newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణ..కేంద్రం తాజా నివేదికలో వెల్లడి

18-09-202018-09-2020 18:35:24 IST
Updated On 19-09-2020 13:48:37 ISTUpdated On 19-09-20202020-09-18T13:05:24.275Z18-09-2020 2020-09-18T13:05:20.839Z - 2020-09-19T08:18:37.605Z - 19-09-2020

ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణ..కేంద్రం తాజా నివేదికలో వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఇప్పుడు ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో రాష్ట్రం ఫ్లోరైడ్ ఫ్రీ స్టేట్ గా ప్రకటించబడిందని పేర్కొన్న కేటీఆర్.. మిషన్ భగీరథ బృందానికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి ముందు ఇక్కడి పల్లెటూళ్లను ఫ్లోరైడ్ పట్టి పీడించింది. అప్పట్లో తెలంగాణను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్యను నిర్మూరించడానికి చాలా పోరాటాలే జరిగాయి. ఆఖరికి ఇక్కడి నేతలు ఢిల్లీ కూడా వెళ్లి ఆందోళన చేశారు. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించలేదు. ప్రత్యేక రాష్ట్రం, కొత్త ప్రభుత్వం వచ్చాకే తెలంగాణ ప్రజలకు ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి దక్కింది.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మిషన్ భగీరథతోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు సురక్షితమైన త్రాగునీటిని అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2016 ఆగస్టు 6వ తేదీన మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు పడిన దాఖలాలు లేవు. త్రాగునీటి వల్ల వచ్చిన సమస్యలూ లేవు. సురక్షితమైన త్రాగునీటి వల్ల ఫ్లోరైడ్ సమస్య కనుమరుగైంది. ఇందుకు నిదర్శనం కేంద్రం విడుదల చేసిన నివేదికే.

కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఫ్లోరైడ్ ఫ్రీ రాష్ట్రంగా ఉంది. 2015 లో తెలంగాణలో 967 గ్రామాలు ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుగా ఉండగా.. ఇప్పుడు ఒక్క గ్రామంలో కూడా ఈ సమస్య లేదు. అలాగే  గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కూడా ఫ్లోరైడ్ ఫ్రీ రాష్ట్రాలుగా ప్రకటించింది కేంద్రం. ప్రస్తుతం దేశంలోని రాజస్థాన్ లో అత్యధికంగా 3,095 ప్రాంతాలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నాయి. ఇక ఆంధ్రా విషయానికొస్తే.. 2015లో 402 ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుండగా.. ప్రస్తుతం 111 ప్రాంతాలు ఇంకా ఫ్లోరైడ్ సమస్యతో సతమతమవుతున్నాయి. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle