newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

21-09-202021-09-2020 13:10:59 IST
Updated On 21-09-2020 13:19:58 ISTUpdated On 21-09-20202020-09-21T07:40:59.213Z21-09-2020 2020-09-21T07:40:56.432Z - 2020-09-21T07:49:58.736Z - 21-09-2020

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఇంకా పూర్తి స్థాయిలో రోడ్డెక్కలేదు. పైగా రెండు నెలల లాక్ డౌన్ లో కూడా ఆర్టీసీ సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఆర్టీసీ సంస్థ నష్టాలపాలవుతుందనుకున్నారు అంతా. కానీ సీఎం కేసీఆర్ చేసిన ఆలోచనే ఆర్టీసీని గట్టెక్కించింది. అదే టీఎస్ ఆర్టీసీ కార్గో. ఈ ఏడాది జూన్ 19వ తేదీ నుంచి టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన మూడు నెలల్లోనే కార్గో ఊహించని లాభాలు ఆర్జించింది. తొలిరోజు రూ.15 వేలతో మొదలైన ఆదాయం ఇప్పుడు రోజుకి రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. 

టీఎస్ ఆర్టీసీ కార్గో అందుబాటులోకి వచ్చాక ప్రైవేటు ఏజెన్సీలు కాస్త దెబ్బతిన్నాయన్నది వాస్తవం. ప్రజల నుంచి ప్రైవేటు ఏజెన్సీలు అధిక దోపిడీ చేస్తుండటంతో చాలా వరకూ కార్గో సేవలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. ఈ స్థాయిలో ఆదాయం రావడమంటే మాటలు కాదు కదా. కరోనా కష్టకాలంలో ఆర్టీసీ సంస్థను ఆదుకున్నది ఖచ్చితంగా కార్గోనే అని చెప్పాలి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సైతం కార్గో మంచి ఆదాయం రాబట్టింది. 

సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన కార్గో ఆర్టీసీకి చిరు దీపమై ఆదాయ మార్గాన్ని చూపించింది. ప్రైవేటు ఏజెన్సీల్లో ఉన్న పార్శిల్ రేట్లతో పోలిస్తే ఆర్టీసీ పీసీసీ సేవల ఛార్జీలు చాలా తక్కువ. అందుకే పల్లెల్లో ఉండే ప్రజల నుంచి హైదరాబాద్ లో ఉండే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల వరకూ కార్గో సేవలనే వినియోగించుకుంటున్నారు. 

వివిధ సంస్థలకు చెందిన వస్తు రవాణాలే కాకుండా.. ఇంటి సామాన్లు తరలించేందుకు కూడా ఆర్టీసీ కార్గోని ఆశ్రయిస్తున్నారు ప్రజలు. ఇది కార్గో అభివృద్ధికి మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలకు చెందిన వస్తువులను రవాణా చేసేందుకు 160 నుంచి 170 కార్గో బస్సులను ఉపయోగిస్తుండగా.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్సుల డిక్కీల్లోనూ సరిపడినంత వరకు వస్తువులను రవాణా చేస్తోంది ఆర్టీసీ. 

ప్రస్తుతం ఒక బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకే ఉన్న ఈ కార్గో సేవలను మున్ముందు డోర్ డెలివరీ ఇచ్చే దిశగా అభివృద్ధి చేస్తామని చెప్తోంది ఆర్టీసీ సంస్థ. తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రమయితే.. కార్గో సేవలను మరింత విస్తరింపజేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. గతంలో ఆర్టీసీ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పార్శిల్ కొరియర్ సేవలను నిర్వహించేది. దాని ద్వారా సంస్థకు నెలకు రూ.70 లక్షల ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు స్వయంగా ఆర్టీసీనే కార్గో సేవలు ప్రారంభించడంతో రోజుకు లక్షల్లో ఆదాయం వస్తుంది. కరోనా వైరస్ పూర్తిగా నశించి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమైతే కార్గో సేవల ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్న విషయం స్పష్టమవుతుంది. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   36 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   8 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle