newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రభుత్వాలవి మాటలే.. వలస బతుకుల వ్యథ తీరనేలేదు!

15-04-202015-04-2020 14:28:03 IST
Updated On 15-04-2020 14:38:13 ISTUpdated On 15-04-20202020-04-15T08:58:03.710Z15-04-2020 2020-04-15T08:58:01.742Z - 2020-04-15T09:08:13.671Z - 15-04-2020

ప్రభుత్వాలవి మాటలే.. వలస బతుకుల వ్యథ తీరనేలేదు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రం నుండి రాష్ట్రం వరకు ప్రభుత్వాలు వలస కార్మికులను ఆదుకుంటామని హామీల మీద హామీలు  ఇస్తున్నా వారి బ్రతుకులు మాత్రం మారలేదని ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. దేశ రాజధాని  ఢిల్లీ నుండి మన భాగ్యనగరం వరకు ప్రతిరోజు ఎక్కడో చోట వలస కూలీలు రోడ్డెక్కుతూనే ఉన్నారు.  ప్రభుత్వాలు ప్రతిరోజు ఏ ఒక్కరిని పస్తులు ఉండనివ్వమని వాగ్ధానాలు చేస్తూనే ఉన్నాయి.

తాజాగా హైదరాబాద్‌లోని మల్కాజిగిరి, సఫిల్ గూడా ప్రాంతాలలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కొందరు వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. లాక్ డౌన్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నామని, తిండి, సరైన నివాసం లేక అవస్థలు పడుతున్నామని వారు వాపోయారు. దాదాపు 500  వరకూ వలస కార్మికులు మూకుమ్మడిగా ఈ నిరసనకు దిగడం గమనార్హం.

వీరంతా పలు నిర్మాణ సంస్థల్లో పనిచేస్తుండగా కొన్నాళ్ల పాటు అరకొర ఆకలి తీర్చిన సంస్థలు లాక్ డౌన్ పొడగించుకుంటూ పోతుండడంతో చేతులెత్తేశాయి. ఫలితంగా రోడ్డున పడ్డ కూలీలకు గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేవని ధర్నాకు దిగారు. వీళ్ళు కేవలం ఒక ప్రాంతంలో అసహనం వెళ్లగక్కిన వాళ్లే కాగా ఇలాంటి ఎందరో అభాగ్యులు ఇటు మన నగరం నుండి అటు ఢిల్లీ వరకు లక్షల్లో ఉన్నారు.

తాజాగా ఢిల్లీ, బెంగాల్ లో రైళ్లు రాకపోకలు మొదలవనున్నాయని తెలిసిన వలస కూలీలు వేలసంఖ్యలో రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వీరంతా ఎక్కడ తలదాచుకున్నారో ఇప్పటి వరకు ఆ ప్రభుత్వాలకు కూడా అంతుబట్టలేదు. అయితే, ప్రభుత్వాలు ఏ ఒక్కరినీ ఆకలితో ఉండనివ్వమని చెప్తున్న మాటలు ఎందుకు అమలు కావడం లేదన్నదే ఇక్కడ ఆసక్తిరేపుతున్న ప్రశ్న.

నిజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వద్దగానీ.. కేంద్ర ప్రభుత్వం వద్ద గానీ వలస కూలీలు ఎన్ని లక్షలలో ఉన్నారో.. ఏయే రంగంలో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా కనీస అంచనాలు లేవు. ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే సామాజిక దూరం పాటించాల్సిన ఇలాంటి విపత్కర పరిస్థితులలో అసలు వీరందరికీ ప్రభుత్వం వసతి, తిండి కల్పించడం జరగని పని. అందుకే లాక్ డౌన్ మొదలై వారాలు గడుస్తున్నా వలస బతుకులు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నాయి.

అన్ని సౌకర్యాలు ఉండి ఇంట్లోనే ఉండమంటే కష్టంగానే భావిస్తున్న సమయం ఇది. అలాంటిది చిన్న పట్టా గుడిసెలో అరడజను మంది ఉంటూ ఏ గంజో తాగి కాలం వెళ్లదీస్తున్న జీవితాలు ఇప్పుడు ఆ గంజి కూడా దొరకకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వాలు వీరికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండానే సరుకులు పంపిణీ చేస్తున్నా అవి చేరని కుటుంబాలు దేశవ్యాప్తంగా లక్షలలో ఉన్నట్లుగా వారి మాటలను బట్టి తెలుస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిక్కడ ఉచితంగా ఆహారం అందించేలా పలుచోట్ల అన్నపూర్ణ వాహనాలను ఏర్పాటు చేయగా అక్కడ నిత్యం వేలసంఖ్యలో పేదలు, కూలీలు ఆహారం తింటున్నారు. ఇది కూడా అందనివారు ఎందరో ఉన్నారంటే నమ్మితీరాల్సిందే. అంతకంతకు లాక్ డౌన్ పెరిగిపోవడం.. వలస కూలీలకు కష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఎలాగయినా సొంత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలనే సంకల్పం బలమవుతుండంతో రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వాలు ఆదేశాలిస్తున్నా.. వలస కార్మికులు స్థితిగతులపై పూర్తిస్థాయి డేటా లేని కారణంగానే దేశంలో ఇంకా ఈ పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది!

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle