newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రైవేట్ ఆసుపత్రుల కరోనా దందాపై సర్కార్ కొరడా..

06-03-202006-03-2020 14:40:40 IST
Updated On 06-03-2020 17:37:31 ISTUpdated On 06-03-20202020-03-06T09:10:40.673Z06-03-2020 2020-03-06T09:10:29.357Z - 2020-03-06T12:07:31.992Z - 06-03-2020

ప్రైవేట్ ఆసుపత్రుల కరోనా దందాపై సర్కార్ కొరడా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా వైరస్ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందే తడవుగా హైదరాబాద్ తదితర పట్టణాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలుకు సిద్దమైపోయాయి. కోవిడ్ 19 పేరు చెప్పి మరీ ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టమొచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ప్రజలు వాపోతున్న నేపథ్యంలో కోవిడ్‌ వైద్యం పేరుతో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా సర్కారు అడ్డుకట్ట వేసింది. కోవిడ్‌ వైరస్‌ లక్షణాలతో వచ్చిన వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేసేందుకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తారన్న ప్రజల ఫిర్యాదు నేపథ్యంలో కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంది. 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గురువారం హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల ఉన్న ప్రముఖమైన కార్పొరేట్‌ ఆస్పత్రులు సహా మొత్తం 70–80 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. కోవిడ్‌ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ అనుమానంతో ఎవరైనా చేరి చికిత్స పొందేంత వరకు ఆస్పత్రి వర్గాలు ఎంత ఫీజు వసూలు చేస్తాయన్న దాంతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే ఒకవేళ వారికి కోవిడ్‌ ఉన్నట్లు తేలితే తదుపరి చేసే వైద్యానికి ఫీజును తామే ఖరారు చేస్తామని, ఆ ప్రకారమే వసూలు చేయాలని సర్కారు స్పష్టం చేసింది.

కోవిడ్‌ అనుమానిత కేసులు వస్తే వారికి అందించే చికిత్స విషయం లో ఎంత ఫీజు వసూల్‌ చేయాలన్నది తామే నిర్ధారించి వెల్లడిస్తామని తెలిపారు. అలాగే ఓపీలో చేసుకోవాల్సిన మార్పుల గురించి అధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు వివరించారు. ప్రధానంగా కోవిడ్‌ బాధితులు, రోగుల విషయంలో తమ ఆదేశాల మేరకే నడుచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ చికిత్స విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను, ప్రొటోకాల్‌ పద్ధతులను వారికి మంత్రి వివరించారు. కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటులో ఎలాంటి విధానాలు పాటించాలి.. వైద్య సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి.. ప్రధానంగా శాంపిల్స్‌ సేకరణ, క్వా రంటైన్‌లో పాటించాల్సిన జాగ్రత్తలను ఆస్పత్రులకు వివరించారు. 

కోవిడ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో పని చేసేందుకు ప్రతి జిల్లా నుంచి 10 మంది వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేశారు. వారంతా గురువారం రిపోర్టు చేశారు. ప్రభుత్వ, ప్రైవే టు ఆస్పత్రులు కరోనా విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంపై ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేం ద్రం తన కార్యాకలాపాలను ప్రారంభించారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టే చర్యల విషయంలో రోజూ ఉదయం 10 గంటలకు స మావేశం కావాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రోజువారీ కార్యాచరణను సిద్ధం చేయనుంది. ఇప్పటికే ఆరు కమిటీలను కూ డా వేసింది. గురువారం మంత్రి ఈటల రా జేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉన్నతాధికారులతో సమావేశమయ్యా రు. కోవిడ్‌పై చేపట్టిన చర్యలు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

కాగా, బుధవారం వేసిన ఆరు కమిటీల సభ్యులకు సంబంధించిన వివరాలపై గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆరు కమిటీల్లో ఒకటైన సర్వైలెన్స్‌ కమిటీ సభ్యులతో గురువారం మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలో అధికారులకు ఆయన వివరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసే సిబ్బందికి అదనపు వేతనం, సర్టిఫికెట్‌ ఇస్తామని తెలిపారు. కాగా, కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా చర్యలపై రాష్ట్ర సర్కారు సన్నద్ధతపై తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. కొన్ని రోజుల పాటు ఆ బృందం ఇక్కడే ఉంటుంది. గురువారం గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రులను సందర్శించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా కోవిడ్‌ ఏర్పాట్లపై పర్యవేక్షించింది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులకు మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ నిర్దేశించింది. వాటి వివరాలు.. ప్రతి ఆస్పత్రిలో కోవిడ్‌ అవగాహన సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేయాలి. ఫ్లూ లక్షణాలతో వచ్చే వారికి ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయాలి. రోగి ప్రయాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. విదేశీ ప్రయాణికులు, వారితో కలిసి, లక్షణాలున్న ప్రతివారి వివరాలను కచ్చితంగా రికార్డు చేయాలి.

ఏదైనా ఆస్పత్రిలో అలాంటి లక్షణాలతో చేరితే, ఐసోలేషన్‌ వార్డులో ఉంచి, శాంపిళ్లు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపాలి. శాంపిల్స్‌ సేకరణ, వాటి రవాణా, ఐసో లేషన్‌ వార్డుల ఏర్పాటులో కచ్చితంగా ప్రొటోకాల్‌ ప్రకారం నడుచుకోవాలి. ఆస్పత్రులన్నీ తమ వైద్య సిబ్బందికి వ్యక్తిగత శుభ్రతతో పాటు రక్షణ చర్యలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి నివారణలో ప్రతి ఆస్పత్రి కచ్చితమైన విధానాలు పాటించాలి. వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై హైకోర్టులో దాఖలైన పిల్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ విచారణలో అధికారుల పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు స్టేట్‌ లెవల్‌, జిల్లా లెవల్‌ కమిటీలను నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రజలకు ఉచితంగా మాస్క్‌లు ఇస్తున్నామని, కరోనాపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొంది.

అనంతరం బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్‌ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉచితంగా మందులు, మాస్క్‌లు అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై రివ్యూ చేస్తామని దర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. కాగా గాంధీ  ఆస్పత్రిలో కరోనా వార్డు వద్దంటూ.. సూపరిండెంట్‌కు స్థానికలు లేఖ రాశారు. అదే లేఖను మంత్రికి కూడా పంపారు. కరోనా వల్ల చుట్టుపక్కల వాళ్లంతా బయపడుతున్నామని పద్మనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   8 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   17 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle