newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రపంచంలోనే హైదరాబాద్ నెంబర్ వన్ !

20-01-202020-01-2020 07:54:25 IST
2020-01-20T02:24:25.516Z20-01-2020 2020-01-20T02:19:15.278Z - - 16-04-2021

ప్రపంచంలోనే హైదరాబాద్ నెంబర్ వన్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలో ఎన్నో నగరాలున్నా మన హైదరాబాద్ కి ఏది సాటిరాదు. మన తెలుగు రాష్ట్రాల ప్రజల ఫీలింగ్ ఇదే కాగా ఇప్పుడు ప్రపంచం కూడా అదే మాట చెప్తుంది. హైదరాబాద్ నగరానికి మించిన నగరం మరొకటి లేదని మరోసారి రుజువైంది. జెఎల్‌ఎల్ సిటి మోమెంటమ్ ఇండెక్స్ 2020 రిపోర్ట్‌లో హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా మొదటి స్థానంలో నిలిచి వాహ్ అనిపించింది.

ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 130 సిటిలలో సర్వే నిర్వహించింది. ఈసర్వేలో టాప్ 20లో భారత్‌లోని ఏడు పట్టణాలు చోటు దక్కించుకోగా హైదరాబాద్ మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. హైదరాబాద్ తరవాత రెండో స్థానంలో బెంగళూరు, ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో ఢిల్లీ నగరాలు దక్కించుకోగా 12, 16, 20వ స్థానాలలో పూణె, కోల్‌కతా, ముంబయి నిలిచాయి.

ఆయా నగరాలలో వృద్ధిరేటు, ఎయిర్ కనెక్టివిటీ, రిటైల్ సేల్స్, పెట్టుబడులు, అద్దెలు, రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత, కార్పొరేట్ ప్రజెన్స్, అక్యుపయర్ డిమాండ్, ఇంజన్ రూమ్ పాపులేషన్ వంటి విభాగాల్లో జెఎల్‌ఎల్ సిటి మోమెంటమ్ సర్వే నిర్వహిస్తుంది. కాగా ఈ సర్వేలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలబడగా.. ప్రపంచాన్ని చుట్టేసే ఎయిర్ కనెక్టివిటీ అద్భుతమని సర్వే పేర్కొంది.

తాజాగా ఈ సర్వే 2020 రిపోర్ట్‌ని బంజరాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా అదే మాట చెప్పారు. ప్రధమ స్థానంలో నిలబడానికి హైదరాబాద్ నుండి గల ఎయిర్ కనెక్టివిటీ ప్రధాన కారణమన్నారు. దీంతోపాటు నగరంలో గల మౌలిక సదుపాయాలూ అగ్రస్థానం నిలబెట్టాయని చెప్పుకొచ్చారు.

నిజానికి.. రాష్ట్రం ఏర్పడే సమయానికే సదుపాయాల విషయంలో పరచిన విస్తరి మాదిరి ఉన్న హైదరాబాద్ ఏపీలో తలెత్తిన రాజకీయ కారణాలతో ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా రాకెట్ లా దూసుకుపోతుంది.

ఇలాంటి కారణాలకు తోడు వచ్చిన ప్రతి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు అందించడంతో నగరం బెస్ట్ ప్లేస్ గా మారిపోతుంది.

ఇక గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన శంషాబాద్ విమానాశ్రయం, మౌలిక సదుపాయాల కల్పన పాలసీలు.. అనంతరం వచ్చిన వైఎస్ వాటిని కొనసాగించడంతో హైదరాబాద్ సదుపాయాల విషయంలో నం1 స్థానం దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కూడా హైదరాబాద్ బ్రాండింగ్ దెబ్బతినకుండా కాపాడుకోవడంలో తెరాస పార్టీ సక్సెస్ కావడంతోనే ఫలితాలు ఇలా వస్తున్నాయని చెప్పుకోవాలి!

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle