newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ప‌సుపు బోర్డుపై ఎంపీ చేతులెత్తేశారా..?

13-08-201913-08-2019 13:21:10 IST
2019-08-13T07:51:10.167Z13-08-2019 2019-08-13T07:51:07.028Z - - 13-12-2019

ప‌సుపు బోర్డుపై ఎంపీ చేతులెత్తేశారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప‌సుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ జిల్లాలో రాజ‌కీయాలు మళ్లీ వేడెక్కాయి. ప‌సుపు బోర్డు స్థాపించాల‌ని ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై రైతులు, టీఆర్ఎస్ ఒత్తిడి పెంచుతోంది. తాను ఎంపీగా గెలిస్తే వారం రోజుల్లో ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయిస్తాన‌ని ఎన్నిక‌ల వేళ ఆయ‌న హామీ ఇచ్చి, బాండ్ పేప‌ర్లు కూడా రాసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. 2014లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత రైతుల‌కు ఈ హామీ ఇచ్చారు. కేంద్రం ప‌రిధిలోని అంశం కావ‌డంతో ఆమె ప‌సుపు బోర్డు ఏర్పాటుకు బాగానే ప్ర‌య‌త్నించారు. పార్ల‌మెంటులో అనేక‌సార్లు ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. మంత్రుల‌ను క‌లిసి విన‌తిప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.

ఇంత ప్ర‌య‌త్నించినా కేంద్రం సానుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ విష‌యంలో ఆమె ఫెయిల్ అయ్యారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మికి, ధ‌ర్మ‌పురి అర్వింద్ గెలుపున‌కు ఇదే ప్ర‌ధాన కార‌ణం. అర్వింద్ హామీ న‌మ్మిన ప‌సుపు రైతులు ఈసారి ఆయ‌న‌ను గెలిపించారు. గెలిస్తే వారంలో ప‌సుపు బోర్డు తెస్తామ‌ని అర్వింద్‌తో పాటు బీజేపీ కీల‌క నేత రాంమాధ‌వ్ కూడా హామీ ఇచ్చారు.

అనూహ్యంగా విజ‌యం సాధించిన అర్వింద్ ప‌సుపు బోర్డు కోసం కొంత ప్ర‌య‌త్నం చేశారు. రైతు సంఘం ప్ర‌తినిధుల‌తో కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌ని విన్న‌వించారు. అర్వింద్ ప్ర‌య‌త్నాలు కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌లించ‌లేదు. బోర్డు ఏర్పాటుపై కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల‌త క‌నిపించ‌డం లేదు. దీంతో అర్వింద్‌పై విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా కేంద్రం ప‌సుపు రైతుల అభిప్రాయ సేక‌ర‌ణను మొద‌లుపెట్ట‌డం జిల్లాలో రాజ‌కీయ వేడిని రాజేస్తోంది. అభిప్రాయ సేక‌ర‌ణ‌లో కొంద‌రు త‌మ‌కు ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయ‌కున్నా ప‌ర్వాలేద‌ని.. పంటకు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తే చాలు అన్న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. అలా చెప్పింది రైతులు కాద‌ని, బీజేపీ నేత‌లే చెప్పించార‌ని ఇత‌ర పార్టీలు విమ‌ర్శిస్తున్నారు.

ప‌సుపు బోర్డు సాధించ‌లేమ‌ని తెలిసిన బీజేపీ నేత‌లు ఈ కొత్త ప్లాన్ చేశార‌ని ఆరోపిస్తున్నారు. అయితే, బీజేపీ నేత‌లు మాత్రం.. అభిప్రాయ సేక‌ర‌ణ‌లో తాము జోక్యం చేసుకోవ‌డం లేద‌ని, ఇచ్చిన హామీ మేర‌కు ప‌సుపు బోర్డు ఏర్పాటు అవుతుంద‌ని చెబుతున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఈ విష‌య‌మై  మాట‌ల యుద్ధం న‌డుస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle