newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ప్రభుత్వాలను కూల్చిన ఉల్లి మల్లీ కొండెక్కింది

25-11-201925-11-2019 10:39:04 IST
2019-11-25T05:09:04.652Z25-11-2019 2019-11-25T05:09:00.270Z - - 22-02-2020

ప్రభుత్వాలను కూల్చిన ఉల్లి మల్లీ కొండెక్కింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన జోలికి వస్తే వంటింట్లో మహిళల కంట నీరు పెట్టించే ఘాటు ఉల్లి సొంతం. అంతే కాదు.. భారతదేశంలో ప్రభుత్వాలనే కూల్చివేసిన ఘనత కూడా ఉల్లి సొంతమే. అలాంటిది తెలంగాణలో ఉల్లి మళ్లీ చుక్కలంటింది. కేంద్రప్రభుత్వం లక్ష టన్నుల ఉల్లిని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రకటించినా ఉల్లి ఘాటు తెలంగాణలో మాత్రం తగ్గడం లేదు. ఇదే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో నెల క్రితం కూడా చిన్న రకం ఉల్లిని టెంపోల్లో తెచ్చి 4 కిలోలు వందరూపాయలకు అమ్మిన చరిత్ర కూడా చూశాం. సరిగ్గా నెలరోజులు కాకముందే ఉల్లి సాధారణ రకం కిలో 70 రూపాయలు పలుకుతోంటే మేలిరకం ఉల్లి కిలో వంద రూపాయలకు చేరింది. పైగా మరో ఇరవై రోజుల వరకు ఉల్లి ధర తగ్గే పరిస్థితి ఉండదని సంకేతాలు వెలువడుతుండంతో వినియోగదారుల హతాశులవుతున్నారు.

ఒకవైవు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కిలో ఉల్లిని 25 రూపాయలకే అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వమే రెండు వారాలక్రితం ప్రకటించి అమలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం అదే ఉల్లి కొండెక్కి కూచోవడం ఏంటి అనేది సందేహాలకు తావిస్తోంది. ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టి, విదేశాలకు ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధించడంతోపాటు దేశంలోని వ్యాపారుల వద్ద ఉండే ఉల్లి నిల్వలపై పరిమితులను విధించింది. రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోరాదని స్పష్టం చేసింది. అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిమితులపై నిఘా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎక్కడా అదనపు ఉల్లి నిల్వలపై విజిలెన్స్‌ దాడులు జరిగిన దాఖలాలు లేవు.

కర్ణుడి చావుకు పలు కారణాలన్నట్లు తెలంగాణలో ఉల్లి కొరతకు, ధరలపెంపుకు ప్రధాన కారణం ఉల్లి సాగు దారుణంగా పడిపోవడమేనని వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 13వేల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది అది 5వేల హెక్టార్లకే పరిమితమైంది. ఉల్లి సమృద్ధిగా పండే ఆలంపూర్, నారాయణఖేడ్, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది పంట చాలా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మహారాష్ట్రలోని పూణే, ఔరంగాబాద్, కర్ణాటకలోని బగల్‌కోఠ్, కొల్హాపూర్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గడం కూడా తెలంగాణ అవసరాలను దెబ్బతీసింది. 

రాష్ట్రంలో ఈ ఏడాది జూన్‌లో క్వింటాలు ధర కనిష్టంగా రూ.310, గరిష్టంగా రూ.1,520 వరకూ ఉండగా అవి సెప్టెంబర్‌ నుంచి పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.4,500, అక్టోబర్‌లో రూ.4,070కు చేరింది. ప్రస్తుతం క్వింటాల్‌ను రూ.4,650 వరకూ విక్రయిస్తున్నారు.

చుక్కలంటిన ఉల్లికి పరిష్కారం చాలా సింపుల్..!

చుక్కలంటిన ఉల్లికి సింపుల్ పరిష్కారం ఉంది. పై గణాంకాలే ఏ నెలలో ఉల్లి ధర ఏమేరకు ఉంటోంది అనేది స్పష్టం చేస్తున్నాయి. ఉల్లిపాయ పడకుండా ఏ కూర కూడా చేయని పరిస్థితి మన కుటుంబాల్లో సహజంగా ఉంటోంది. కిలో ఉల్లి 70 నుంచి 100 రూపాయల వరకు పెరిగిన వాస్తవం కళ్లముందు కదులాడుతుంటే ఉల్లిని అంత ధరపెట్టి కొనాలంటే మనసొప్పదు. అలాగని ఉల్లి లేకుండా ఏ కూరకూ రుచి రాదు. ప్రతి సంవత్సరం వేసవిలో చుక్కలు చూపుతున్న ఉల్లి ధరలను అరికట్టడం ప్రభుత్వాల బాధ్యతే కాదనం. 

కానీ కాస్త అంచనాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం అలవాటు చేసుకుంటే కిలో ఉల్లి వంద పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉండదు. ఉల్లిని అధిక ధరకు కొనకుండానే ప్రతి రోజు వంటలో దాన్ని భాగం చేయాలంటే సులువైన పరిష్కారం ఉంది. ఆగస్టు నుంచి నవంబర్ నెలల వరకు ఉల్లి ధర సాధారణంగానే గరిష్ట స్థాయికి పెరుగుతుంటాయని గణాంకాలు చూపుతున్నాయి కదా. ఉల్లి ధరలను నియంత్రించడానికి ఈ నాలుగైదు నెలల కాలంలో ప్రబుత్వమే మినీ టెంపోలను పెట్టి ఉల్లిని తక్కువ ధరలకు అమ్ముతోంది. చివరికి వీధుల్లోకి, ఇంటి ముందర సందుల్లోకి కూడా ఈ టెంపోలు వచ్చి ఉల్లిని తక్కువ ధరకే అమ్ముతున్నాయి.

కాబట్టి మన వీధిలోకి, సందులోకి ఉల్లి టెంపో వచ్చినప్పుడు, లేక బజారుకు పోయినప్పుడు ఉల్లి టెంపోని గమనించినప్పుడు అక్కడ అమ్మేది చిన్న ఉల్లి అని పట్టించుకోకుండా అయిదారు కిలోల ఉల్లిని ముందస్తుగా కొనుగోలు చేసి తెచ్చుకుంటే ఏ కుటుంబానికైనా అవి రెండు, మూడు నెలలపాటు వాడకానికి సరిపోతాయి. ప్రతి సీజన్‌లోనూ కూరగాయల ధరలు తగ్గే, పెరిగే సందర్భం తప్పనిసరిగా ఉంటోంది కనుక మన అంచనాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కాస్త  పెంచుకుని తక్కువ ధర ఉన్నప్పుడు కాస్త ఎక్కువగా కొనిపెట్టుకుంటే ఎక్కువ ధర పలికిన సమయంలో కొనుగోలు చేయకుండా కొంతవరకు ధరలను మనమే అదుపులో ఉంచుకోవచ్చు.

ఇది సమగ్ర, శాశ్వత పరిష్కారం కాదు కానీ తక్కువ ధరలకు ఆపర్ చేస్తున్నప్పుడు ఇప్పటికే ఇంట్లో ఉన్నాయిలే అని తాత్సారం చేయకుండా అదనంగా కొని పెట్టుకుంటే ధర పెరిగే తదుపరి నెలల్లో వాటిని కొనకుండా పాత స్టాక్‌నే వాడుకోవచ్చు. మరి చేసి చూద్దామా.. రైతుల వద్ద కొనుగోలు చేసేటప్పుడు బేరం ఆడకూడదు కానీ నిల్వలను దాచి ఉంచి కాస్త పెరగ్గానే ఇంకా వాటి ధర పెరిగేలా చేస్తున్న నల్లబజారు వ్యాపారుల చేతిలో బకరాలు కావద్దంటే ముందస్తుగా ప్రతి వినియోగదారులూ మేలుకోవలిసిందే మరి.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle