newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. జెట్ స్పీడ్‌లో సమత కేసు విచారణ

12-12-201912-12-2019 09:47:52 IST
Updated On 12-12-2019 15:05:43 ISTUpdated On 12-12-20192019-12-12T04:17:52.351Z12-12-2019 2019-12-12T04:17:41.846Z - 2019-12-12T09:35:43.550Z - 12-12-2019

ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. జెట్ స్పీడ్‌లో సమత కేసు విచారణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంచలనం కలిగించిన దిశ కేసు, దిశ హంతకుల ఎన్ కౌంటర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వివిధ అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన కేసుల విచారణలో వేగం పెరిగింది. దిశ యాక్ట్ పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్ సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది.

తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలపడంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేయనున్నారు. 

ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ లో సమత హత్యాచారానికి గురైంది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టడంతో కేసు విచారణను వేగవంతం చేయాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. సమతను గ్యాంగ్ రేపి చేసి చంపింది తామే అని నిందితులు షేక్ బాబు, షాబోద్దీన్, మఖ్దూమ్ ఒప్పుకున్నారు. దీంతో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, దిశకు జరిగిన న్యాయం తమకు కూడా కావాలని సమత తల్లిదండ్రులు వత్తిడి తెస్తున్నారు.

దీంతో, ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరగనుంది. నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. దిశ ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌భుత్వం వేగంగా స్పందించింది తెలంగాణ పోలీసు శాఖే అంటున్నారు. దేశవ్యాప్తంగా ఆడపిల్లల రక్షణ కోసం కేంద్రం కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందంటున్నారు. 

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘దిశ’ ఘటన కంటే కొద్దిరోజుల ముందు ‘సమత’ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమత అత్యాచారం చేసి చంపేసిన ముగ్గురు నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాబొద్దీన్ గతంలోనూ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏ2 షేక్‌బాబుది కూడా నేర చరిత్రే.  ఏ3 షేక్ ముక్దుం చోరీ కేసులో జైలుశిక్ష అనుభవించాడు. వీరంతా కలప స్మగ్లింగ్ చేసేవారు. వీరంతా నేరం ఒప్పుకోవడంతో విచారణ వేగవంతం చేయనుంది పోలీసు శాఖ. త్వరలో వీరికి శిక్షలు విధించే అవకాశం ఉంది. 

మరోవైపు సమత కుటుంబ సభుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కీలక ఆదేశాలు జారీచేసింది. సమత భర్తకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. రెవెన్యూశాఖలో అటెండర్‌గా ఉద్యోగావకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతు సమత భర్త గోపికి అందజేశారు.

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   10 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   14 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   15 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   15 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   15 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   16 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   16 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   16 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle