newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌కు కేసీఆర్ ఓకే.. ఆ ప‌ని చేస్తే పేద‌ల‌కు ఎంతో మేలు ‌..!

16-09-202016-09-2020 12:42:59 IST
2020-09-16T07:12:59.973Z16-09-2020 2020-09-16T07:12:57.589Z - - 29-09-2020

ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌కు కేసీఆర్ ఓకే.. ఆ ప‌ని చేస్తే పేద‌ల‌కు ఎంతో మేలు ‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎక్క‌డో చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ మ‌న పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై పిడుగులా వ‌చ్చి ప‌డుతోంది. క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారు ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వెళుతున్నారు. ఇలా వెళ్తున్న వారు ల‌క్షల్లో ఆసుప‌త్రుల‌కు ఫీజులు చెల్లించాల్సి వ‌స్తోంది. దీంతో ఆస్తులు అడ్డికి పావుశేరు అమ్ముకొని ఆసుప‌త్రుల్లో డ‌బ్బులు క‌ట్టాల్సిన ద‌య‌నీయ ప‌రిస్థితులు ఉన్నాయి. దీంతో క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య శ్రీలో చేర్చాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని చాలా రోజులుగా ప్ర‌తిప‌క్ష పార్టీలు కోరుతున్నాయి. అయితే, ప్ర‌భుత్వం ఇంత‌కాలం ఈ విష‌య‌మై అంత సానుకూలంగా స్పందించ‌లేదు.

దీంతో ప్ర‌తిప‌క్షాలు ఈ డిమాండ్‌తో ఆందోళ‌న‌లు కూడా చేశాయి. మొన్న అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత భ‌ట్టి విక్ర‌మార్క క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చాల‌ని గ‌ట్టిగా డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొద‌టిసారిగా ఈ అంశంపై సానుకూల ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చే దిశ‌గా ప్ర‌య‌త్నిస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోని పేద ప్ర‌జ‌లకు కొంత ధైర్యం వ‌చ్చింది. కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు అధికార యంత్రాంగం క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చే దిశ‌గా క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం 333 ప్రైవేటు ఆసుప‌త్రులు క‌రోనా చికిత్స అందిస్తున్నాయి. సాధార‌ణ ఐసొలేష‌న్ చికిత్స‌కు 3-5 ల‌క్ష‌ల బిల్లు అవుతుంది. ఐసీయూ పేషెంట్ల‌కు 10 - 20 ల‌క్ష‌ల బిల్లు వేస్తున్నారు. ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి 20 ల‌క్ష‌ల‌కు పైగానే బిల్లు అవుతుంది. ఇటీవ‌ల ఒకే కుటుంబంలో క‌రోనా బారిన ప‌డిన వారు ఏకంగా రూ.80 ల‌క్ష‌ల ఆసుప‌త్రుల బిల్లులు చెల్లించాల్సి వ‌చ్చింది. అయినా కూడా ఆ కుటుంబంలో ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. అంటే ఆ కుటుంబం ఆర్థికంగా, మాన‌సికంగా ఎంత కుమిలిపోయి ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటువంటివి అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

నిజానికి తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా చికిత్స‌కు ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామ‌ని ప‌దేప‌దే చెబుతోంది. అయితే, ప్ర‌భుత్వ ఆసుప‌త్రులపై మొద‌ట్లో జ‌రిగిన వ్య‌తిరేక ప్ర‌చారం, చికిత్స స‌రిగ్గా చేయ‌డం లేద‌ని భావన‌, డాక్ట‌ర్ల ఆందోళ‌న‌, పేషెంట్ల సెల్ఫీ వీడియోలో బ‌య‌ట‌కు రావ‌డ వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల ప్ర‌జలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోకి వెళ్ల‌డానికి వెన‌కాడుతున్నారు. దీంతో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మూడింట రెండొంతుల మంది ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా చికిత్స‌ను మొద‌ట్లోనే ఆరోగ్య‌శ్రీలో చేర్చింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. ఇందుకు గానూ చికిత్స‌కు ఒక ప్యాకేజీ ఫిక్స్ చేసి ఆసుప‌త్రుల‌కు చెల్లిస్తోంది. మిగ‌తా రాష్ట్రాల్లో కేంద్ర ప‌థ‌క‌మైన ఆయుష్మాన్ భార‌త్‌లో క‌రోనా చికిత్స‌ను చేర్చారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పేద‌లు క‌రోనా బారిన ప‌డినా చికిత్స కోసం అప్పుల పాల‌వ్వాల్సిన ప‌రిస్థులు పెద్ద‌గా లేవు. కానీ, తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క‌రోనా బారిన ప‌డ్డారంటే పేద‌లు ఆస్తులు అమ్ముకోవ‌డ‌మో, అప్పుల పాలుకావ‌డమో త‌ప్ప‌డం లేదు. దీంతో తెలంగాణ‌లోనూ క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి.

ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఇప్పుడు ప్ర‌తిపక్షాల డిమాండ్‌కు అంగీక‌రించింది. క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీలో చేర్చే క‌స‌ర‌త్తు మొద‌లైంది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో చికిత్స‌కు ఒక ప్యాకేజీని ఫిక్స్ చేసే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే చికిత్స‌కు తీసుకోవాల్సిన ధ‌రల గురించి ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చినా ప్రైవేటు ఆసుప‌త్రులు ఆ ఆదేశాల‌ను తుంగ‌లో తొక్కి ఇష్టారీతిన బిల్లులు వ‌సూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆరోగ్య‌శ్రీ కింద చేరిస్తే ప్ర‌భుత్వం క‌చ్చితంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ కింద చేరుస్తామ‌నే కేసీఆర్ ప్ర‌క‌ట‌న ప్ర‌జ‌ల్లో ఆశ‌లు క‌ల్పించింది. ప్ర‌భుత్వం ఎంత వేగంగా ఈ ప్ర‌క్రియ పూర్తి చేస్తే క‌రోనాను ఆరోగ్య‌శ్రీ కింద చేరిస్తే పేద‌ల‌కు అంత మేలు జ‌రుగుతుంది.

బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

   3 hours ago


ఆగ‌ని ఆల‌యాల్లో ధ్వంసం...  పోతేపోనీ ధోర‌ణికి స‌ర్కార్‌ వ‌చ్చేసిందా?

ఆగ‌ని ఆల‌యాల్లో ధ్వంసం... పోతేపోనీ ధోర‌ణికి స‌ర్కార్‌ వ‌చ్చేసిందా?

   5 hours ago


బీజీపీ ’మహా‘ రాజకీయం!

బీజీపీ ’మహా‘ రాజకీయం!

   7 hours ago


ఓరుగ‌ల్లులో ఎన్నిక‌ల సంద‌డి... పంతం నీదా నాదా సై!

ఓరుగ‌ల్లులో ఎన్నిక‌ల సంద‌డి... పంతం నీదా నాదా సై!

   9 hours ago


సీఎంకి మా బాధలేం తెలుస్తాయి ? : రైతుల ఆవేదన

సీఎంకి మా బాధలేం తెలుస్తాయి ? : రైతుల ఆవేదన

   9 hours ago


రాంమాధవ్‌ను పక్కన పెట్టేశారా? ప్రమోషన్ ఇస్తారా?

రాంమాధవ్‌ను పక్కన పెట్టేశారా? ప్రమోషన్ ఇస్తారా?

   10 hours ago


కృష్ణమ్మకు పోటెత్తిన వరదలు.. ప్రభుత్వం పై ముంపుబాధిత ప్రజల ఆగ్రహం

కృష్ణమ్మకు పోటెత్తిన వరదలు.. ప్రభుత్వం పై ముంపుబాధిత ప్రజల ఆగ్రహం

   10 hours ago


జ‌గ‌న్ నోరు మెద‌ప‌రు... మంత్రులు వ్యాఖ్య‌లు ఆప‌రు!

జ‌గ‌న్ నోరు మెద‌ప‌రు... మంత్రులు వ్యాఖ్య‌లు ఆప‌రు!

   11 hours ago


రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. బీజేపీ-జేడీయూకు ఎల్‌జేపీ సవాల్!

రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. బీజేపీ-జేడీయూకు ఎల్‌జేపీ సవాల్!

   11 hours ago


మంత్రి వెల్లంపల్లికి కరోనా.. తిరుమలకి వెళ్లిన వారంతా టెన్షన్!

మంత్రి వెల్లంపల్లికి కరోనా.. తిరుమలకి వెళ్లిన వారంతా టెన్షన్!

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle