newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఫ్రెండ్లీ ప్ర‌తిప‌క్షం క‌నిపించ‌దే..!

01-11-201901-11-2019 07:40:24 IST
Updated On 01-11-2019 17:58:12 ISTUpdated On 01-11-20192019-11-01T02:10:24.689Z01-11-2019 2019-11-01T02:08:59.834Z - 2019-11-01T12:28:12.372Z - 01-11-2019

ఫ్రెండ్లీ ప్ర‌తిప‌క్షం క‌నిపించ‌దే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష స్థానాన్ని ద‌క్కించుకుంది ఎంఐఎం పార్టీ. హైద‌రాబాద్ న‌గ‌రానికి, అందునా పాత‌బ‌స్తీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఆ పార్టీ కేసీఆర్ పుణ్య‌మా అని ప్ర‌తిప‌క్ష హోదా అందుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ఒక ఎమ్మెల్యే ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎంఐఎం ఫ్లోర్ లీడ‌ర్ అక్బ‌రుద్దిన్ ఓవైసీ ప్ర‌తిప‌క్ష నేత‌గా మారారు.

కాగా, ఎంఐఎం అధికార టీఆర్ఎస్ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతోంది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు ఒక అవ‌గాహ‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా పోటీ చేశాయి.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కే ఎంఐఎం మ‌ద్ద‌తు ఇచ్చింది. తెలంగాణ‌లో ఏర్ప‌డిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో ఎక్క‌డా లేని విధంగా అధికార పార్టీకి మిత్ర‌ప‌క్ష‌మే ప్ర‌తిప‌క్షంగా మారింది.

గ‌తంలోనూ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు మిత్ర‌ప‌క్షంగా ఉండేది. అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో ఎంఐఎం నేత‌ల‌కు మంచి సంబంధాలే ఉండేవి. అయినా, ఎంఐఎం కొన్ని విష‌యాల్లో గ‌ట్టిగానే మాట్లాడేది. అసెంబ్లీలో కూడా అన్ని అంశాల‌పై త‌మ వాయిస్‌ను బ‌లంగా వినిపించేది. ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసేది. కొన్ని విష‌యాల్లో త‌ప్పు ప‌ట్టేది.

అయితే, ఇప్పుడు టీఆర్ఎస్‌కు మిత్ర‌ప‌క్షంగా ఉంటున్న ఎంఐఎం ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. పాత‌బ‌స్తీకి సంబంధించిన అంశాలు మిన‌హా రాష్ట్రానికి సంబంధించిన విష‌యాల‌పై పెద‌వి విప్ప‌డం లేదు. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల అక్బ‌రుద్దిన్ ఓవైసీ యాక్టీవ్‌గా లేరు. ఎమ్మెల్యేలు అయితే వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అయ్యారు.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె వ్య‌వహారం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. 48 వేల ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా అన్ని పార్టీలు, ప్ర‌జా సంఘాలు రాజ‌కీయాలు, జెండాలు, అజెండాలు ప‌క్క‌న‌పెట్టి పోరాడుతున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ కూడా ఒకే వేదిక‌ను పంచుకుంటున్నాయి. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఇప్ప‌టికే స‌మ్మె 26 రోజులు పూర్త‌య్యింది. ఉద్యోగాలు ఉంటాయో లేదో అనే బెంగ‌తో కార్మికులు కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. మ‌రికొంద‌రు గుండెపోటుతో క‌న్నుమూస్తున్నారు.

నెల రోజులుగా రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్నా ఎంఐఎం పార్టీ మాత్రం క‌నీసం స్పందించ‌డం లేదు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కాకున్నా అనుకూలంగా అయినా మాట్లాడ‌టం లేదు.

క‌నీసం ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వానికి ఒక సూచ‌న కూడా ఇవ్వ‌డం లేదు. వివిధ జాతీయ అంశాల‌పై ప్ర‌తీరోజూ మీడియాతో, సోష‌ల్ మీడియాలో స్పందించే ఎంఐఎం అధినేత అస‌దుద్దిన్ ఓవైసీ స్వంత రాష్ట్రం తెలంగాణ‌లో ఇంత పెద్ద స‌మ‌స్య‌పై ఒక్క ట్వీట్ కూడా చేయ‌లేదు.

గ‌తంలోలా ఎంఐఎం అన్ని పార్టీల్లో ఒక పార్టీ అయితే ఏ అంశంపై స్పందించాలనేది వారి ఇష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న ఆ పార్టీ పాత‌బ‌స్తీని వ‌దిలి యావ‌త్ తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తే బాగుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   8 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle