newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రజల ప్రాణాలు కాపాడండి.. హక్కుల సంఘానికి పొన్నం ఫిర్యాదు

29-06-202029-06-2020 08:08:12 IST
Updated On 29-06-2020 20:33:01 ISTUpdated On 29-06-20202020-06-29T02:38:12.055Z29-06-2020 2020-06-29T02:37:47.671Z - 2020-06-29T15:03:01.884Z - 29-06-2020

ప్రజల ప్రాణాలు కాపాడండి.. హక్కుల సంఘానికి పొన్నం ఫిర్యాదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కేసుల తీవ్రత పెరుగుతోంది. సరైన వైద్యం అందక, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రాష్ట్ర మానవహక్కుల సంఘానికి లేఖ రాశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.

తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. కరోనా చికిత్స అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, టెస్టులు సరిగా చేయడం లేదని ఆయన ఆరోపించారు. చెస్ట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ లేక యువకుడు, గాంధీ ఆస్పత్రిలో ఒక బాలుడు మరణించారని తెలిపారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో జరిగిన ఘటనను, మరో సంఘటనను ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న‌ద‌ని త‌న ఫిర్యాదు లో తెలిపారు. ఆదివారం ప్రభుత్వ నిర్లక్ష్యంతో సరైన ట్రీట్మెంట్ అందక ఇద్దరు కరోనా పేషెంట్ లు మృతి చెందిన‌ట్టు పొన్నం తెలిపారు. మృతి చెందిన వారిలో ఒక‌రు హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యంతో ఆక్సిజన్ అందక చ‌నిపోయాడ‌ని, అతను సెల్ఫీ వీడియో తీసి పంపించాడని అన్నారు. ఆక్సీజ‌న్ అంద‌క‌నే తాను చనిపోతున్నట్టు ఆ వ్య‌క్తి ఒక వీడియో ద్వారా వారి కుటుంబీకులకు తెలియజేశాడని, ఇది చాలా దారుణమయిన విషయమన్నారు. 

మరో సంఘ‌ట‌న‌లో నారాయణఖేడ్ మండలం, నిజాంపేట గ్రామానికి చెందిన 8 నెలల బాలుడికి క‌రోనా సోక‌డంతో గాంధీ హాస్పిటల్ లో చేర్చార‌ని, వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైనందున ఆ బాలుడు మరణించాడని తెలిపారు . వీటి పైన విచారణ జరిపించి, దోషుల పైన చర్యలు తీసుకోవాలని పొన్నం కోరారు. రాష్ట్రంలో జరిగిన ఈ రెండు సంఘటనలను మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకువస్తున్నామ‌న్నారు. ఈ సంఘటనలకు సంబంధించి టీవీ ఛానల్లో ప్రసారమైన లింకును జత చేశారు. రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ వెంటనే స్పందించాలని ఆయన కోరారు. కరోనా నేప‌థ్యంలో మానవ ప్రాణాలకు రక్షణ కల్పించి వారు జీవించేందుకు సరైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. అంతకుముందు 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.  రైతుబంధు పథకానికి మరియు వరంగల్ అర్బన్ జిల్లాకి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీరాంసాగర్ కాలువతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీకి, ఒక యూనివర్సిటీకి కూడా ఆయన పేరు పెట్టాలని అయన తన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle