ప్లాస్మాథెరపీలో గాంధీ ఆసుపత్రికి దేశంలోనే 5వ ర్యాంకు.. బాధితులకు ఊరట
04-08-202004-08-2020 07:20:15 IST
2020-08-04T01:50:15.849Z04-08-2020 2020-08-04T01:50:00.176Z - - 17-04-2021

తెలంగాణలో ప్లాస్మా థెరపీ ఎంతగా విజయవంతమైందంటే దేశవ్యాప్తంగా ప్లాస్మాథెరపీలో గాంధీ అసుపత్రికి అరుదైన గుర్తింపు లబించింది. కరోనా వైద్యం లో భాగంగా చేపట్టిన ప్లాస్మాథెరపీ చికిత్సలు కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వంద శాతం విజయవంతమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్లాస్మాథెరపీ చికిత్సల్లో ఐసీఎంఆర్ చేపట్టిన గ్రేడింగ్‌లో ఈ ఆస్పత్రికి 5వ స్థానం దక్కింది. పైగా హైదరాబాద్‌లో ప్లాస్మాథెరపీతో 25 మంద బాధితులు కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయస్థితిలో ఉన్న 25 మంది రోగులకు ఇక్కడ ప్లాస్మా థెరపీ చికిత్స అందించి వైద్యులు పునర్జన్మనిచ్చారు. 25 మంది కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఐసీఎంఆర్ ఆదేశాలతో వెంటిలేటర్‌పై ఉన్న పాతబస్తీకి చెందిన యువకుడి (44)కి గత మే 14న 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఎక్కించారు. శరీరం స్పందించడంతో మే 16న మరో డోస్ ప్లాస్మాను ఎక్కించడంతో బాధితుడు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యా డు. ఆ తర్వాత ప్రాణాపాయస్థితిలో ఉన్న మరో 24 మందికి విజయవంతంగా ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు. కాగా, కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేందుకు మరికొంత సమయం పట్టనున్న క్రమంలో ప్లాస్మాథెరపీని కరోనా చికిత్సలో భాగం చేయాలా, మరికొంతకాలం ప్రయోగాత్మకంగానే పరిశీలించాలా అనే అంశంపై ఐసీఎంఆర్ తర్జనభర్జన పడుతోంది. కాగా, దేశవ్యాప్తంగా ఈ చికిత్సలు నిర్వహించిన 25 సెంటర్లలో చికిత్సపొందిన 625 మంది బాధితుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని సెంటర్లలో ప్లాస్మాచికిత్స ఫలితాలు సాధించలేదు. తెలంగాణ, ఏపీలో సత్ఫలితాలనిచ్చిన క్రమంలో ప్రాంతాలవారీగా అధ్యయనం చేస్తున్నారు. అప్పటి వరకు ప్లాస్మా చికిత్సలకు విరామమివ్వాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ప్లాస్మాథెరపీ చికిత్సల్లో వంద శాతం ఫలితాలు సాధించి దేశవ్యాప్త గ్రేడింగ్‌లో గాంధీ ఆస్పత్రి 5వ ర్యాంకు సాధించడం గర్వకారణమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. ఐసీఎంఆర్ సూచనతో ప్రస్తుతం ప్లాస్మాథెరపీ చికిత్సలు నిలిపివేశామన్నారు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
11 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
13 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
17 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
15 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
20 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
19 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
21 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
18 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
a day ago
ఇంకా