newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ప్రభుత్వం చెప్పిన పంటే రైతు సాగు.. సాధ్యమయ్యే పనేనా?!

15-05-202015-05-2020 09:04:44 IST
Updated On 15-05-2020 10:47:47 ISTUpdated On 15-05-20202020-05-15T03:34:44.191Z15-05-2020 2020-05-15T03:34:42.196Z - 2020-05-15T05:17:47.379Z - 15-05-2020

ప్రభుత్వం చెప్పిన పంటే రైతు సాగు.. సాధ్యమయ్యే పనేనా?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రాష్ట్ర విభజన అనంతరం సాగు విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం పెరగడంతో దిగుబడులు కూడా పెరిగాయి. ఇది కేసీఆర్ సాధించిన ఘనతా? లేక టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతా అంటే లెక్కలువేసుకొనే పరిస్థితులు కూడా మన దగ్గర లేవు. కాకపోతే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క తెలంగాణలోనే ఎకరాలతో సంబంధం లేకుండా.. ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలున్నా కటాఫ్ లేకుండా ఎకరాకు 8 వేలు నగదును బ్యాంకు ఖాతాలకు జమచేశారు. ఇప్పుడు దాన్నే పదివేలకు కూడా పెంచారు. ఇది దేశంలో ఎక్కడా లేదు.

తెలంగాణ సాగు విస్తీర్ణంలో రైతు బంధు కూడా ఒక కారణం కావచ్చని ఒక అంచనా అయితే ఉంది. మొత్తంగా ఒకప్పుడు ఏపీలో కృష్ణా, గోదావరి విస్తీర్ణంలో సాగయ్యే విధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా సాగు జరుగుతుంది. అయితే.. సీఎం కేసీఆర్ ఇప్పుడు ఇదే అదనుగా రాష్ట్ర వ్యవసాయంలో కొత్త సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నారు. అందులో భాగంగా ముందు పంట సాగు విధానంలో మార్పు తేవాలని చూస్తున్నారు. మూస పద్ధతిలో అందరూ ఒకే పంట కాకుండా ప్రస్తుతమున్న డిమాండ్ ఎంత.. దిగుబడి వచ్చే నాటికి పరిస్థితుల అంచనా వేసి రైతులకు ఏ పంట వేయాలో సూచించనున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా సీఎం కేసీఆర్ మాత్రం తాము చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు నగదు చెల్లింపులు చేస్తామని ఒకవిధంగా రైతులను బెదిరింపులు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం మద్దతుధరకి కొనుగోలు చేయాలంటే పంట సప్లై, డిమాండ్ అనుకూలంగా ఉండాలంటున్నారు. ప్రజా అవసరాలను బట్టి పంటల ఎంపిక ఉండాలని.. పట్టణాలకు దగ్గరలో కూరగాయల సాగు విరివిగా ఉండాలని.. మిగతా రాష్ట్రంలో ప్రాంతాన్ని భట్టి ఈ ఎంపిక ఉండాలని సీఎం అధికారులకి సూచించినట్లుగా తెలుస్తుంది.

అయితే దీనిపై ఒకవిధమైన వ్యతిరేక వ్యాఖ్యలు.. విమర్శలు కూడా మొదలవగా టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది ఇంకా ఆలోచన దశలోనే ఉందని.. ఆచరణ వరకు రాలేదంటున్నారు. కానీ కేసీఆర్ శైలి చూస్తే ఇప్పటికే అయన దాదాపుగా ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. అయితే.. నిజంగానే ఇది రాష్ట్ర వ్యవసాయం రంగంలో మార్పు తెస్తుందా? అటు రైతులతో పాటు ప్రభుత్వానికి.. ప్రజలకు ఈ విధానంతో మేలే జరుగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.

ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ముందు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అటు రైతులు.. ఇటు ప్రభుత్వం కూడా నిండా మునిగిపోతుంది. ప్రభుత్వం సూచించే పంట రైతు భూమికి సరిపోతుందా లేదా అన్నది నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం ఇందు కోసం పక్కాగా భూసార పరీక్షలు నిర్వహించాలి. కొన్ని దశాబ్దాలుగా ఈ పరీక్షలు చేస్తూనే ఉన్నా వ్యవసాయ రంగంలో మార్పులు మాత్రం రాలేదు.

అందుకు కారణం కూడా వ్యవసాయ అధికారులే.. ప్రభుత్వం ఉద్యోగుల వ్యవహారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కనుక ఇకపై చేసే భూసార పరీక్షలలో పారదర్శకత తేవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం సరైన పంట ఎంపిక చేయగలదు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఆ పంట డిమాండ్ లేకపోయినా ఆ నెలకు సరిపడే పంట అదే కనుక ప్రభుత్వం పంట కొనుగోలు చేసి మరోప్రాంతానికి తరలించాల్సి వస్తుంది. ఇది ప్రధాన సమస్య.

ఇక మరోసమస్య నాణ్యమైన విత్తనాల సరఫరా. స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలైనా ఇప్పటికీ మహమ్మారిని రూపుమాపలేక మన ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతున్నాయి. అయితే తెలంగాణ తెచ్చే నూతన విధానంతో ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసి.. పంటను కూడా చీడపీడల నుండి రక్షణగా ప్రభుత్వమే చేదోడుగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

ఇక చివరిగా కౌలు రైతుల సమస్య కేసీఆర్ అనుకున్న ప్రణాళిక బద్ద వ్యవసాయానికి ప్రధాన అడ్డంకిగా కనిపిస్తుంది. కేసీఆర్ పంట వస్తేనే రైతుబంధు అన్నారు. నిజానికి రాష్ట్రంలో వేల హెక్టార్లలో సాగు కౌలు రైతు చేస్తుంటే రైతు బంధు మాత్రం భూమిగల రైతులకు అందుతుంది. హైదరాబాద్ సహా ఎక్కడెక్కడో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న ఎందరికో ఈ రైతుబంధు అందుతుంది।

రాష్ట్రంలో సాగుచేస్తున్న కౌలు రైతుకు న్యాయం జరగడం లేదని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా అయన పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కారణం కౌలు రైతుల కోసం దేశంలో ఎక్కడా సరైన ప్రణాళికలు లేవు. ఇప్పటివరకు నోటి మాటగానే ఈ సాగు జరిగిపోతుంది. మరి ఇప్పుడు చెప్పే ప్రణాళికాబద్ధ వ్యవసాయంలో ఇదే పెద్ద చిక్కుకానుంది. ఒకవిధంగా కౌలు రైతుకు ఇటు రైతు బంధు అందక.. అటు ఇష్టమైన పంట వేసుకొనే స్వేచ్ఛ లేక ఎవరికో ఆదాయం కోసం తాను కష్టాలు పడి సాగు చేయాల్సి వస్తుంది.

పైన చెప్పిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలలో కూడా ప్రభుత్వం కసరత్తులు చేసి జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. లేదంటే ప్రస్తుతం గాడిన పడింది అనుకుంటున్న సాగు రైతుకి మరింత భారం అవుతుంది. మరి ఈ అడ్డంకులను దాటుకొని కేసీఆర్ ప్రణాళిక బద్ద వ్యవసాయానికి నాంది పలికి విజయం సాధించి దేశానికి ఆదర్శం కాగలరా?. అన్నట్లు త్వరలోనే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని టేకప్ చేసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్దమవుతుంది. మరి సీఎం సాబ్ ఈ అంశాన్ని ఎలా తీరందాటిస్తారో చూడాల్సి ఉంది.

 

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   2 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   3 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   4 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   4 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle