newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రగతి భవన్ వద్ద యువకుడి హల్ చల్.. సర్కార్‌‌కి హైకోర్టు కీలక ఆదేశాలు

09-07-202009-07-2020 10:46:50 IST
Updated On 09-07-2020 10:49:57 ISTUpdated On 09-07-20202020-07-09T05:16:50.172Z09-07-2020 2020-07-09T05:16:23.469Z - 2020-07-09T05:19:57.836Z - 09-07-2020

ప్రగతి భవన్ వద్ద యువకుడి హల్ చల్.. సర్కార్‌‌కి హైకోర్టు కీలక ఆదేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజలతో పాటు కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ప్రగతిభవన్‌ ఎగ్జిట్‌ గేటు వద్ద ప్ల కార్డు పట్టుకుని నిరసన తెలిపి మెరుపు వేగంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు.

ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్‌లో రాసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి నిరసనకారుడు ఎవరనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

ఇటు హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.  ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ బి. నాగేందర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల లక్షణాలు కనిపించిన కరోనా రోగికి వైద్యం చేసిన నేపథ్యంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు చెప్పారు.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం‌ తెలంగాణ‌లో గ‌త 24 గంట‌ల్లో 1,924 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి, 11 మంది మృతి చెందగా 324కి చేరింది మృతుల సంఖ్య‌. మొత్తం కేసులు 29,536కు పెరిగాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,28,438 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.

తెలంగాణలో వివిధ ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో, ఎంత మందికి ట్రీట్ మెంట్ చేస్తున్నారో, ఎన్ని బెడ్స్‌/వెంటిలేటర్స్‌ ఖాళీగా ఉన్నాయో.. అందరికీ తెలిసేలా లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఇప్పటికే ఢిల్లీలో వీటిని ఏర్పాటు చేశారని, అక్కడి సాఫ్ట్‌వేర్, టెక్నికల్‌ సమాచారాన్ని తెలుసుకుని రాష్ట్రంలోనూ అమలు చేస్తే ఎంతో ఉపయోగపడుతుందని బెంచ్ తెలిపింది.

కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించే ఆస్పత్రుల వద్ద లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ అడ్వకేట్ శివ గణేష్‌ కర్నాటి దాఖలు చేసి వ్యాజ్యాన్ని బుధవారం కోర్టు విచారించింది. డ్యాష్‌ బోర్డుల ఏర్పాటుపై ప్రభుత్వ వైఖరిని తెలపాలంది. డ్యాష్‌ బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సాఫ్ట్‌ వేర్‌ తయారు చేస్తోందని కోర్టుకు ఏజీ తెలిపారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle