newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ప్రియాంకారెడ్డి ఉదంతంపై మహిళా కమిషన్ సీరియస్

01-12-201901-12-2019 08:29:23 IST
2019-12-01T02:59:23.805Z01-12-2019 2019-12-01T02:52:52.794Z - - 22-02-2020

ప్రియాంకారెడ్డి ఉదంతంపై మహిళా కమిషన్ సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఉదంతం దుమారం రేపుతోంది. పోలీసుల తీరుపై జాతీయ మహిళాకమిషన్ సీరియస్ అవుతోంది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని.. ఘటన తర్వాత సీసీ టీవీలు చూడటం కాదు.. రోజు మొత్తం మానిటరింగ్ చేయాలని మహిళా కమిషన్ సూచించింది.

తీవ్ర నిర్లక్ష్యం వహించిన పోలీసులను డిస్మిస్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది, ప్రియాంక ఫోన్ ఇప్పటికీ లభించలేదని,  పోలీసులు సరిగా స్పందించడంలేదని కుటుంబసభ్యులు మహిళా కమిషన్ సభ్యులకు వివరించారు. 

జాతీయ రహదారులపై లారీలు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తుంటే.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదని జాతీయ మహిళా కమిషన్ ప్రశ్నించింది.

ప్రియాంకరెడ్డి హత్యపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీనుంచి సభ్యులను హైదరాబాద్ పంపించిన సంగతి తెలిసిందే. పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, బాధితుల పట్ల వైఖరి మార్చుకోవాలని,  భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మహిళా కమిషన్ పేర్కొంది. 

ఇదిలా ఉంటే ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు మేజిస్ట్రేట్. ఈ సందర్భంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియాంకరెడ్డి హత్యకు కారణమయిన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీ యజమాని శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.  శ్రీనివాస్‌రెడ్డి దగ్గరే లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఆరీఫ్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితుడు.

కోర్టులో నిందితులకు శిక్షపడేలా ఆధారాలు సేకరించామని... ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీపీ ప్రకాష్ రెడ్డి అన్నారు . కోర్టులో నిందితులకు కఠినంగా శిక్షపడుతుందన్నారు.

ప్రజలు పోలీసులకు సహకరించాలని డీసీపీ ప్రకాష్ రెడ్డి కోరారు. ప్రియాంక హత్య కేసులో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రియాంక తండ్రి ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుల్స్ వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌పై చర్యలు తీసుకున్నారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle