newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రభుత్వ డాక్టర్‌పై కేసు.. సోషల్ మీడియాలో పోస్టులే కారణమా?

01-09-202001-09-2020 14:49:47 IST
Updated On 01-09-2020 16:11:24 ISTUpdated On 01-09-20202020-09-01T09:19:47.531Z01-09-2020 2020-09-01T09:19:41.401Z - 2020-09-01T10:41:24.113Z - 01-09-2020

ప్రభుత్వ డాక్టర్‌పై కేసు.. సోషల్ మీడియాలో పోస్టులే కారణమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో సోషల్ మీడియా బాగా వ్యాపించింది. వివిధ ఉన్నత పదవుల్లో వున్నవారిని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తీవ్రమయిన సందేశాలు పోస్టు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ డాక్టర్ పై కేసు నమోదైంది. సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర సందేశాలు పోస్టు చేసిన కార‌ణంగా సిరిసిల్ల పోలీసులు ఓ ప్ర‌భుత్వ వైద్యుడిపై కేసు న‌మోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... సిరిసిల్ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఇబ్ర‌హీం పనిచేస్తున్నాడు. ఇటీవల ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా యూనిట్ వాట్స‌ప్ గ్రూప్‌లో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌ను పోస్టు చేశాడు. 

Police cracking down on 'objectionable' social media posts | Pakistan Today

ఆగ‌స్టు 30న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌, ఏబీవీపీ ల‌క్ష్యంగా సందేశాల‌ను పోస్టు చేశాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై సిరిసిల్ల టౌన్ బీజేపీ అధ్య‌క్షుడు, న్యాయ‌వాది అన్నాల‌దాస్ వేణు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. హిందూ వ‌ర్గాల‌ను రేపిస్టులుగా, కామాంధులుగా డాక్ట‌ర్ ఇబ్ర‌హీం పేర్కొన్నాడంటూ ఫిర్యాదులో వివరించాడు.

హిందూ, ముస్లింల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొనేలా డాక్ట‌ర్ ప్ర‌య‌త్నించిన‌ట్లుగా పేర్కొన్నాడు. వేణు ఫిర్యాదును అనుస‌రించి పోలీసులు వైద్యుడిపై కేసు న‌మోదు చేశారు. ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

ఖమ్మంలో టెన్షన్ టెన్షన్ 

ఖమ్మం టౌన్లోని ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆనంద్ అనే యువకుడి మృతికి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమనే అనుమానంతో కైకొండాయి గూడెం గ్రామస్తులు అతడిపై దాడికి యత్నించారు. గ్రామస్తులు కారును ధ్వంసం చేశారు. భయంతో రామ్మూర్తి నాయక్ ప్రభుత్వ పాఠశాలలో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తెచ్చే  ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle