newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్న కేసీఆర్‌

17-03-202017-03-2020 08:01:59 IST
2020-03-17T02:31:59.272Z17-03-2020 2020-03-17T02:31:39.496Z - - 26-05-2020

ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్న కేసీఆర్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ స‌మావేశాల్లో చెల‌రేగిపోయారు. అనేక అంశాల‌పై కేసీఆర్ మాట‌లు తుటాల్లా పేలాయి. ఒక‌వైపు ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్‌కు ఉన్న‌ది ఆరుగురు ఎమ్మెల్యేలు. బీజేపీకి కేవ‌లం ఒక్క‌రు. మ‌రో వైపు వంద మందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పైగా ఎంఐఎం మ‌ద్ద‌తు. దీంతో అసెంబ్లీ స‌మావేశాలు ఎలాగూ వార్ వ‌న్ సైడ్ అన్న‌ట్లుగా జ‌రిగాయి. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకు, ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంత ప్ర‌య‌త్నం చేసినా కేసీఆర్ ఒక్క‌రే వారికి గ‌ట్టి స‌మాధానాలు చెప్పారు.

చాలా అనుమానాల‌కు కేసీఆర్ ఈ అసెంబ్లీ స‌మావేశాల్లోనే బ‌దులిచ్చారు. దేశాన్ని కుదిపేస్తున్న సీఏఏ, ఎన్ఆర్సీకి వ్య‌తిరేకంగా శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేయించారు. ముస్లింల‌కు ఇచ్చిన హామీని కేసీఆర్ నెర‌వేర్చారు. మ‌రోవైపు తన ప్ర‌భుత్వం ఇక నుంచి తీసుకోబోతున్న నిర్ణ‌యాల‌ను ముందే అసెంబ్లీ ముందు పెట్టి, ఎందుకు ఆ నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుందో వివ‌రించి విప‌క్ష స‌భ్యుల‌కు నోట మాట రాకుండా చేశారు. వివిధ ఛార్జీలు పెంచుతాన‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పేశారు.

స‌హ‌జంగా ప్ర‌భుత్వాలు ఆర్టీసీ, క‌రెంటు ఛార్జీలు పెంచ‌డం అనేది ఒక పెద్ద నిర్ణ‌యంగా భావించేవారు. ఒక‌సారి ఛార్జీలు పెరిగితే విప‌క్షాలు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రోడ్డెక్కేవి. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రిగేవి. దీంతో ప్ర‌భుత్వం కూడా ఛార్జీలు పెంచాలంటే ఆచితూచి వ్య‌వ‌హ‌రించేవి. త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌స్తే త‌ప్ప ఛార్జీల పెంపు ఆలోచ‌న చేసేవి కాదు. అదీ ఏదో రాత్రివేళ ప్ర‌భుత్వం ఆక‌స్మాత్తుగా నిర్ణ‌యం ప్ర‌క‌టించేది. కానీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఇందుకు పూర్తి భిన్నం. ఆయ‌న ఛార్జీలు పెంచ‌క‌ముందే పెంచుతామ‌ని ఒక‌టికి ప‌దిసార్లు నొక్కి చెబుతున్నారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై భారం మోపే చాలా విష‌యాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తేలిగ్గా చెప్పేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచ‌డం ఖాయ‌మ‌ని చెప్పేశారు. ఇందుకు ఆయ‌న ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా ఉండేలా వాద‌న వినిపించారు. నాణ్య‌మైన విద్యుత్ ఇవ్వాలంటే పెంచ‌క త‌ప్ప‌ద‌ని చెప్పారు. ప‌న్నులు పెంచుతామ‌ని, పెంచితేనే అభివృద్ధి సాధ్య‌మ‌ని చెప్పారు. మ‌ద్యం ధ‌ర‌లు ఇప్ప‌టికే పెంచామ‌ని, మ‌రింత పెంచుతామ‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. అన్ని పెంపుల‌కు కేసీఆర్ వ‌ద్ద ఒక వాద‌న ఉంది. ఈ వాద‌న‌ను ఆయ‌న అసెంబ్లీ ద్వారానే ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

కేసీఆర్ ఛార్జీలు పెంచుతామ‌న్నా ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించ‌లేని స్థితి నెట్టేశారు. కాంగ్రెస్‌కు ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల‌కు అసెంబ్లీలో దొరికేది త‌క్కువ స‌మ‌యం. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ స‌భ్యుడు ఏదైనా ఒక ప్ర‌శ్న లేవ‌నెత్తితే ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ది కౌంట‌ర్లు వ‌చ్చాయి.

గ‌త పాల‌న గుర్తు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాంగ్రెస్ స‌భ్యుల‌పై విరుచుకుప‌డ్డారు. దీంతో వారు కూడా గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం చేసే స‌మ‌యంలో కాంగ్రెస్ స‌భ్యులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. దీనిని కేసీఆర్ సీరియ‌స్‌గా తీసుకొని ఒక రోజు వేటు వేయించ‌డం ద్వారా గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు.

అయినా కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌పై సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, సీత‌క్క ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, కేసీఆర్ మాట‌ల దాడి ముందు వీరి ప్ర‌య‌త్నాలు వృథా అయ్యాయి. మొత్తం తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో టీఆర్ఎస్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌తిప‌క్షాన్ని ఇబ్బంది పెట్టింది. ఇక‌, ఛార్జీల పెంపు వంటి కీల‌క ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌జ‌లను ముందే సిద్ధంగా ఉంచే ప్ర‌య‌త్నం చేశారు.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   4 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   6 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   9 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   11 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   12 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   13 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle