌మ‌యం ప‌డుతోంది.

కేసులు రెట్టింపు కావ‌డంలో దేశ స‌గ‌టుతో పోల్చితే 18 రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. వీటిల్లో ఒడిశా, కేర‌ళ చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశంలో మొద‌టి క‌రోనా కేసు న‌మోదైన కేర‌ళ క‌రోనాను విజ‌య‌వంతంగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. ఇప్పుడు కేర‌ళ‌లో కేసులు రెట్టింపు కావ‌డానికి 72.2 రోజుల స‌మ‌యం ప‌డుతోంది. ఇప్పటికి కేర‌ళ‌లో 402 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో స‌గం మంది కోలుకొని ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒడిశాలోనూ క‌రోనా అదుపులో ఉంది. ఒడిశాలో క‌రోనా కేసులు రెట్టింపు కావ‌డానికి 39.8 రోజుల స‌మ‌యం ప‌డుతోంది. ఇక్క‌డ ప్ర‌స్తుతం 68 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.

మ‌రో వైపు గోవా, మ‌ణిపూర్ క‌రోనా వైర‌స్ ఫ్రీ రాష్ట్రాలుగా మారాయి. ఈ రెండు రాష్ట్రాల్లో క‌రోనా బారిన ప‌డ్డ వారు పూర్తిగా కోలుకొని ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గోవాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు పాజిటీవ్ కేసులు న‌మోదుగా కాగా అంద‌రూ కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ యాక్టీవ్ కేసులు ఏమీ లేవు. కొత్త కేసులు కూడా న‌మోదు కావ‌డం లేదు. మ‌రోవైపు మ‌ణిపూర్ కూడా క‌రోనా ఫ్రీ స్టేట్ అయిన‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బిరేన్ సింగ్ ప్ర‌క‌టించారు. అక్క‌డ రెండు పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా, ఇద్ద‌రూ కోలుకున్నారు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle