newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫీజుల దందా మొదలెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్.. ఈటల హెచ్చరిక

12-07-202012-07-2020 09:03:19 IST
Updated On 12-07-2020 11:00:57 ISTUpdated On 12-07-20202020-07-12T03:33:19.348Z12-07-2020 2020-07-12T03:32:58.462Z - 2020-07-12T05:30:57.809Z - 12-07-2020

ఫీజుల దందా మొదలెట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్.. ఈటల హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ఫీజులను నిర్దిష్టంగా నిర్దేశించినా అధిక వసూళ్లకు పాల్పడుతున్న ఆయా ఆస్పత్రులకు ముకుతాడు వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న బాధితుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది.  కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా మార్చిలో జారీ చేసిన తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్‌–19) నియంత్రణ–2020 నోటిఫికేషన్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. అన్ని రకాల ఆస్పత్రులపై సర్కారుకు సర్వాధికారాలు కల్పించే ఈ చట్టాన్ని ప్రయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రులను దారిలోకి తేవడంపై కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో అనేక ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు కరోనా రోగులను ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కరోనా బాధితులకు సాధారణ వార్డులో ఐసోలేషన్‌కు రూ. నాలుగు వేలు (రోజుకు), ఐసీయూలో వెంటిలేటర్‌ లేకుండా రోజుకు చికిత్స రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్‌ సౌకర్యంతో రోజుకు రూ. తొమ్మిది వేలను ఫీజుగా సర్కారు నిర్దేశించింది. ఈ ఫీజులను మించి వసూలు చేయరాదని ఆస్పత్రుల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. కానీ చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు పది రెట్లకుపైగా ప్రతిరోజూ వసూలు చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. 

కొన్ని ఆస్పత్రులు కరోనా చికిత్సకు రూ. 7–8 లక్షలు వసూలు చేస్తుండగా కార్పొరేట్‌ ఆస్పత్రులైతే ఏకంగా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంటు వ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం ఆయా ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ముకుతాడు వేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై తెలంగాణ సర్కార్‌ అధ్యయనం చేస్తోంది. 

మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ప్రభుత్వాలు కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకున్నాయి. ముంబైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఆ రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు వేసే బిల్లులను చూడటానికి ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రిలో కనీసం ఇద్దరు ఆడిటర్లను ఏర్పాటు చేసింది. హిమాచల్‌ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కరోనా చికిత్స కొనసాగిస్తున్నాయి. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలలను నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. 

కొన్ని కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రుల ఆగడాలను అడ్డుకొనేందుకు ఏం చేయాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి నిబంధనలను ఉల్లంఘించిన ఆస్పత్రులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని, ప్రైవేటు ఆస్పత్రులు వేస్తున్న బిల్లులను సేకరిస్తున్నామని వైద్య వర్గాలు అంటున్నాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలను ఇక భరించేది లేదంటూ హెచ్చరించారు. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా కరోనా ఫీజులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలా చేసే ఆస్పత్రులను చూస్తూ ఊరుకోం. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వ రంగంలోనే పరీక్షలను పెంచాం. సర్కారు ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రజలు ప్రైవేట్‌ వైపు వెళ్లకుండా చైతన్యం చేస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   12 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle