newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఫేక్ న్యూస్‌కు చెక్‌.. టెక్నాల‌జీ ఉప‌యోగిస్తున్న ప్ర‌భుత్వాలు

16-04-202016-04-2020 07:53:48 IST
Updated On 16-04-2020 08:59:04 ISTUpdated On 16-04-20202020-04-16T02:23:48.087Z16-04-2020 2020-04-16T02:23:38.056Z - 2020-04-16T03:29:04.686Z - 16-04-2020

ఫేక్ న్యూస్‌కు చెక్‌.. టెక్నాల‌జీ ఉప‌యోగిస్తున్న ప్ర‌భుత్వాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఓ వైపు క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తుంటే క‌రోనాతో పోటీ ప‌డి మ‌రీ ఫేక్ న్యూస్ విజృంభిస్తోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి వాటిల్లో న‌కిలీ వార్త‌లు, అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొంద‌రు ఆక‌తాయిలు ప‌ని గ‌ట్టుకొని సృష్టిస్తున్న ఈ ప్ర‌చారాలు వీడియోలు, ఫోటోలు, మెసేజ్‌ల రూపంలో సోష‌ల్ మీడియాలో వేల మందికి చేరుతోంది. వీటిల్లో నిజానిజాలు తెలుసుకోకుండా షేర్ చేస్తూ న‌కిలీ వార్త‌ల వ్యాప్తిలో ప్ర‌జ‌లు భాగ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు తెలియ‌క చేసిన త‌ప్పుకు పోలీస్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు.

న‌కిలీ వార్త‌లు, త‌ప్పుడు ప్ర‌చారాలు ప్ర‌భుత్వాల‌కు సైతం ఇబ్బందిక‌రంగా మారాయి. ఒక్కోసారి స‌మాజంలో అల‌జ‌డులు సృష్టించేలా, ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు రేపేలా ఇవి ఉంటున్నాయి. దీంతో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు కూడా విఘాతం క‌లుగుతోంది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఇవి మ‌రింత పెరిగిపోయాయి. ఇటీవ‌ల ఢిల్లీ నిజాముద్దిన్‌లో జ‌రిగిన మ‌త ప్రార్థ‌న‌ల్లో క‌రోనా వైర‌స్ వ్యాపించిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ముస్లింల‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున త‌ప్పుడు ప్ర‌చారాలు, పాత వీడియోలు వైర‌ల్ అయ్యాయి. వీటిల్లో 90 శాతం న‌కిలీవే అని తేలింది.

ప్ర‌భుత్వాలు కూడా న‌కిలీ వార్త‌ల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేలా సోష‌ల్ మీడియాలో విచ్చ‌ల‌విడిగా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి క్రిష్టియ‌న్ అని, తిరుమ‌ల‌లో చ‌ర్చి క‌ట్టార‌ని పెద్ద ఎత్తున జ‌రిగిన త‌ప్పుడు ప్ర‌చారాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇటీవ‌ల నూత‌న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ క‌న‌గ‌రాజ్ పైన కూడా కొంద‌రు త‌ప్పుడు ఫోటోల‌తో దుష్ప్ర‌చారం చేశారు. ఈ నేప‌థ్యంలో ఫేక్ న్యూస్ క‌ట్ట‌డికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు ముంద‌డుగు వేశారు.

సీఐడీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ వాట్సాప్ నెంబ‌ర్‌ను డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప్రారంభించారు. 9071666667 నెంబ‌ర్‌ను ఇందుకు కేటాయించారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మయ్యే వాటి ప‌ట్ల ఎవ‌రికైనా అనుమానం క‌లిగితే ఈ నెంబ‌రుకు పంపించ‌వ‌చ్చు. పోలీసులు వాటిల్లో నిజానిజాలు తేల్చి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తారు. త‌ద్వారా పోలీసులు ఫేక్ న్యూస్‌ను క‌ట్ట‌డి చేయాల‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఫ్యాక్ట్ చెక్ కోసం ప్ర‌త్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. factcheck.telangana.gov.in పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్ న‌కిలీ వార్త‌లను నివారించేందుకు బాగా ప‌ని చేస్తోంది. స్వ‌చ్ఛ్ సోష‌ల్ మీడియా నినాదంతో సోష‌ల్ మీడియాలో న‌కిలీ వార్త‌ల‌ను ఏరేస్తోంది. ప్ర‌తీ రోజూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలు, మెసేజ్‌లు, ఫోటోల‌లో ఏది అబ‌ద్ధ‌మో ఆధారాల‌తో స‌హా ఈ వెబ్‌సైట్ నిరూపిస్తోంది.

కాబ‌ట్టి, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు న‌కిలీ వార్త‌లు, అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌ను న‌మ్మేయ‌కుండా ప్ర‌భుత్వం క‌ల్పించిన అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటే మంచిది. మ‌న‌కు వ‌చ్చిన ఏదైనా మెసేజ్‌నో, వీడియోనో షేర్ చేసే ముందు తెలంగాణ ప్ర‌భుత్వ ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌లోనో, ఏపీ పోలీసుల వాట్సాప్ నెంబ‌ర్ ద్వారానో నిజానిజాలు తెలుసుకోవ‌డం ఉత్త‌మం. లేదా అన‌వ‌స‌రంగా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇటీవ‌ల త‌మ‌కు వ‌చ్చిన ఫేక్ న్యూస్ తెలియ‌క షేర్ చేసిన వారు కూడా పోలీసు కేసులు ఎదుర్కుంటున్న సంగ‌తి తెలిసిందే.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   4 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   6 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   9 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   12 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   13 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle