newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ప్రతిపక్షాలకు కేసీఆర్ వార్నింగ్

24-10-201924-10-2019 16:22:19 IST
2019-10-24T10:52:19.807Z24-10-2019 2019-10-24T10:52:15.241Z - - 25-02-2020

ప్రతిపక్షాలకు కేసీఆర్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన వేళ కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ విజయం మా ప్రభుత్వానికి టానిక్ లాంటిదని, ఇంత భారీ మెజారిటీ లభించడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజలు ఆశలు నెరవేరుస్తాం. వారికి ధన్యవాదాలు తెలుపుతాను. భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. హజూర్ నగర్ లో ఈసీ అనుమతిస్తే శనివారం సభ పెడతాం అన్నారు. సైదిరెడ్డి విజయానికి సహకరించిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అభినందించారు. 

మంచి విజయం సాధించిన కార్యకర్తలకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాలు తమ ధోరణి మార్చుకోవాలన్నారు. రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతోందని, ప్రజల్ని తప్పుదారి పట్టించడం మానుకోవాలన్నారు.

విపక్షాలు గోల్ మాల్ రాజకీయాలు చేయవద్దన్నారు. తమ ప్రభుత్వానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం టానిక్ లాంటిదన్నారు. విపక్షాలను ప్రజలు పట్టించుకోలేదన్నారు. వారికి  తగిన విధంగా బుద్ది చెప్పారు. ప్రతిపక్షం తమ పంథా మార్చుకోవాలన్నారు.

ప్రతిపక్షం ఉండాలి కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షం కావాలి. రాజకీయాల కోసం పచ్చి అబద్ధాలు చెప్పారు. హుందాగా విమర్శలు చేయండి. ప్రతిపక్షాలు మాపై వ్యక్తిగత విమర్శలు చేశాయన్నారు. హుజూర్ నగర్ పర్యటనకు బయలుదేరితే తనపై విమర్శలు చేశారని, తన హెలికాప్టర్ తనిఖీ చేయాలని కోరారని కేసీఆర్ మండిపడ్డారు.

తన హెలికాప్టర్లో డబ్బులు తీసుకెళుతున్నామని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.  ఏ అంశాన్ని ఎత్తుకోవాలో ప్రతిపక్షాలకు తెలియదన్నారు. అధికారం శాశ్వతం కాదు. మీరు అధికారంలోకి రావచ్చు. అధికారం ఉన్నా లేకున్నా నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle