ఫిర్యాదు వెనక్కు తీసుకుంటే ఫీజ్ వాపస్.. కార్పొరేట్ ఆసుపత్రుల నయామార్గం
18-08-202018-08-2020 16:50:46 IST
2020-08-18T11:20:46.997Z18-08-2020 2020-08-18T11:20:43.166Z - - 10-04-2021

సినిమాల్లో కూడా ఇలాంటి ట్విస్టులను మనం ఎక్కడా చూడలేం.. హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రుల దందా మామూలుగా లేదని మీడియా గత రెండువారాలుగా కోడై కూస్తోంది. కోవిడ్-19 పరీక్షలు, పాజిటివ్ వచ్చిందనే పేరుతో రోగులను చేర్పించుకుని 10 లక్షల నుంచి 25 లక్షల దాకా బిల్లులు వసూలు చేసుకుని దందా సాగించిన కార్పొరేట్ ఆసుపత్రులపై అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు హైకోర్టు ధ్వజమెత్తిన నేపథ్యంలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సపై నిషేధం విధించారు. ఈ ఆసుపత్రుల్లో చేరి భారీగా డబ్బు నష్టపోయిన రోగులు బాధలను స్వయంగా విన్న హైకోర్టు వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలను చేపట్టకూడదన్న నిషేధానికి గురై, తమ వద్ద చికిత్స చేయించుకున్న రోగుల ఆరోపణలతో కేసులపాలై రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయిన హైదరాబాద్ లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు తమపై చర్యలనుంచి తప్పించుకోవడానికి ఫిర్యాదుదారులనే లొంగదీసుకునే సాహసానికి దిగారు. తమ దందా వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లిందని తెలిసి కూడా ఫిర్యాదుదారులను నయానా భయానా లొంగదీసుకునేందుకు ఫీజు వాపస్ ప్రతిపాదనలు చేసిన ఆ కార్పొరేట్ జలగలు చివరకు దాంట్లో కూడా ఫిర్యాదు దారులను మోసగించిన వైనం షాక్ తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే. నియమాలు ఉల్లంఘించి కరోనా చికిత్సపై కాసులు ఏరుకుంటున్న కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు మరో అడుగు ముందుకు వేశాయి. తమ నిర్వాకాలపై ఫిర్యాదు చేసిన బాధితులను నయానో, భయానో దారికి తెచ్చుకునే పనిలో పడ్డాయి. ఇటీవల కరోనా చికిత్సలు చేయకుండా అనైతిక చర్యలకు పాల్పడటంతో క్రమశిక్షణా చర్యలకు గురైన ఆసుపత్రుల ప్రతినిధులు ఫిర్యాదుదారులను దారిలోకి తెచ్చే పనులకు దిగారు. తమ ఆస్పత్రి వైద్యం, బిల్లులు, అనైతిక చర్యలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వారికి ఫోన్ చేయడంతో పాటు వాళ్లను నేరుగా కలుస్తున్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే అధిక బిల్లు విషయంలో చర్చిద్దామని రాజీ భేరాలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాధి కోసం బంజారా హిల్స్ రోడ్ నంబర్–1లోని ఓ ఆస్పత్రిలో చేరి రూ.14.60 లక్షల బిల్లులు చెల్లించిన ఓ వృద్ధ దంపతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నష్టనివారణ కోసం వీరితో ఆస్పత్రి నుంచి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న వ్యక్తి సంప్రదింపులు జరిపి ఫిర్యాదును ఉపసంహరించుకుంటే తాము కట్టించుకున్న ఫీజులో కొంత వాపస్ చేసే విషయమై మాట్లాడతామని ప్రతిపాదన పెట్టాడు. దీంతో వారు వెంటనే ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. అంతవరకూ బాగుంది కానీ ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది. తమనుంచి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేసిన సంబంధిత ఆస్పత్రి ప్రతినిధి ఆ తర్వాత ఎంతకూ ఫోన్ ఎత్తకుండా తమని మరోసారి వంచనకు గురి చేశాడని ఆ వృద్ధ దంపతులు మీడియాను ఆశ్రయించారు. తమను రెండుసార్లు మోసం చేసిన సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. ఈ విషయమై ఆస్పత్రి ప్రతినిధిని మీడియా ప్రశ్నిస్తే ‘‘మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వివాదం కోర్టులో ఉంది’’ అని పేర్కొని ఫోన్ పెట్టేయడం గమనార్హం. కార్పొరేట్ దందా వ్యవహారం ప్రభుత్వం, హైకోర్టు వరకు వెళ్లిందని తెలిసి కూడా ఇంద నిర్భయంగా, నిర్లజ్జగా చీకటి వ్యాపారాలకు దిగుతున్న కార్పొరేట్ ఆసుపత్రులను నిరవధికంగా మూసేయడమే ఉత్తమం అని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
7 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
10 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా