newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

03-07-202003-07-2020 14:40:00 IST
Updated On 03-07-2020 15:36:52 ISTUpdated On 03-07-20202020-07-03T09:10:00.377Z03-07-2020 2020-07-03T09:09:48.869Z - 2020-07-03T10:06:52.208Z - 03-07-2020

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతూనే వుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు క‌రోనా సెగ త‌గిలింది.. ఇక్క‌డ ప‌ని చేసే ఐదుగురు సిబ్బందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు..క‌రోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్ సోకినట్టుగా భావిస్తున్న అనుమానితుల‌ను హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఆరోగ్యంగా వున్నారని అధికారులు తెలిపారు. వీరిగురించి ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఉందని తేలడంతో..అధికారులు, వైద్య సిబ్బంది ప్రగతి భవన్ ను శానిటైజ్ చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో నివాస‌ముంటున్న కెసిఆర్ త‌న నివాసాన్ని గ‌జ్వేల్ లోని త‌న ఫామ్ హౌజ్ కి మార్చారు.. అక్క‌డ నుంచి ఆయ‌న అధికార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. 

తెలంగాణలో 1213 కరోనా కేసులు నమోదు కాగా, 8 మరణాలు సంభవించాయి. ఒక్క హైదరాబాద్ నగరంలో 998 కరోనా  కేసులు నమోదయ్యాయి.  తెలంగాణలో మొత్తం 18,570కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.  ఇందులో 9226 యాక్టివ్ కేసులు ఉండగా, 9069 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

ఎక్కడెక్కడ ఎన్ని కేసులంటే...

గ్రేటర్ హైదరాబాద్ 998

రంగారెడ్డి 48

మేడ్చల్ 54

సంగారెడ్డి 7

కరీంనగర్ 5

మహబూబ్ నగర్ 7

గద్వాల్ 1

సూర్యాపేట 4

ఖమ్మం 18

కామారెడ్డి 2

నల్లగొండ 8

సిద్దిపేట 1

ములుగు 4

వరంగల్ ఆర్ 10

జగిత్యాల 4

మహబూబా బాద్ 5

నిర్మల్ 4

మెదక్ 1

యాదాద్రి 1

నిజామాబాద్ 5

వరంగల్ అర్బన్ 9

భద్రాద్రి కొత్తగూడెం 7

నారాయణపేట 2

నాగర్ కర్నూలు1

రాజన్న సిరిసిల్ల 6

వికారాబాద్ 1

మొత్తం 1213 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle