newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై మంత్రి ఈటెల సీరియస్ వార్నింగ్

12-08-202012-08-2020 06:09:14 IST
Updated On 12-08-2020 08:13:46 ISTUpdated On 12-08-20202020-08-12T00:39:14.095Z12-08-2020 2020-08-12T00:39:10.522Z - 2020-08-12T02:43:46.702Z - 12-08-2020

ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై మంత్రి ఈటెల సీరియస్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా చికిత్స విషయంలో ప్రయివేట్ ఆసుపత్రుల ఆగడాలతో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం వాటిపై తీవ్ర చర్యలకు సిద్ధమవుతోంది.  కొవిడ్‌ చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరు మారకుంటే వాటి ఐసీయూలతో పాటు సగం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా హెచ్చరించారు. ఆ విధంగా స్వాధీనం చేసుకునే పడకలు, ఐసీయూల్లో కరోనా రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో చికిత్స అందించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు 1,039 ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ అంశంపై మంత్రి సోమవారం బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించారు. భారీగా బిల్లులు వేయడం, బిల్లులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం, రూ.3-4 లక్షలు అడ్వాన్స్‌ చెల్లిస్తే తప్ప అడ్మిట్‌ చేసుకోకపోవడం, పడకల కృత్రిమ కొరత సృష్టించడం, కనీసం నిర్ధారణ పరీక్షలు చేయకుండానే తిప్పి పంపడం వంటివి చేస్తున్నాయంటూ ప్రైవేటు ఆస్పత్రులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయని అధికారులు ఈసందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

అలాగే బీమా ఉన్న రోగులను చేర్చుకోకపోవడం, క్రెడిట్‌ కార్డులను అంగీకరించకపోవడం, డబ్బులు చెల్లిస్తేనే డెడ్‌బాడీని అప్పగిస్తామనడంపైనా ఫిర్యాదులు అందినట్లు అధికారులు వివరించారు. ఇతర జబ్బులతో చికిత్స చేయించుకోవడానికి ఆస్పత్రికి వస్తే కరోనా ప్యాకేజీ పేరిట డబ్బుల వసూలు, బ్లడ్‌ టెస్టుల్లోనూ డి-దైమర్‌, ఎల్‌డీహెచ్‌, సీఆర్‌పీ, ఫెరిటిన్‌, ఐఎల్‌6 లాంటి పరీక్షలు అవసరం లేకున్నా చేస్తున్నారని పేర్కొన్నారు. 

అలాగే.. కొన్ని ఆస్పత్రుల్లో రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ - పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీ-పీసీఆర్‌) టెస్టులకు అనుమతులున్నా... అవి చేయకుండా  సీటీ స్కాన్‌, ఎక్స్‌రే, రక్త పరీక్షల పేరిట అనుమానిత లక్షణాలు కలిగిన వారిని ఇబ్బందికి గురిచేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో ప్రతి ఆస్పత్రికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణల పరిశీలనకు వెంటనే ఒక కమిటీని ఏర్పాటుచేయాలని, విచారణలో తప్పులు తేలిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల ఆదేశాలు జారీ చేశారు. 

ప్రైవేటు ఆస్పత్రులపై తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ బృందానికి మంత్రి ఈటల వివరించగా వారు కూడా సమర్ధించారని, అవసరమైతే ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని వారు సూచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.  

యశోదా ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందే.. బీజేవైఎం నేతల ఆందోళన

కరోనా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్న యశోద ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలంటూ బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో యశోదా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోవిడ్ నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా కరోనా రోగుల నుంచి 15 లక్షల నుంచి 50 లక్షలు గుంజుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో మలక్‌పేట యశోద ఆసుపత్రి ముందు కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి ఈ సర్కార్  ప్రజల రక్తాన్ని పీలుస్తోందని బీజేవైఎం నేతలు ఆరోపించారు.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   13 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle