newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల తనిఖీకై రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌..

10-09-202010-09-2020 07:53:55 IST
2020-09-10T02:23:55.644Z10-09-2020 2020-09-10T02:23:51.780Z - - 12-04-2021

ప్రైవేట్‌ ఆసుపత్రుల తనిఖీకై రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల తీరుతెన్నులపై సాక్షాత్తూ ముఖ్యమంత్రే మండిపడటం, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్షాలు బలంగా డిమాండ్ చేయడం నేపథ్యంలో కరోనా చికిత్సలో ప్రైవేట్‌ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఐఏఎస్‌లతో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. టాస్క్‌ఫోర్స్‌లో రాహుల్‌ బొజ్జా, సర్ఫరాజ్‌ అహ్మద్, డి.దివ్య ఉన్నారు. 

మొదటినుంచి నేను చెబుతూ వస్తున్నాను. కోవిడ్-19 ట్రీట్‌మెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చేయాలని చెబుతూ వస్తున్నాను. ఎందుకంటే కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల రక్తం పీల్చేస్తాయి. కానీ హైకోర్టు జోక్యంతో కోవిడ్-19 రోగులకు కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స చేయడానికి ప్రభుత్వం అనుమతించాల్సి వచ్చిందని రాష్ట్ర సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

కానీ ప్రభుత్వం సదుద్దేశంతో కార్పొరేట్ ఆసుపత్రులకు కరోనా చికిత్సకు అనుమతి మంజూరు చేస్తే తొలి రోజునుంచే అవి ప్రజలను పీల్చేయడం మొదలెట్టాయని ఈ సంక్షుబిత కాలంలో రోగులనుంచి లక్షలాది రూపాయలు డబ్బు గుంజటం కార్పొరేట్ ఆసుపత్రులను సమంజసమేనా అని కేసీఆర్ అసెంబ్లీలో ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం రోగుల వద్ద అధిక పీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటోందని. దీంట్లో భాగంగానే నెలకొల్పిన టాస్క్ ఫోర్స్ ప్రతి వారమూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీరుతెన్నులపై నివేదిక పంపాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు.

ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలోనూ సీఎం కేసీఆర్‌ ఆసుపత్రుల తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు కూడా డిమాండ్‌ చేయడంతో ఆగమేఘాల మీద ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు అందించే వివిధ సేవలకు వసూలు చేయాల్సిన గరిష్ట రేట్లు పేర్కొంటూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయా రేట్లను ఆస్పత్రులు తమ ప్రాంగణంలో ప్రముఖంగా ప్రదర్శించాలని కూడా ఆదేశించింది. 

ఫీజులపై రోగి బంధువులకు వివరించాలి. కానీ, ఆస్పత్రులు వీటిని పాటించకపోవడంపై వైద్య, ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం కింద తగు చర్యలు తీసుకునేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వం నిర్ధేశించిన గరిష్ట ఫీజులను ఆసుపత్రులు పాటిస్తున్నాయా.. లేదా.. ఈ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తుంది. కరోనా చికిత్స, భద్రతా ప్రొటోకాల్‌లను పరిశీలించి ఎప్పటికప్పుడు తమ నివేదికను ప్రధాన కార్యదర్శికి సమర్పిస్తాయి. అంతేకాదు... ఈ టాస్క్‌ఫోర్స్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు కూడా నిర్వహిస్తుంది.

ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 10వేల పడకలు సిద్ధం : మంత్రి ఈటల

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్‌ సౌకర్యం కలిగిన 10 వేల బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో బుధవారం కోవిడ్‌–19పై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు పరిస్థితిని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూలంకషంగా వివరించారు. 1,259 వెంటిలేటర్లు, 200 హై ఫ్లో నాసల్‌ ఎక్విప్‌ మెంట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. 

కరోనా నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 1,224 పడకల సామర్థ్యం కలిగిన, అన్ని రకాల వైద్య పరికరాలతో తెలంగాణ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను కొత్తగా ఏర్పాటు చేసిందని చెప్పారు. అందులో కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతొందన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 10.30 లక్షల పీపీఈ కిట్లను, 18.50 లక్షల ఎన్‌–95 మాస్కులు, 24 వేలకుపైగా రెమిడిసివిర్‌ ఇంజక్షన్లను ఆసుపత్రులకు అందించామన్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle