ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం : కేసీఆర్
18-07-202018-07-2020 17:36:55 IST
2020-07-18T12:06:55.659Z18-07-2020 2020-07-18T12:06:52.673Z - - 22-04-2021

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని శపథం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్రలో తొలిసారిగా ఒక వినూత్న పథకానికి తెర తీశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్ననికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని అధికారులు గతంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కాలేజీల్లో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రాపవుట్స్ నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు భోజనం పెడుతున్న సమాచారం సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అధికారులు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. వారిద్దరూ తాము పనిచేస్తున్న చోట పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. దీంతో వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సీఎంనే కదిలించిన లెక్చరర్ రఘురామ్ ఆదర్శం తాను పాఠాలు బోధిస్తున్న కాలేజీలో విద్యార్థులు ఉదయమే వచ్చి మధ్యాహ్నానికి వెళ్లిపోతున్న వైనం గమనించిన ఆ లెక్చరర్ ఇలాంటి డ్రాపవుట్లు తన కాలేజీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తన ప్రాంత ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మారెడ్డి సహాయ సహకారాలతో తన కాలేజీ విద్యార్థులకు సొంత ఖర్చుతో మధ్యాహ్నం భోజనం అందించడం ద్వారా వారు కాలేజీలోనే ఉండేలా ఆ లెక్చరర్ నిజం చెప్పాలంటే యజ్ఞమే చేశారు. ఈ వార్త ఆనోటా ఈనోటా పాకి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం దాకా వెళ్లింది. వెంటనే మంత్రి లక్ష్మారెడ్డికి చెప్పి ఆ లెక్చరర్ రఘురామ్‌ని ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారు. స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఆ లెక్చరర్ దాతృత్వం సాక్షిగా తన ప్రభుత్వం కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరం గుర్తిస్తున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి చిరుసాయం ఒక ప్రభుత్వాన్నే స్పందింపజేసింది. స్వార్థం లేకుండా ఆయన చేసిన పని ఒకరాష్ట్ర ప్రభుత్వ కాలేజీ విద్యార్థులందరికీ మధ్యాహ్న బోజన సౌకర్యాన్ని అందించింది. జీవితం సార్థకమయ్యే క్షణాలు అంటే ఇవే కదా..

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా