newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రభుత్వ కొత్త టార్గెట్.. 10 రోజుల్లో కరోనా ఫ్రీ తెలంగాణ!

11-04-202011-04-2020 11:21:59 IST
Updated On 11-04-2020 12:00:59 ISTUpdated On 11-04-20202020-04-11T05:51:59.067Z11-04-2020 2020-04-11T05:51:44.224Z - 2020-04-11T06:30:59.086Z - 11-04-2020

ప్రభుత్వ కొత్త టార్గెట్.. 10 రోజుల్లో కరోనా ఫ్రీ తెలంగాణ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త టార్గెట్ గా చర్యలకు సిద్ధమైంది. ఈనెల 22 నాటికి కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను చక్కదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గత రెండు రోజులుగా చర్యలలో కఠినం పెంచింది. గురువారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇందులో 414 మందికి గాంధీలో చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఇప్పటికే 45 మంది డిశ్చార్జ్ కాగా శుక్రవారం మరో 60 నుండి 70 మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. కాగా గురువారం వరకు గత వారం రోజులుగా పదులసంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు గురువారం తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ప్రభుత్వం కరోనా కట్టడికి పక్కా ప్రణాళికలను కూడా సిద్ధం చేసి గురువారం నుండే అమలుకి సిద్దమైంది.

నిజానికి ఈనెల 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ చేయాలని ఇక్కడ ప్రభుత్వం సంకల్పించింది. సీఎం కేసీఆర్ కూడా అదే విషయాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టారు. కానీ ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్ధన రూపంలో ఊహించని షాక్ తగిలింది. దీంతో టార్గెట్ కాస్త ఫెయిల్ అయిపొయింది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ వెళ్లి వచ్చిన అందరినీ.. వారితో కాంటాక్ట్ అయిన వారిని కూడా అందరికీ క్వారంటైన్ చేశారు.

దీంతో బయట ఎక్కడా కూడా కనీసం అనుమానితులు లేకుండా చేసినట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రోజుకి ఐదారు వందల మందికి పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీరిలో అతికొద్ది మందికే పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నవారు.. వారితో కాంటాక్ట్ అయిన వారిని కూడా ఈ పదిరోజులలో పరీక్షలు పూర్తిచేసి పూర్తిస్థాయి నిర్ధారణకి వస్తే పాజిటివ్ సంఖ్య ఎంతన్నది ఖచ్చితంగా తేల్చనున్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో పటిష్ట చర్యలను కూడా అమలు చేసి కరోనా వ్యాప్తి కట్టడికి సిద్దమయింది. ఇందులో భాగంగా ముందుగా కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. ఈ ప్రాంతాల నుండి బయటవ్యక్తులను, ఈ ప్రాంతాల వారిని బయటకు అనుమతిలేకుండా చేస్తున్నారు. దీంతో చైన్ లింక్ కట్ అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

అయితే, మరో మూడు రోజులలో కేంద్రం విధించిన లాక్ డౌన్ పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్రం పొడగించినా లేక తొలగించినా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వమే లాక్ డౌన్ కొనసాగించేందుకు కూడా సిద్ధమైంది. ఈరోజే ప్రధానితో రాష్ట్రాల సీఎంల వీడియో కాన్ఫిరెన్స్ సమావేశం ఉండగా కేంద్రంలో క్యాబినెట్ సమావేశం కూడా జరుగనుంది. ఈ రెండు సమావేశాల అనంతరం లాక్ డౌన్ పై స్పష్టత రానుంది.

అయితే, కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం కనీసం మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడగించి కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని ప్రభుత్వం బలంగా భావిస్తుంది. అందుకోసమే ఈనెల 22ను టార్గెట్ గా పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు తప్పనిసరి వంటి పటిష్ట చర్యలు, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మినా జైలుకి వంటి కఠిన చట్టాలతో ముందుకు వెళ్తుంది. మరి టార్గెట్ సక్సెస్ ఫుల్ గా ఛేదించాలని మనమూ కోరుకుందాం!

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle