newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు

24-08-202024-08-2020 19:40:57 IST
Updated On 25-08-2020 08:15:30 ISTUpdated On 25-08-20202020-08-24T14:10:57.551Z24-08-2020 2020-08-24T14:09:27.560Z - 2020-08-25T02:45:30.618Z - 25-08-2020

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఆర్టీసీ సేవలు రెండువైపులా ప్రారంభం కానున్నాయి.  తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు. బస్సులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో చర్చలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్‌భవన్‌కు చేరుకుని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సహా ఉన్నతాధికారులతో చర్చలు జరపుతున్నారు. దీంతో బస్సు సర్వీసులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. 

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల కోసం లక్షలాదిమంది ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం ఒప్పందం చేసుకునేందుకు ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. అంతర్రాష్ట్ర ఒప్పందం రూపకల్పన, అమలు చేయాల్సిన విధానంపై సమగ్రంగా చర్చిస్తున్నారు.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఏ ప్రాంతాలకు ఎన్ని నడపాలి, పాటించాల్సిన విధి విధానాలు తదితర అంశాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రవాణా అధికారులు రెండువైపులా సమానంగా సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. 

కరోనా లాక్ డౌన్ ప్రారంభం అయిన అనంతరం మార్చి 22నుంచి ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనంతరం లాక్‌డౌన్‌ సడలింపులతో మే 21 తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా తదితర పొరుగు రాష్ట్రాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.

అయితే, మూడు నెలలు గడిచినా తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభం కాలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని.. ఒప్పందం కుదుర్చుకున్నాకే బస్సులు నడిపేందుకు అనుమతిస్తామని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టింది,

దీంతో బస్సు సర్వీసులు ప్రారంభం కాలేదు. ఒప్పందంపై జూన్ తొలివారంలో విజయవాడలో ఇరు రాష్ట్రాల మధ్య ఓ దఫా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఒప్పందానికి ఇరు రాష్ట్రాల అధికారులు సమ్మతి తెలిపారు. తదనంతరం మరో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో బస్‌ భవన్‌లో కరోనా ప్రబలడంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. తిరిగి సోమవారం ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర ఒప్పందంపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు జరిగితే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీనుంచి బస్సులు రయ్యిరయ్యిన తిరిగే అవకాశం ఉంది. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle