newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ప్రాజెక్టులకు జలకళ.. 3 రోజుల్లో శ్రీశైలం ఫుల్.. దాని వెనుకే సాగర్..

19-08-202019-08-2020 07:18:58 IST
2020-08-19T01:48:58.741Z19-08-2020 2020-08-19T01:48:56.135Z - - 21-10-2020

ప్రాజెక్టులకు జలకళ.. 3 రోజుల్లో శ్రీశైలం ఫుల్.. దాని వెనుకే సాగర్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విభజనానంతర తెలుగు రాష్ట్రాల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్న భారీ వర్షాల దెబ్బకు ఏపీ, తెలంగాణల్లో జలధారలతో నేల పులకించిపోతోంది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జల కళ వచ్చింది. ఎగువ నుంచి వస్తున్న జలప్రవాహాలు ఎంత జోరుగా ఉన్నాయంటే రోజుకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 20 నుంచి 25 టీఎంసీల దాకా నీరు వచ్చి పడుతోంది. దీంతో మరో మూడరోజుల్లో శ్రీశైలం, మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ పొంగి పొరలనున్నాయని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యేకించి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరో రెండేళ్ల వరకు తెలుగు రాష్ట్రాలకు నీటి కొరత, కరువు అనేవి ఉండవని ప్రజలు సంతోషిస్తున్నారు.

ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండగా.. గోదావరి కొంతమేర శాంతించింది. కృష్ణమ్మకు వరద తాకిడితో.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరువవుతోంది. మూడురోజుల్లో శ్రీశైలం, వారం రోజుల్లో నాగార్జునసాగర్‌ నిండిపోయే అవకాశాలున్నాయి. సోమవారానికి ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో.. జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. అధికారులు 39 గేట్లను ఎత్తి.. జూరాల నుంచి నీటిని కిందకు వదిలారు. 

దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 2,80,055 క్యూసెక్కుల వరద నమోదయింది. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 872.80 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. శ్రీశైలం పూర్తిగా నిండాలంటే మరో 62 టిఎంసీల నీరు అవసరం. ఎగువలోని వరదను అంచనా వేస్తే.. రోజూ 20 టీఎంసీల నుంచి 25 టీఎంసీల నీరు వస్తోంది. ఈ లెక్కన మరో మూడు రోజుల్లో శ్రీశైలం పూర్తిగా నిండనుంది. 

కాగా.. శ్రీశైలం నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ప్రస్తుతం 4 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 252 టీఎంసీల నిల్వలుండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండాలంటే మరో 60 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుత ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో నాగార్జునసాగర్‌ నిండిపోయే అవకాశాలున్నాయి.

ఇక గోదావరి బేసిన్‌లో వరద తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్‌లోకి సోమవారం 64 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 90 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో సోమవారం నాటికి 50 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 68 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. కడెం ప్రాజెక్టు దాదాపు నిండింది. ప్రాణహిత, మానేరు నుంచి వరద తగ్గింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద సోమవారం గోదావరి 9.87మీటర్ల ఎత్తు నీటితో ప్రవహిస్తోంది. 

మేడిగడ్డ బ్యారేజీలోకి 7.41 లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా.. 65 గేట్లు ఎత్తి 7.59లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే ఒకే రోజు 70 టీఎంసీల నీరు దిగువకు పోతోంది. అన్నారం బ్యారేజీలోకి 1.27లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 25గేట్లు ఎత్తి 1.49లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. 

భద్రాచలంలో ఏడేళ్ల తరువాత తొలిసారి గోదావరి నీటిమట్టం రికార్డు స్థాయిలో 61 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు తుది హెచ్చరికను ప్రకటించారు. గోదావరి ఉప నదుల నుంచి 17 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టరు ఎంవీ.రెడ్డి తెలిపారు. చర్లలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద చేరుతుండడంతో 25గేట్లు ఎత్తి 1.45లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle