newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

03-07-202003-07-2020 08:24:26 IST
Updated On 03-07-2020 10:48:32 ISTUpdated On 03-07-20202020-07-03T02:54:26.192Z03-07-2020 2020-07-03T02:54:16.598Z - 2020-07-03T05:18:32.322Z - 03-07-2020

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఉద్య‌మంలో సింగ‌రేణి కార్మికుల పాత్ర చాలా ప్ర‌ముఖ‌మైన‌ది. ఉద్య‌మాన్ని, పార్టీని బ‌లోపేతం చేసుకునే దిశ‌లో సింగ‌రేణి కోల్ బెల్ట్‌లో ప‌ట్టు కోసం టీఆర్ఎస్ పార్టీ త‌మ‌కు అనుబంధంగా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘాన్ని(టీజీబీకేఎస్‌) ఏర్పాటు చేసుకుంది. అప్ప‌టివ‌ర‌కు జాతీయ కార్మిక సంఘాల హ‌వా న‌డిచిన సింగ‌రేణిలో టీఆర్ఎస్ ఎంట్రీతో ప‌రిస్థితి మారిపోయింది. ముఖ్యంగా సింగ‌రేణిలో టీజీబీకేఎస్ బాధ్య‌త‌ల‌ను కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు అప్ప‌గించారు కేసీఆర్‌. దీంతో ఆమె టీజీబీకేఎస్ గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌విని చేప‌ట్టి సింగ‌రేణిలో టీజీబీకేఎస్‌ను బ‌లోపేతం చేశారు. క‌విత కార‌ణంగానే టీజీబీకేఎస్ మొద‌టిసారి సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘంగా మొద‌టిసారి గెలిచింది.

త‌ర్వాత టీఆర్ఎస్ కూడా అధికారంలోకి రావ‌డంతో టీజీబీకేఎస్ హ‌వా మ‌రింత పెరిగింది. సింగ‌రేణి కార్మికుల సుదీర్ఘ డిమాండ్లు కూడా కొన్ని ప‌రిష్కార‌మ‌య్యాయి. దీంతో మ‌రోసారి గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా రెండోసారి టీజీబీకేఎస్ విజ‌యం సాఠ‌ధించింది. ఇలా వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీజీబీకేఎస్ స్పీడ్‌‌కు సొంత కార్మిక సంఘ నేత‌లే బ్రేకులు వేశారు. ఈ సంఘంలో కార్మిక నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు తార‌స్థాయికి చేరింది. సంఘంపై ఆధిప‌త్యం పెంచుకునే క్ర‌మంలో టీజీబీకేఎస్ కీల‌క నాయ‌కులు గ్రూపులు క‌ట్టారు. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. నేత‌ల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల టీజీబీకేఎస్ క్ర‌మంగా కోల్ బెల్ట్‌లో గ్రిప్ కోల్పోతోంది.

అన్నింటికీ మించి టీజీబీకేఎస్ బాధ్య‌త‌ల‌ను భుజాన‌మోసి పైకి తీసుకొచ్చిన క‌ల్వ‌కుంట్ల క‌విత రెండేళ్ల క్రితం సంఘం గౌర‌వ అధ్య‌క్షురాలి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రూ ఇత‌ర సంఘాల ప‌ద‌వుల్లో ఉండ‌వ‌ద్ద‌ని పార్టీ అన‌ధికార నిర్ణ‌యం తీసుకుంది. ఈ స‌మ‌యంలోనే టీజీబీకేఎస్ గౌర‌వ అధ్య‌క్షురాలిగా క‌విత‌, ఆర్టీసీ టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీఎంఎస్ గౌర‌వ అధ్య‌క్షుడిగా హ‌రీష్‌రావు వంటి వారు రాజీనామాలు చేశారు. క‌విత రాజీనామా త‌ర్వాత ఆమె టీజీబీకేఎస్‌ను వ‌దిలేశారు. దీంతో ఆ సంఘం నేత‌ల మ‌ధ్య మ‌రింత విభేదాలు, గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ప‌లువురు కీల‌క టీజీబీకేఎస్ నాయ‌కులు రాజీనామా చేసి బీజేపీకి అనుబంధంగా ఉండే బీఎంఎస్‌లో చేరారు. దీంతో టీజీబీకేఎస్ ప‌ట్టుకోల్పోతోంది.

త్వ‌ర‌లోనే సింగ‌రేణి కార్మిక సంఘాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఎన్నిక‌లు అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మార‌నున్నాయి. నాలుగు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో విస్త‌రించి ఉన్న సింగ‌రేణిలో టీజీబీకేఎస్ గెల‌వ‌క‌పోతే ప‌రోక్షంగా టీఆర్ఎస్ ఓడిన‌ట్లే లెక్క. గ‌తంలో పోల్చితే ఈసారి టీజీబీకేఎస్ గెలుపు అంత సులువుగా ఏమీ క‌నిపించ‌డం లేదు. రాజ‌కీయంగానూ సింగ‌రేణిలో విజ‌యం టీఆర్ఎస్ పార్టీకి అవ‌స‌రం. తెలంగాణ‌లో సుమారు 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో సింగ‌రేణి కార్మికులు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు. అంత‌టి కీల‌క‌మైన సింగ‌రేణిలో మ‌ళ్లీ గ్రిప్ సంపాదించాల‌ని టీఆర్ఎస్ పార్టీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

గ‌తంలో బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న క‌ల్వకుంట్ల క‌విత మ‌ళ్లీ సింగ‌రేణిపై న‌జ‌ర్ పెట్టారు. ఆమె మ‌ళ్లీ టీజీబీకేఎస్ గౌర‌వ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సింగ‌రేణిలో ప్ర‌స్తుతం కార్మికులు అభ‌ద్ర‌త భావంతో ఉన్నారు.

కేంద్రం బొగ్గు గ‌నుల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యాన్ని కార్మికులు హ‌ర్షించ‌డం లేదు. కార్మిక సంఘాల‌న్నీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా బొగ్గు గ‌ని కార్మిక సంఘాల ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యాయి. 11 జాతీయ కార్మిక సంఘాలు ఒక్క‌తాటిపైకి వ‌చ్చాయి. ఇవాళ‌టి నుంచి మూడు రోజుల పాటు సింగ‌రేణిలో కార్మికులు కేంద్ర ప్ర‌భుత్వ ప్రైవేటీక‌ర‌ణ విధానానికి వ్య‌తిరేకంగా స‌మ్మె నిర్వ‌హించ‌బోతున్నారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా గ‌త కొన్ని రోజులుగా కార్మిక సంఘాల జేఏసీ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, గేట్ మీటింగ్‌లు జ‌రుపుతోంది. ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఉన్న సింగ‌రేణి కార్మికులు ఈ కార్య‌క్ర‌మాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జేఏసీకి కార్మికుల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో టీజీబీకేఎస్ ఈ విష‌యంలో మిగ‌తా కార్మిక సంఘాల జేఏసీతో పోల్చితే వెనుక‌బ‌డింది. నేత‌ల మ‌ధ్య గోడ‌వ‌లే ఆ సంఘానికి స‌రిపోతున్నాయి.

దీంతో ఆల‌స్యంగా తేరుకున్న టీఆర్ఎస్ మ‌రోసారి క‌విత‌ను సింగ‌రేణిలో రంగంలోకి దింపుతోంది. ఆమె టీజీబీకేఎస్ త‌ర‌పున ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు. ఇవాళ స‌మ్మె చేస్తున్న కార్మికుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఆమె ప్ర‌త్య‌క్షంగా సింగ‌రేణిలో కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌నున్నారు. మ‌రోసారి క‌విత ఎంట్రీ ద్వారా టీజీబీకేఎస్ ప‌ట్టు పెంచుకుంటుంద‌ని ఆ సంఘం నేత‌లు, కార్మికులు భావిస్తున్నారు. మ‌రి, క‌విత ఎంట్రీతో టీజీబీకేఎస్ మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   18 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   19 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle