newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ ఛార్జీలివే!

28-06-202028-06-2020 11:07:52 IST
2020-06-28T05:37:52.397Z28-06-2020 2020-06-28T05:37:42.520Z - - 12-04-2021

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్ ఛార్జీలివే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ట్రీట్ మెంట్ అందిస్తున్నాయి. కరోనాకు స్పెషల్​ ప్యాకేజీలు ప్రకటిస్తున్న ప్రైవేట్​ ఆస్పత్రులు కరోనా వైరస్ తీవ్రతను బట్టి 5 నుంచి 17 రోజుల వరకు ట్రీట్​మెంట్​ అందిస్తున్నాయి. రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్​ చేస్తున్నాయి. ఈ ట్రీట్ మెంట్లో భాగంగా మాస్కులు, శానిటైజర్లు, థర్మామీటర్లు, ఆక్సిమీటర్లతో కరోనా కిట్​ కూడా అందిస్తున్నాయి. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కేసులు పెరిగే కొద్దీ అక్కడా బెడ్స్​ సరిపోయే పరిస్థితి లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినా అక్కడా లిమిటెడే. అందుకే రాష్ట్ర సర్కార్​ పాజిటివ్​ వచ్చిన వాళ్లనూ హోమ్​ఐసోలేషన్​లోనే ఉంచుతోంది. ఇంటికి పంపుతోంది. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు ప్రైవేట్​ ఆస్పత్రులు ఇంటివద్దే ట్రీట్​మెంట్​ చేసే ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసెస్​ను ప్రకటిస్తున్నాయి. హోం ఐసోలేషన్​లో ఉన్న పేషెంట్ల కోసం స్పెషల్​ కొవిడ్​19 వర్చువల్​ హోమ్​కేర్​ ఫెసిలిటీస్​ను కొన్ని ప్రైవేట్​ఆస్పత్రులు అందిస్తున్నాయి.

హైదరాబాద్​లోని యశోద, కిమ్స్​, కాంటినెంటల్​, మెడికవర్​, సెంచరీ, కేర్​, కాంటినెంటల్​ వంటి ప్రముఖ ఆస్పత్రులు ఈ స్పెషల్​ హోం ట్రీట్​మెంట్​ను చేస్తున్నాయి. తీవ్రతను బట్టి బేసిక్​, అడ్వాన్స్​డ్​ ప్యాకేజీలను ఇస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి 5 రోజుల నుంచి 17 రోజుల వరకు ట్రీట్​మెంట్​ అందిస్తున్నాయి. అందుకు రూ.3,500 నుంచి రూ.20 వేల వరకు చార్జ్​ చేస్తున్నాయి. ట్రీట్​మెంట్​తో పాటు కరోనా కిట్​ను కూడా హాస్పిటళ్లు ఇస్తున్నాయి. ట్రీట్​మెంట్​ చార్జీలకు ఇవి అదనం. ఈ కిట్​లో పల్స్​ ఆక్సిమీటర్​, డిజిటల్​థర్మామీటర్​, ఎన్​95 మాస్కులు, శానిటైజర్​, ఇన్సెంటివ్​ స్పైరోమీటర్​, వేస్ట్​ డిస్పోజబుల్​ బ్యాగ్స్​, గ్లోవ్స్​ ఉంటాయి.

ఇవి 24 గంటల ఎమర్జెన్సీ అంబులెన్స్​ సర్వీస్​ను అందిస్తున్నాయి. ప్యాకేజీల్లో భాగంగా హోం ఐసోలేషన్లోని పేషంట్లకు రోజూ వీడియో కాల్​ ద్వారా డాక్టర్లు, నర్సులు, డైటీషియన్లు పేషెంట్లను మానిటర్​ చేస్తారు. అపోలో హాస్పిటల్స్​.. ప్రాజెక్ట్​ కవచ్​ పేరుతో టెలీ కన్సల్టేషన్​ యాప్​ను లాంచ్​ చేసింది. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది టెలీ కన్సల్టేషన్​ సేవలు వాడుకునే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. తక్కువ లక్షణాలున్న వాళ్లనూ హోమ్​ఐసోలేషన్​ అవ్వాలని ఇటు డాక్టర్లూ చెబుతున్నారు. ఆస్పత్రికి వెళ్ళి మిగతా పేషంట్లతో ఉండడం వల్ల ఇబ్బందులు పడకుండా హోం ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కేర్ ఆస్పత్రివారు 17 రోజుల ప్యాకేజీకి రూ. 7,999 కి అందిస్తుంటే.. కిమ్స్ ఆస్పత్రి 14 రోజులకు రూ.12,999 కి హోం ఐసోలేషన్ అందిస్తోంది. బెడ్ ఛార్జీలు లేకపోవడంతో ఈ మొత్తం ఆస్పత్రి నుంచి ఆస్పత్రికి మారుతుంది. కాంటినెంటల్​ ఆస్పత్రిలో బేసిక్ ప్యాకేజీ 7 రోజులకు రూ.3,499 అడ్వాన్స్​డ్​ ప్యాకేజీ రూ.3,999కి అందిస్తోంది. యశోద ఆస్పత్రి 15 రోజులకు రూ.19500 కి అడ్వాన్స్​డ్​ ప్యాకేజీ అందిస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle