ప్రభుత్వాల రహస్య జీవోలు.. కోర్టుల మొట్టికాయలు!
18-02-202018-02-2020 12:56:09 IST
2020-02-18T07:26:09.352Z18-02-2020 2020-02-18T07:26:06.539Z - - 15-04-2021

ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయం.. జీవోల రూపంలో విడుదల చేస్తుంది. ఆ జీవో ఎందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చింది.. దానికి అయ్యే ఖర్చుల అంచనా.. విధివిధానాలు ఆ జీవో ద్వారానే ప్రజలకు తెలుస్తుంది. ఏ ప్రభుత్వమైనా ఆ జీవోను ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ డొమైన్ లో ఉంచాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోల పట్ల రహస్యాలను పాటించడం కోర్టులకు ఆగ్రహం తెప్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నుంచి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం 1,04,171జీవోలు జారీచేయగా అందులో 42,462 జీవోలను రహస్యంగా ఉంచిదని పేర్కొంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు గత ఏడాదే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇందుకు కోర్టు గత ఏడాది సెప్టెంబరులోనే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశాలు జారీచేసింది. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఏ. అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈనెల 28 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కాదు.. మరోవైపు ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా వేలసంఖ్యలో రహస్య జీవోలను విడుదల చేస్తుంది. ఆ జీవోలలో ఒక్క నెంబర్ మినహా అందులో ఎలాంటి వివరాలు ఉండడం లేదు. జగన్ ప్రభుత్వంపై ఈ విషయంలో కూడా తీవ్ర విమర్శలే వస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా సొమ్ము సొంత వ్యవహారాల కోసం వినియోగిస్తూ ఈ తరహా జీవోలు విడుదల చేస్తున్నట్లుగా వినిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చేలా రంగులు వేసిన జీవోలు.. అందుకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు.. పార్టీ నేతలు.. సీఎంకి నచ్చిన అధికారులను కార్యదర్శులుగా నియమించి క్యాబినెట్ హోదాలను కల్పించడం.. వారికి సంబంధించిన నిధుల విడుదల వంటివి ఈ రహస్య జీవోలలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు అంటే తప్పకుండా అందులో ప్రజా వ్యతిరేకత ఉండే ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ఈ తరహా జీవోలను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు పడినందున ఏపీలో జగన్ సర్కార్ ముందుగానే మేల్కొంటే మంచిదేమోననిపిస్తుంది. మరి వైసీపీ ప్రభుత్వం అంతటి నిర్ణయం తీసుకొని బండారం బయటపెడుతుందా?

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
an hour ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
5 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
8 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా