newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రజా సేవలో నేతలు.. తెలంగాణ కావాలి ఆదర్శం!

03-04-202003-04-2020 14:31:05 IST
Updated On 03-04-2020 14:35:59 ISTUpdated On 03-04-20202020-04-03T09:01:05.625Z03-04-2020 2020-04-03T09:01:03.780Z - 2020-04-03T09:05:59.294Z - 03-04-2020

ప్రజా సేవలో నేతలు.. తెలంగాణ కావాలి ఆదర్శం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పుణ్యమా అని కొందరు నేతలలో సమాజం పట్ల కొంత గౌరవం పెరుగుతుంది. ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన నేతలలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తరహా ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా పడగవిప్పి ప్రజలను కమ్మేస్తుంటే అధికారం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు ప్రజల మధ్యకు వచ్చి వారి కోసం చేతనైన సాయం అందిస్తున్నారు.

అధికార పార్టీలో నేతలు ముఖ్యంగా మంత్రులు అలుపెరగక సాహసాలు చేస్తున్నారు. పొరుగున ఉన్న ఏపీతో సహా తమిళనాడు, కర్ణాటక రాష్టాలలో మంత్రులు సమీక్షలు, అధికారులకు ఆజ్ఞలతోనే కాలం సరిపోతుంటే తెలంగాణలో మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకి వెళ్లి పరిస్థితులను అంచనా వేస్తూ భరోసా కల్పిస్తున్నారు. ఆరోగ్య మంత్రి ఈటల తో పాటు హరీష్ రావు, ఎర్రబెల్లి వంటి వారు ముమ్మరంగా చక్కర్లు కొడుతున్నారు.

ఇక రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా బీజేపీ నేతలు తమ వంతుగా ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ఆ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పటికప్పుడు జిల్లాలలో పర్యటిస్తూ కొన్ని నిత్యావసరాల సరుకులను పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. బీజేపీ జిల్లాల శాఖలు కూడా విస్తృతంగా ప్రజా సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రంలో బాధ్యతలను నిర్వహిస్తూనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను తెలుసుకోవడం హర్షించదగిన విషయంగా చెప్పుకోవాలి.

కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు నేతలు సేవా కార్యక్రమాలలో ముందున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో కొందరు నేతలు లాక్ డౌన్ కి ముందే శానిటైజర్లు, మాస్కులు ఉచిత పంపిణీ నిర్వహించగా లాక్ డౌన్ లో కొందరు నేతలు అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎమ్మెల్యే సీతక్క లాంటి కొందరు పేదలకు సరుకుల పంపిణీలు చేపట్టారు. సీతక్క ములుగు జిల్లాలో కనీసం రవాణా సౌకర్యం లేని అడవులలోని సంచార జాతుల వద్దకు కూడా సరుకులతో ట్రాక్టర్ మీద వెళ్లి పంపిణీ చేశారు.

దేశంలోనే తొలి కరోనా కేసు దక్షణాది రాష్ట్రమైన కేరళలో నమోదైంది. అక్కడ ఇప్పటికీ ప్రజలపై కఠిన ఆంక్షలు లేవు. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధించిన తొలి రెండు మూడు రోజులలో కఠినంగా వ్యవహరించారు. అనంతరం ప్రజలలోనే అవగాహనా పెరిగింది. ప్రభుత్వం, నేతలు, పోలీసులు ప్రజలపట్ల వ్యవహరించే విధానమే దీనికి ప్రామాణికంగా కనిపించింది.

కానీ మిగతా దక్షణాది రాష్ట్రాలైన ఏపీతో సహా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రజలు, ప్రభుత్వాల మధ్య గందరగోళం కనిపిస్తుంది. అధికార పార్టీలు ప్రజలను కరోనాను కట్టడి చేయడం ఏమో కానీ ప్రజలను కట్టడి చేసేందుకే అష్టకష్టాలు పడుతున్నారు. ఆ రాష్ట్రాలలో రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రజలకు దూరంగానే ఉండిపోతున్నారు. దీంతో ప్రజలలో ఓ వర్గం ప్రభుత్వ నిబంధనలను తప్పించుకొనేందుకే చూస్తున్నారు.

ఆయా రాష్టాలలో అధికార పార్టీలు పెత్తనం చెలాయించే క్రమంలో ప్రజలను ఆదేశిస్తున్నారే కానీ ప్రజల మధ్యకు వెళ్లి సాధక బాధకాలను తెలుసుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజలతో సరైన సంబంధాలు కనిపించకపోతే ఇక ప్రతిపక్షాలతో ప్రభుత్వాలకు సమన్వయం ఆశించడం తప్పే అవుతుంది. పార్టీలు ఏవైనా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేతలు కరోనా సేవకోసం ప్రజల మధ్యకి వెళ్లారు. ఇందులో ఇక్కడి నేతలకు క్రెడిట్ ఇవ్వకతప్పదు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle