newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

ప్లాస్టిక్ తో వస్తే... బియ్యం ఫ్రీ.. ములుగు క‌లెక్ట‌ర్ వినూత్న కార్య‌క్ర‌మం..!

26-10-201926-10-2019 08:17:19 IST
Updated On 26-10-2019 08:17:16 ISTUpdated On 26-10-20192019-10-26T02:47:19.541Z26-10-2019 2019-10-26T02:45:27.704Z - 2019-10-26T02:47:16.472Z - 26-10-2019

ప్లాస్టిక్ తో వస్తే... బియ్యం ఫ్రీ.. ములుగు క‌లెక్ట‌ర్ వినూత్న కార్య‌క్ర‌మం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్లాస్టిక్ పెనుభూతాన్ని త‌రిమేద్దాం... ప్ర‌కృతిని కాపాడుకుందాం వంటి ప్లాస్టిక్ వ్య‌తిరేక నినాదాలు త‌ర‌చూ వింటుంటాం. అనేక ఏళ్లుగా వింటూనే ఉన్నాం. ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు ప్ర‌భుత్వాలు కూడా అనేక చ‌ర్య‌లు తీసుకున్నాయి. బ్యాన్లు విధించాయి. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాయి. అనేక ఎన్‌జీఓ సంస్థ‌లు కూడా త‌మ వంతుగా ప్లాస్టిక్ నియంత్రించేందుకు ప్ర‌య‌త్నించాయి. కానీ, ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.1

ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలే కాదు ప‌ల్లెలు, అడ‌వులు కూడా ప్లాస్టిక్ తో నిండిపోతున్నాయి. దీంతో ప్లాస్టిక్ నియంత్ర‌ణ‌కు వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి మంచి ఫ‌లితాల‌ను సాధిస్తున్నారు యువ క‌లెక్ట‌ర్ సి.నారాయ‌ణ‌రెడ్డి. ఇంత‌కుముందు న‌ల్గొండ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా ఉన్న ఆయ‌న ములుగు కొత్త జిల్లాగా ఏర్ప‌డ‌టంతో క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ప‌చ్చ‌టి ప్ర‌కృతి, ద‌ట్ట‌మైన అట‌వీ సంప‌ద‌, అనేక పుణ్య‌క్షేత్రాలు, ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు నెల‌వు ములుగు జిల్లా. ఇక్క‌డ కూడా విచ్చ‌ల‌విడిగా ప్లాస్టిక్ను అడ్డ‌గోలుగా వాడుతుండ‌టం చూసిన‌ క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి ఎలాగైనా దీనిని నియంత్రించాల‌నుకున్నారు. ఓ రోజు పాఠ‌శాల విద్యార్థుల‌కు ప్లాస్టీక్ నియంత్ర‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా వెయ్యి కిలోల ప్లాస్టిక్ సేక‌రిస్తే క్రికెట్ కిట్ ఇస్తామ‌ని విద్యార్థుల‌కు ఓ ప‌ని అప్ప‌గించారు.

విద్యార్థులు వెయ్యి కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సేక‌రించారు. ఇది చూసిన క‌లెక్ట‌ర్‌కు అదిరిపోయే ఐడియా వ‌చ్చింది. ప్ర‌జ‌ల చేత‌నే ప్లాస్టిక్ను సేక‌రించ‌డం ద్వారా వారు వాడ‌కుండా నియంత్రించ‌డంతో పాటు పోగైన ప్లాస్టిక్ను కూడా రీసైక్లింగ్ చేయ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న చేశారు.

ఇందుకు ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు గానూ ఒక కిలో ప్లాస్టిక్ సేక‌రిస్తే ఒక కిలో బియ్యం ఇస్తామ‌ని ప్ర‌క‌టించి ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అక్టోబ‌రు 16న ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంది.

ఇప్ప‌టికే ములుగు జిల్లా ప‌రిధిలోని 174 గ్రామ పంచాయితీల్లో 33,200 కిలోల వాడి పాడేసిన ప్లాస్టిక్ను ప్ర‌జ‌లు సేక‌రించారు. బ‌దులుగా వారికి బియ్యం అందించింది జిల్లా యంత్రాంగం. బియ్యాన్ని దాత‌ల నుంచి సేక‌రిస్తున్నారు. సేక‌రించిన ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇంత‌కుముందు చ‌త్తీస్‌ఘ‌డ్ ప్ర‌భుత్వం కూడా ఇటువంటి కార్య‌క్ర‌మాన్నేఅమ‌లు చేసింది. ఒక కిలో ప్లాస్టిక్ ఇస్తే ఒక పూట భోజ‌నం పెట్టించారు.

ములుగు క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి కూడా ఇటువంటిది ప్ర‌య‌త్నాన్నే కొంత భిన్నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో పిల్ల‌లు, పెద్ద‌లు చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో గ్రామాల్లో ప్లాస్టిక్ క‌నిపించ‌డం లేదు. ములుగులో ఈ ప్ర‌య‌త్నం మంచి ఫ‌లితాలు ఇస్తున్నందున త్వ‌ర‌లోనే ఇత‌ర జిల్లాల్లోనూ ఇటువంటి కార్య‌క్ర‌మాలే చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle