newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఫ్రంట్లతో ప‌నిలేదు... చ‌క్రాలు తిర‌గ‌వు

20-05-201920-05-2019 07:48:04 IST
Updated On 27-06-2019 14:48:08 ISTUpdated On 27-06-20192019-05-20T02:18:04.963Z20-05-2019 2019-05-20T02:17:47.810Z - 2019-06-27T09:18:08.325Z - 27-06-2019

 ఫ్రంట్లతో ప‌నిలేదు... చ‌క్రాలు తిర‌గ‌వు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని, థ‌ర్డ్ ఫ్రంట్ లేదా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో కీల‌కం కావాల‌ని భావిస్తున్న ప్రాంతీయ పార్టీల‌కు చుక్కెదురైంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏక‌ప‌క్షం. మ‌రోసారి ఎన్డీఏ ప్ర‌భుత్వం రానుంద‌ని, స్ప‌ష్ట‌మైన మెజారిటీతో అధికారం కైవ‌సం చేసుకుంటుంద‌ని అంచ‌నా వేశాయి.

ఒక‌టిరెండు మిన‌హా అన్ని ప్ర‌ముఖ సంస్థ‌లూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగ‌ర్ సులువుగా దాటుతుంద‌ని తేల్చాయి. ఎన్డీఏ 282 నుంచి 306 స్థానాల వ‌ర‌కు రావ‌చ్చ‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. యూపీఏ గ‌తం కంటే కొంత పుంజుకున్నా మ‌ళ్లీ అధికారానికి ఆమ‌డ‌దూరంలోనే ఆగిపోనుంది.

ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు బీజేపీయేత‌ర ప‌క్షాల‌కు మింగుడుప‌డటం లేదు. ఈసారి ఎలాగైనా మోడీని గ‌ద్దె దించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న మ‌మ‌తా బెన‌ర్జీ, చంద్ర‌బాబు వంటి నేత‌ల‌కు ఈ అంచ‌నాలు వారి ఆశ‌ల‌ను అడియాశ‌లు చేసేలా ఉన్నాయి. చివ‌రి ద‌శ పోలింగ్ వ‌ర‌కు కూడా ఎన్డీఏకు పూర్తి మెజారిటీ రాద‌ని 200 లోపు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని బీజేపీయేత‌ర ప‌క్షాలు గ‌ట్టిగా న‌మ్మాయి.

అందుకే చంద్ర‌బాబు నాయుడు ఒక్క‌సారిగా జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌మ‌య్యారు. ఎన్డీయేత‌ర ప‌క్షాల నేత‌ల‌తో వ‌రుస భేటీలు జ‌రుపుతూ మోడీ వ్య‌తిరేక కూట‌మికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న మొద‌టిసారిగా ఇందుకోసం సోనియా గాంధీని సైతం క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఎట్టి ప‌రిస్థితుల్లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి రాకూడదనేదే వీరి ప్ర‌ధాన ల‌క్ష్యం. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాని పీఠాన్ని కూడా మిత్ర‌ప‌క్షాలకు వ‌దిలేందుకు సిద్ధంగా ఉంది.

ఈ పార్టీల ప్ర‌య‌త్నాలు ఫ‌లించాలంటే బీజేపీ మేజిక్ ఫిగ‌ర్ కు చాలా దూరం ఉండాలి. న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, కేసీఆర్‌, జ‌గ‌న్ వంటి వారు మ‌ద్ద‌తు ఇచ్చినా మోడీ అధికారాన్ని చేప‌ట్టే ప‌రిస్థితి ఉండొద్దు. ఇలా అయితే ఎన్డీయేత‌ర ప‌క్షాల‌న్నింటినీ ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నేది వీరి ల‌క్ష్యం.

ఇక‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కూడా ఎగ్జిట్ పోల్స్ మింగుడు ప‌డేవి కాదు. తెలంగాణ‌లో ఆ పార్టీ స్వీప్ చేస్తుంద‌ని తేలింది. అయినా, 16 సీట్ల‌తో కేంద్రంలో కీల‌క‌మ‌వ్వాల‌ని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మ‌ద్ద‌తుతోనే కేంద్రంలో ఏ ప్ర‌భుత్వ‌మైనా అధికారంలోకి రావాల‌ని ఆయ‌న భావించారు.

ఇప్పుడు మోడీకి ఫుల్ మెజారిటీ రావ‌డం ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండ‌టంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప‌నే అవ‌స‌రం లేకుండా పోయేట్లు ఉంది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ క‌నుక నిజ‌మైతే ఢిల్లీలో ఫ్రంట్లు ఏర్పాటు చేయాల‌ని, చ‌క్రం తిప్పాల‌ని, మోడీని గ‌ద్దె దించాల‌నుకుంటున్న నేత‌ల క‌ల‌లు క‌ల్ల‌లు అయిన‌ట్లే లెక్క‌. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle