newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడం వల్లే కరోనా అదుపు తప్పింది.. పీసీసీ చీఫ్ ఉత్తమ్

17-07-202017-07-2020 07:18:59 IST
Updated On 17-07-2020 12:17:01 ISTUpdated On 17-07-20202020-07-17T01:48:59.334Z17-07-2020 2020-07-17T01:48:56.809Z - 2020-07-17T06:47:01.052Z - 17-07-2020

ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడం వల్లే కరోనా అదుపు తప్పింది.. పీసీసీ చీఫ్ ఉత్తమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరుకు ఉస్మానియా ఆస్పత్రి వాననీటిలో మునగడమే నిదర్శనమని దుయ్యబట్టారు. వాన నీటిలో మునిగిన పడకలతో ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఖరి వల్లే హైదరాబాద్‌ నగరం కరోనాతో విలవిల్లాడుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రజలను వదిలేసి ఫాంహౌస్‌లో కాలయాపన చేస్తుండటం దురదృష్టకరమన్నారు. కాగా నాడు ఉస్మానియాలో కొత్త భవన నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్, బీజేపీలేనని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తిప్పకొట్టారు. 

బుధవారం కురిసిన భారీ వర్షంతో ఆస్పత్రి వార్డుల్లోకి నీళ్లు చేరిన విష యం తెలిసిందే. రెండోరోజు కూడా ఆస్పత్రిలో ఇబ్బందులు తప్పలేదు. వర్షపు నీటిలో ఉన్న పడకలను ఇతర గదులకు మార్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉత్తమ్‌ ఆధ్వర్యంలోని బృందం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించింది. నీట మునిగిన వార్డులను పరిశీలించింది. రోగులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంది. 

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంటే ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకు ఉస్మానియా ఆస్పత్రి వర్షపు నీటిలో మునిగిపోవటమే నిదర్శనమన్నారు. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో ఒకటైన ఉస్మానియా ఆస్పత్రిని తెలంగాణ వచ్చాక వరద నీటితో నింపటమే టీఆర్‌ఎస్‌ సర్కారు సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. 

సీఎం కేసీఆర్ వైఖరి వల్లే హైదరాబాద్‌ నగరం కరోనాతో విలవిల్లాడుతోందని పీసీసీ చీఫ్ ఆరోపించారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోకపోగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించట్లేదని, పైగా పాజిటివ్‌ కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఏపీ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం స్వల్పంగా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఏ అధికారం లేదని, ఆయనను కేవలం రబ్బర్‌స్టాంప్‌గా వాడుకుంటున్నారన్నారు.

రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే ఫీజుల మోత మోగుతోందని, పేదలు వెళ్తే అక్కడ బెడ్లు ఇవ్వని పరిస్థితి ఉందని, ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని ఉత్తమ్‌ ఆరోపించారు. ఇక వాన నీటిలో మునిగిన పడకలతో ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రజలను వదిలేసి ఫాంహౌస్‌లో కాలయాపన చేస్తుండటం దురదృష్టకరమన్నారు. 

ముఖ్యమంత్రి అసమర్థత, ముందుచూపు లేకపోవటం వల్లే హైదరాబాద్‌ గజగజలాడుతోందన్నారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి బదులు సీఎం తన మూఢనమ్మకాలతో సెక్రటేరియట్‌ కూలగొడుతుండటం దారుణమన్నారు. ఇందుకోసం వెచ్చించే నిధులను వెంటనే ఉస్మానియా ఆస్పత్రి బాగుకు కేటాయించాలని ఉత్తమ్‌ కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, నాయకులు ఫిరోజ్‌ఖాన్, గౌస్‌ తదితరులున్నారు.

ఉత్తమ్‌పై మండిపడ్డ తలసాని

పాతబడిపోయిన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చి కొత్త భవనం కట్టేందుకు ముఖ్యమంత్రి ఆరోజు నిర్ణయిస్తే..హెరిటేజ్‌ భవనం ఎలా కూలుస్తారంటూ అడ్డుకున్నది కాంగ్రెస్, బీజేపీలేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిని మంత్రి సందర్శించి రోగులు, వైద్యులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారని గుర్తుచేశారు. 

ఉస్మానియాలోని మొత్తం 11 బ్లాకుల్లో 8 బ్లాక్‌ల పరిస్థితి అధ్వానంగా మారినట్టు అధికారులిచ్చిన నివేదిక మేరకు కొత్త ఆస్పత్రి నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం హెరిటేజ్‌ జాబితాలో ఉందని, కూల్చివేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించారని తలసాని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ్, వీహెచ్‌లు అడ్డుకున్న వీడియోలను మంత్రి తలసాని ప్రదర్శించారు.

నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌ని మూసివేయనున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పారు. కార్యాలయంలో పనిచేస్తున్న చాలామంది సిబ్బందికి కరోనా సోకడం, పార్టీ కార్యదర్శి సైతం కరోనా బారిన చిక్కుకోవడంతో కరోనా వైరస్ విస్తరించకుండా మొత్తం భవనాన్ని పరిశుద్ధం చేయడానికి గాంధీ భవన్‌ని మూసివేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle