newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

ప‌దేళ్ల పౌర‌స‌త్వం క‌థ‌.. ర‌మేశ్‌పై ఆది గెలిచిన‌ట్లే..!

21-11-201921-11-2019 08:02:42 IST
2019-11-21T02:32:42.550Z21-11-2019 2019-11-21T02:32:34.982Z - - 22-09-2020

ప‌దేళ్ల పౌర‌స‌త్వం క‌థ‌.. ర‌మేశ్‌పై ఆది గెలిచిన‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వేముల‌వాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్‌కు కేంద్ర హోంశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆయ‌న భార‌త పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేసింది.

డ్యూయల్ సిటిజెన్‌షిప్ కలిగి వున్న చెన్నమనేని మన దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ ఆయనపై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గతంలోనే రమేశ్‌ భారత పౌరసత్వం చెల్లదని తీర్పునిచ్చింది. దానిపై రివ్యూకు వెళ్ళిన రమేశ్ కేసును కేంద్ర హోం శాఖ సుదీర్ఘ కాలం పరిశీలించింది. బుధవారం కేంద్ర హోం శాఖ తన నిర్ణయాన్ని వెల్లడించింది. 

చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దయింది.  నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా, మోస‌పూరితంగా ర‌మేశ్ భార‌త పౌర‌స‌త్వం పొందార‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో ర‌మేశ్ ఎమ్మెల్యే ప‌ద‌వి కోల్పోయే అవ‌కాశం ఉంది. కేంద్ర హోంశాఖ నిర్ణ‌యాన్ని కోర్టులో స‌వాల్ చేసేందుకు ర‌మేశ్ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ర‌మేశ్ పౌర‌స‌త్వం వివాదం వెనుక ఆస‌క్తిక‌ర క‌థ ఉంది. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి ప‌దేళ్లుగా చేస్తున్న పోరాటం ఉంది.

దివంగ‌త క‌మ్యూనిస్టు సీనియ‌ర్ నేత చెన్న‌మ‌నేని రాజేశ్వ‌ర‌రావు కుమారుడు ర‌మేశ్‌. రాజేశ్వ‌ర‌రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న సోద‌రుడు చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్‌రావు బీజేపీ సీనియ‌ర్ నేత‌. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా కూడా ప‌నిచేశారు. 2009లో రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పే స‌మ‌యంలో త‌న రాజ‌కీయ వార‌సుడిగా చెన్న‌మ‌నేని ర‌మేశ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు రాజేశ్వ‌ర‌రావు.

1993 వ‌ర‌కు భార‌త్‌లోనే ఉన్న ర‌మేశ్ త‌ర్వాత ఉన్నత విద్య కోసం జ‌ర్మ‌నీ వెళ్లారు. అక్క‌డే చ‌దువు పూర్తి చేసుకొని ప్రొఫెస‌ర్‌గా ఉద్యోగం పొందారు. అక్క‌డి మ‌హిళ‌నే వివాహం చేసుకొని జ‌ర్మ‌నీలోనే స్థిర‌ప‌డ్డారు.

అయితే, తండ్రి నిర్ణ‌యంతో 2009లో ఆయ‌న అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి ప్రవేశించారు. అప్ప‌టికే భార‌త పౌర‌స‌త్వాన్ని స్వ‌చ్ఛందంగా వ‌దులుకొని జ‌ర్మ‌నీ పౌర‌సత్వాన్ని పొందిన ర‌మేశ్ తిరిగి భార‌త పౌర‌స‌త్వం పొందారు.

ఈ క్ర‌మంలో భార‌త పౌర‌స‌త్వ చ‌ట్టాన్ని ఉల్లంఘించార‌నేది ర‌మేశ్‌పై ఆరోప‌ణ‌. భార‌త పౌర‌స‌త్వాన్ని మ‌ళ్లీ పొందాలంటే ఏడాది పాటు క‌చ్చితంగా భార‌త్‌లోనే ఉండాల‌ని, ఈ స‌మ‌యంలో ఏ దేశానికి వెళ్ల‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లు చెబుతున్నాయి.

కానీ, ర‌మేశ్ మాత్రం పౌర‌స‌త్వం పొందే ముందు కేవ‌లం 96 రోజులు మాత్ర‌మే భార‌త్‌లో ఉన్నార‌ని, ఆ స‌మ‌యంలోనూ రెండుసార్లు జ‌ర్మ‌నీ వెళ్లార‌ని ఆయ‌న‌పై పోటీ చేసి ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ కోర్టుకు, కేంద్ర హోంశాఖ‌కు, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు.

2009లో రాజ‌కీయాల్లోకి ప్రవేశించిన చెన్న‌మ‌నేని ర‌మేశ్ ప‌దేళ్ల‌లోనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగుసార్లూ ఆయ‌న‌పై ఆదిశ్రీనివాస్ ఓడిపోయారు. ఆదిశ్రీనివాస్ కూడా స్థానికంగా ప‌ట్టున్న నాయ‌కుడు. 2009లో ర‌మేశ్ టీడీపీ నుంచి, ఆదిశ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయ‌గా ర‌మేశ్ రెండు వేల ఓట్లు స్వ‌ల్ప ఆధిక్య‌త‌తో గెలిచారు. ఆ త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో ఆదిశ్రీనివాస్‌పైనే మ‌ళ్లీ ఘ‌న విజ‌యం సాధించారు.

2014 ఎన్నిక‌ల్లో ర‌మేశ్ మ‌రోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయ‌గా, ఆదిశ్రీనివాస్ బీజేపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ర‌మేశ్ ఐదు వేల ఓట్ల స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం సాధించారు.

2018 ఎన్నిక‌ల్లో ఆదిశ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయ‌గా ఆయ‌న‌పై నాలుగోసారి ర‌మేశ్ గెలిచారు. నాలుగుసార్లు పోటీచేసిన ప్ర‌జాక్షేత్రంలో ర‌మేశ్‌పై ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ తాజాగా కేంద్ర హోంశాఖ నిర్ణ‌యంతో ర‌మేశ్‌పై గెలిచిన‌ట్ల‌యింది.

ప‌దేళ్లుగా ఆదిశ్రీనివాస్ హైకోర్టులో, సుప్రీం కోర్టులో ఈ విషయంపై పోరాడుతూనే ఎన్నిక‌ల సంఘం, కేంద్ర హోంశాఖ‌కు ఫిర్యాదులు చేస్తూ వ‌స్తున్నారు. ప‌లుమార్లు విచార‌ణ‌ల త‌ర్వాత కేంద్ర హోంశాఖ ర‌మేశ్ పౌర‌స‌త్వాన్ని ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ఈ నిర్ణ‌యంపై కోర్టును ఆశ్ర‌యించనున్న‌ట్లు ర‌మేశ్ ప్ర‌క‌టించారు. అయితే, ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కోల్పోతే మాత్రం రెండు స్థానంలో ఉన్న ఆది శ్రీనివాస్‌కు ఈ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తంగా ఆదిశ్రీనివాస్ ప‌దేళ్ల పోరాటం ఓ కొలిక్కి వ‌చ్చేలా క‌నిపిస్తోంది

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle