newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ప్రియాంక రెడ్ది హంతకులకు ఉరి శిక్షే...చట్టాలకు మరింత పదును

30-11-201930-11-2019 16:38:33 IST
Updated On 30-11-2019 17:05:18 ISTUpdated On 30-11-20192019-11-30T11:08:33.384Z30-11-2019 2019-11-30T11:08:27.195Z - 2019-11-30T11:35:18.201Z - 30-11-2019

ప్రియాంక రెడ్ది హంతకులకు ఉరి శిక్షే...చట్టాలకు మరింత పదును
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏళ్ళనాటి చట్టాలను మారుస్తామని, మహిళలపై అఘాయిత్యాలు, హత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష పడేలా చూస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. సత్వరం న్యాయం లభించే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. షాద్ నగర్ ఘటనపై జనం ఆగ్రహంతో ఉన్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని చాలామంది తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేస్తున్నారని.. ఇకనుంచి అలాంటి ప్రక్రియ లేకుండా చేస్తామని అన్నారు. ట్రయల్ కోర్టులో విధించిన తీర్పును మధ్యలో మరో కోర్టులో సవాల్ చేసే అవకాశం లేకుండా చేస్తాం. కేవలం సుప్రీంకోర్టులోనే తేల్చుకునేలా చట్టాలను మారుస్తామన్నారు.

మహిళల రక్షణ కోసం శనివారం ఉదయం ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఒక యాప్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతీ ఆడబిడ్డ ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సింగిల్ డిజిట్ ప్రెస్ ద్వారా క్షణాల్లో సమీపంలోని పోలీసులకు,కుటుంబ సభ్యులకు సమాచారం వెళుతుందన్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా పోలీసుల సాయం తీసుకోవాలన్నారు.ఈ యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామన్నారు. తాజా ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మరోవైపు శంషాబాద్‌లో దారుణ హ‌త్య‌కు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు తన మనసును తీవ్రంగా కలిచివేశాయన్నారు. ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. 

గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ పరామర్శ 

శనివారం మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్న పరామర్శించారు. రాజ్ భవన్ నుంచి బయలు దేరిన గవర్నర్ ప్రియాంక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.  తెలంగాణలో ఒక సంఘటన అనంతరం స్వయంగా గవర్నరే బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తొలిసారి.  ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించి, సంఘీబావాన్ని తెలిపిన గవర్నర్ వెంటనే అక్కడినించి బయలుదేరి వెళ్ళారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   5 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   8 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   10 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   11 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   11 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle