newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రగతి భవన్.. తెలంగాణ భవన్.. మధ్యలో ఫామ్ హౌస్!

04-03-202004-03-2020 13:24:11 IST
2020-03-04T07:54:11.148Z04-03-2020 2020-03-04T07:54:08.995Z - - 15-04-2021

ప్రగతి భవన్.. తెలంగాణ భవన్.. మధ్యలో ఫామ్ హౌస్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ప్రతిపక్షాలు దాదాపుగా సైలెంట్ అయ్యాయి. కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి, బీజేపి నుండి ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు పార్టీకి ఒకరిద్దరు పోరాడుతున్నట్లుగా కనిపిస్తున్నా వీళ్ళ విమర్శలకు.. ఆరోపణలకు అధికార పార్టీలో అధిష్టానం నేతలు కాదు కదా కనీసం మంత్రుల స్థాయి నేతలు నుండి స్పందనరాక ఎవరో యువ ఎమ్మెల్యేలు సమాధానమిస్తున్నారు.

అంటే దాదాపుగా అధికార టీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ వార్ గా హవా కొనసాగిస్తుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు అదే ఇష్టం కూడా. వరస ఎన్నికల విజయావకాశాలు కావచ్చు.. కేసీఆర్ రాజకీయ చతురత కావచ్చు ప్రతిపక్షాలను అడ్డులేకుండా చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు ఉందంతా ఫుల్ లోడ్ అయిన సొంత పార్టీలో నేతలకు న్యాయం చేయడమే.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ గేట్లు ఎత్తేసి అందరినీ కారెక్కించుకున్న గులాబీ అధిష్టానం అప్పటి నుండే ఆ నేతలకు హామీలను ఇస్తూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించివాళ్లకు వివిధ కార్పొరేషన్లు.. చైర్మన్లు.. సీనియర్ నేతలకు రాజ్యసభ.. శాసన మండలి ఇలా ఎవరి స్థాయికి వాళ్ళకి హామీలను ఇస్తూ వచ్చారు.

ప్రస్తుతం ఒక్క గ్రేటర్ ఎన్నికలు తప్ప దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. వరస ఎన్నికలు.. పదవుల పంపకాలు.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు అన్నిటికీ ఆశావహుల నేతలు అధిష్టానం ఆమోద ముద్ర కోసం నానా హైరానాలు పడిపోతున్నారట. దీనికి కారణం ఒకవైపు ప్రగతి భవన్.. మరోవైపు తెలంగాణ భవన్.. మధ్యలో ఫామ్ హౌస్ అనే మాట వినిపిస్తుంది.

గతంలో ఇలాంటి వ్యవహారాలన్నీ పెద్దదిక్కుగా కేసీఆర్ ఒక్కరే చూసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతిదానిలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముద్ర కనిపిస్తుంది. పార్టీలో ఏం జరగాలన్నా కేటీఆర్ ఆమోదముద్ర కూడా కావాల్సిందేనని పార్టీ నేతలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అందుకే ఎన్నికల నుండి నామినేటెడ్ పదవుల వరకు అన్నిటికి నాయకులు కేటీఆర్ కోసం క్యూ కడుతున్నారు.

కేసీఆర్ ప్రగతి భవన్ నుండి పాలనా యంత్రాంగం నడిపిస్తున్నారు కనుక కొందరు నేతలు అక్కడకి వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుంటూనే కేటీఆర్ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ భవన్ వద్దకు కూడా వెళ్లి ఆశీర్వాదాలు పొందుతున్నారట. అయితే కొందరు మాత్రం తెలంగాణ భవన్ కేరాఫ్ గా మార్చేసుకొని ఏదైనా యువరాజు వద్దే తేల్చేస్తున్నారట.

ఇలాంటి వాళ్ళు ఏదొక పనిమీద ప్రగతి భవన్ కి వెళ్తే.. అక్కడ అన్నిటికీ తెలంగాణ భవన్ కి వెళ్తున్నారట.. పెద్దాయన మీ మీద కోపంగా ఉన్నారు.. అనే మాటలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలి... ఎవరిని ఏ సభకి పంపాలి.. రాష్ట్రంలో ఎవరుండాలి.. ఢిల్లీ ఎవరెళ్ళాలి అనేది సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే తేల్చేస్తారని టాక్ ఉంటుంది.

కనుక సిటీలో ఉన్న రెండు భవన్ లను సమన్యాయం చేసుకుంటూనే ఫామ్ హౌస్ వద్దకి రిపోర్ట్ మంచిగా ఉండాలన్నది ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలలో వినిపిస్తున్న ఇన్నర్ వాయిస్. అన్నట్లు ప్రస్తుతం రాజ్యసభ సీట్ల ఎంపిక కోసం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారు. గత రెండు రోజులుగా అక్కడే ఉంటూ రాజ్యసభ క్యాండిడేట్లను ఖరారు చేసే పనిలో ఉన్నారట!

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle