newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ప్రియాంకా హత్య కేసులో మీడియా ముందుకు నిందితులు

29-11-201929-11-2019 19:53:32 IST
Updated On 29-11-2019 20:01:57 ISTUpdated On 29-11-20192019-11-29T14:23:32.903Z29-11-2019 2019-11-29T14:23:31.098Z - 2019-11-29T14:31:57.461Z - 29-11-2019

ప్రియాంకా హత్య కేసులో మీడియా ముందుకు నిందితులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డాక్టర్ ప్రియాంక రెడ్డి మర్డర్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం అయింది.  ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను లారీ నెంబర్ TS07 UA 3335 ఆధారంగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు పూర్వాపరాలను సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. నిందితులు నలుగురు లారీ పనులు చేస్తారని ఆయన వెల్లడించారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యకేసులో ఏం జరిగిందో ఆయన వివరించారు.ఈ కేసులో నవీన్(డ్రైవర్), కేశవులు(క్లీనర్), శివ(క్లీనర్), పాషా(డ్రైవర్) లుగా గుర్తించామన్నారు. ప్రియాంకపై కన్నేసిన ఈ నలుగురు నిందితులు అంతా పథకం ప్రకారం ఆమెను హత్య చేశారు. 

ప్రియాంకా కేసులో పోలీసులు సరిగ్గా స్పందించలేదనే దానిపై విచారణ జరుపుతున్నాం అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ప్రియాంకను హత్య చేశారు.. నోరునొక్కి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ప్రియాంక మృతిచెందిందని సీపీ చెప్పారు. ప్రియాంక స్కూటర్ ను నవీన్ పంక్చర్ చేశాడని, ముక్కు, నోరు మూసేసి ప్రియాంకను అరీఫ్ హత్యచేశాడన్నారు.

వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెడతామని వెల్లడించారు. వైద్యురాలు సా.5.42కి నక్షత్ర కాలనీలోని ఇంటి నుంచి బయలుదేరిందన్నారు. సా.6.13 తొండుపల్లి ప్లాజా దగ్గర వెహికల్‌ పెట్టిందన్నారు. రాత్రి 9.13 గచ్చిబౌలి నుంచి తొండుపల్లి ప్లాజాకు వచ్చిందని చెప్పారు. రాత్రి 9.48కి ఆమె ఫోన్ స్విచ్చాఫ్‌ అయిందని వెల్లడించారు. రాత్రి 2.30 సమయంలో ప్రియాంక డెడ్ బాడీని కాల్చారని సీపీ చెప్పారు. 

డాక్టర్ ప్రియాంకా రెడ్డి మిస్ అయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారన్నారు. 10 టీమ్స్ అప్రమత్తం అయ్యాయని, డాగ్ స్క్వాడ్స్ నిందితులను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయన్నారు.పోలీసుల నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు డయల్ 100 వాడాలన్నారు సీపీ. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle