‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’
22-02-202022-02-2020 16:04:46 IST
Updated On 22-02-2020 16:18:07 ISTUpdated On 22-02-20202020-02-22T10:34:46.001Z22-02-2020 2020-02-22T10:34:43.690Z - 2020-02-22T10:48:07.917Z - 22-02-2020

తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీయార్ అన్ని స్థానిక సంస్థలకు పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారన్నారు ఆర్థికమంత్రి తన్నీరు హరీష్ రావు. పఠాన్ చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాల పట్టణ ప్రగతి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు ప్రభుత్వ విధానాలను వివరించారు. కొత్త మునిసిపల్ చట్టాల ప్రకారం ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. కలెక్టర్ల సమక్షంలోనే బడ్జెట్ ప్లానింగ్ జరుగుతోందన్నారు. మునిసిపల్ ఆదాయంలో పది శాతం మొక్కల పెంపకానికి మాత్రమే ఖర్చు చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. పటాన్ చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్ పూర్, ఐడీఏ బొల్లారం మునిసిపాలిటీలలో దాదాపు రూ 30 కోట్ల నిధులు ఉన్నాయని, వాటితో ఈ ప్రాంతంలో వేగవంతంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అలసత్వం వహించవద్దని సూచించారు. ప్రతి మునిసిపాలిటీలో అధికారులు, చైర్మన్, పాలక పక్షాలు జవాబు దారీగా పనిచేయాలని, బాధ్యతారహితంగా ఉంటే పదవులు కోల్పోవడం ఖాయం అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీయార్ ఆదేశాలను, సూచనలను, హెచ్చరికలను హరీష్ రావు గుర్తుచేశారు. అవినీతి, లంచగొండితనం లేని పాలనను మునిసిపాలిటీలలో అందించాలన్నారు. ప్లాస్టిక్ రహిత తెలంగాణను నిర్మించుకోవటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల అదృష్టవంతులని, కొత్త చట్టం ప్రకారం మీ మున్సిపాలిటీకి ప్రతి నెల జీతాలు అందుతాయన్నారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాకు కోటిన్నర రూపాయలు నిధులు వస్తున్నాయన్నారు. పేద వాడు 75 గజాల స్థలం ఉంటే ఇళ్లు కట్టుకోవచ్చని ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రతి వార్డులో 85 శాతం మొక్కలు నాటి తీరాలన్నారు. చెత్త సేకరణలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అందరం కలసి పట్టణ ప్రగతికి పాటుపడాలన్నారు. కొత్త మునిసిపల్ చట్టాన్ని అంతా చదివి అర్థం చేసుకోవాలన్నారు. ఈ నెల 24 నుండి మార్చి 4 వరకు 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలవుతుందని, గ్రేవ్ యార్డ్, డంప్ యార్డ్,మురుగు కాల్వలు శుభ్ర పరచాలన్నారు. వార్డు వారీగా కమిటీలు పూర్తి చేయాలని, అధికారులు కౌన్సిలర్ల ద్వారా కమిటీలు వేసే విధంగా చూడాలన్నారు. ప్రతి మునిసిపాలిటీలో నర్సరీ ఏర్పాటుచేయాలన్నారు హరీష్ రావు. సింగూరు నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ లకు మంచి నీళ్ళు రెండు రోజులకు ఒకసారి అందిస్తాం. పెండ్లికి వచ్చిన వారికి మొక్కను అందించాలని, ఆ విధంగా పర్యావరణంలో మార్పు వైపు ప్రయత్నం చేయాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటీకి ఒక స్పెషల్ అధికారిని నియమించామన్నారు. ఈ సమ్మేళనంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల శాసన సభ్యులు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, ,వైస్ ఛైర్మన్లు ,కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
3 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
4 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
6 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
7 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
5 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా